హోమ్ /వార్తలు /బిజినెస్ /

RIL: జియో టెలికం టవర్లపై దాడులకు వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించిన రిలయన్స్

RIL: జియో టెలికం టవర్లపై దాడులకు వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించిన రిలయన్స్

RIL: జియో టెలికం టవర్లపై దాడులకు వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించిన రిలయన్స్ (File Images)

RIL: జియో టెలికం టవర్లపై దాడులకు వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించిన రిలయన్స్ (File Images)

Reliance Jio Infocomm Limited (RJIL): పంజాబ్, హర్యానాలో జియో టవర్లపై దాడులు చేస్తున్నది ఎవరు? ఎందుకు? అన్న అంశంపై రిలయన్స్ జియో టెలికం సంస్థ హైకోర్టును ఆశ్రయించింది.

RIL: రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూపులో భాగమైన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ (RJIL)... పంజాబ్, హర్యానా హైకోర్టులో రిట్ పిటిషన్ (writ petition) వేసింది. జియోకి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తూ... జియో టెలికం టవర్లపై దాడులకు పాల్పడేలా ప్రేరేపిస్తున్న స్వార్థ శక్తులేవో దర్యాప్తు చేసి, కనిపెట్టాలని.... రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని... పిటిషన్‌లో కోరింది. ఈ దుష్ప్రచారాన్ని ఆపేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను ఆదేశించాలని కోరింది. ఈ దాడులకు పాల్పడిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కూడా పిటిషన్‌లో కోరింది. "జియో టెలికం, దాని మాతృ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి వ్యతిరేకంగా స్వార్థ శక్తులు కుట్రలు పన్నుతున్నాయి. తమ స్వార్థపూరితమైన అజెండాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ... అసత్యాలు, రూమర్లను ప్రచారం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 3 వ్యవసాయ సంస్కరణ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనలను అడ్డం పెట్టుకొని... రిలయన్స్ సంస్థలపై దాడులు చేసేలా ప్రేరేపిస్తున్నారు." అని పిటిషన్‌లోతె లిపారు.

ఈ దాడుల తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ... తాము జాతీయవాదానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. దేశంలో చైనా వస్తువులు వాడని టెలికం కంపెనీరిలన్స్ జియో మాత్రమే అని తెలిపింది. ఎయిర్ టెల్, వొడాఫోన్-ఐడియాలు... తమ పరికరాల్లో చాలా వరకూ చైనా ఉత్పత్తులనే వాడుతున్నాయని తెలిపింది. జియో స్వయంగా భారత దేశపు 5జీ టెక్నాలజీని అభివృద్ధి చేస్తోందనీ... భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోరుతున్న ఆత్మనిర్భర భారత్ అజెండా ప్రకారం రిలయన్స్ నడుచుకుంటోందని ఆ కంపెనీ తెలిపింది. విదేశీ శక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ దాడులు జరిపిస్తున్నట్లు జియో చెబుతోంది.

రిలయన్స్ జియో... ఇప్పటికే కేంద్ర టెలికం విభాగం (DoT), ట్రాయ్ (TRAI) రెండింటికీ... ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియాపై కంప్లైంట్ ఇచ్చింది. ఈ కంపెనీల్లో మెజార్టీ వాటా మల్టీనేషనల్ కంపెనీల చేతుల్లో ఉంది. ఆ కంపెనీలు... మార్కెట్‌లో పోటీ పడలేక ఇలా... డర్టీ గేమ్ ఆడుతున్నాయని జియో ఆరోపించింది. 2016లో జియా ప్రారంభమైనప్పుడు కూడా ఈ కంపెనీలు... తమ నెట్‌వర్కుకు ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వకుండా నాటకాలు ఆడాయని ఆరోపించింది. Dot, TRAI... రెండూ కూడా ఎయిర్ టెల్-వొడాఫోన్-ఐడియాపై రూ.3,000 కోట్ల పెనాల్టీలు వేశాయనీ... కానీ తెలియని కారణాలతో... టెలికం విభాగం... ఆ డబ్బును పొందలేదని వివరించింది. మరోసారి ఈ సంస్థలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునేందుకు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించింది.

అమెజాన్, వాల్‌మార్ట్ లాంటి భారీ అంతర్జాతీయ వ్యాపార వర్గాల నుంచి చిన్న వ్యాపారులు, రిటైలర్లను తాము మాత్రమే కాపాడుతున్నామని రిలయన్స్ రిటైల్ తెలిపింది. ఈ మల్టీ నేషనల్ కంపెనీలు... రిలయన్స్ రిటైల్ నాశనాన్ని కోరుకుంటున్నాయని... అందుకోసం ఇవి డబ్బును, పవర్‌ను ఉపయోగించి... చిన్న వ్యాపారుల కడుపు కొడుతున్నాయని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆరోపించింది. చిన్న వ్యాపారులు తట్టా బుట్టా సర్దేసుకుంటే... తాము రాజ్యమేలవచ్చని, మార్కెట్‌ను తమ చెప్పుచేతల్లో పెట్టుకోవచ్చని ఈ భారీ కంపెనీలు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించింది. ఈ కంపెనీలు ఈస్ట్ ఇండియా కంపెనీ విధానాలు పాటించాలని చూస్తున్నాయని, భారతీయుల మధ్య చిచ్చు పెట్టి... వారిలో వారే గొడవలు పడేలా చేస్తున్నాయని రిలయన్స్ ఇండస్ట్రీస్ మండిపడింది.

ఇది కూడా చదవండి:Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఎగిరిపడిన గర్భిణీ.. వైరల్ వీడియో

కార్పొరేట్ ఫార్మింగ్ చేయాలనే ఆసక్తి చాలా భారీ కార్పొరేట్ కంపెనీలకు ఉందనీ... కానీ ఆ ఉద్దేశం లేని తమపై అసత్య ప్రచారం చేస్తూ... తమను నిందిస్తున్నారని రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది.

Disclosure: Reliance Industries Ltd. is the sole beneficiary of Independent Media Trust which controls Network18 Media & Investments Ltd which publishes teluguNews18.

First published:

Tags: Reliance Industries, Reliance Jio

ఉత్తమ కథలు