హోమ్ /వార్తలు /బిజినెస్ /

Jio New Plan: జియో కొత్త ప్లాన్... ఒక్క రీఛార్జ్‌తో 50జీబీ డేటా

Jio New Plan: జియో కొత్త ప్లాన్... ఒక్క రీఛార్జ్‌తో 50జీబీ డేటా

Jio New Plan: జియో కొత్త ప్లాన్... ఒక్క రీఛార్జ్‌తో 50జీబీ డేటా
(ప్రతీకాత్మక చిత్రం)

Jio New Plan: జియో కొత్త ప్లాన్... ఒక్క రీఛార్జ్‌తో 50జీబీ డేటా (ప్రతీకాత్మక చిత్రం)

Jio New Plan | యూజర్లకు రిలయన్స్ జియో (Reliance Jio) శుభవార్త చెప్పింది. సరికొత్త ప్లాన్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది జియో. ఒక్క రీఛార్జ్‌తో 50జీబీ డేటా అందిస్తోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

రిలయన్స్ జియో మరో కొత్త ప్లాన్ ప్రకటించింది. డేటా ఎక్కువగా ఉపయోగించేవారి కోసం 4జీ డేటా యాడ్ ఆన్ ప్రీపెయిడ్ ప్యాక్ (Data Add on plan) తీసుకొచ్చింది. ప్రస్తుతం ఫిఫా వాల్డ్ కప్ ఖతర్ 2022 (Fifa World Cup Qatar 2022) జరుగుతున్న సంగతి తెలిసిందే. ఫుట్‌బాల్ లవర్స్ కోసం ఫుట్‍‌బాల్ వాల్డ్ కప్ డేటా ప్యాక్ (Football World Cup Data Pack) తీసుకొచ్చింది రిలయన్స్ జియో. రూ.222 ధరకు డేటా యాడ్ ఆన్ ప్లాన్ ప్రకటించింది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసేవారికి 50జీబీ డేటా లభిస్తుంది. 30 రోజుల పాటు డేటా వాడుకోవచ్చు. ఇందులో కాలింగ్ బెనిఫిట్స్ ఉండవు. కేవలం డేటా బెనిఫిట్స్ మాత్రమే లభిస్తాయి. 50జీబీ డేటా వాడుకున్న తర్వాత 64కేబీపీఎస్ వేగంతో అన్‌లిమిటెడ్ డేటా వాడుకోవచ్చు.

రిలయన్స్ జియో నుంచి మరిన్ని డేటా యాడ్ ఆన్ ప్యాక్స్ ఉన్నాయి. ఏ ప్యాక్ రీఛార్జ్ చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో తెలుసుకోండి.

Jio Rs 181 Data Add On Plan: జియో రూ.181 డేటా యాడ్ ఆన్ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 30జీబీ డేటా వాడుకోవచ్చు. వేలిడిటీ 30 రోజులు.

Jio Rs 241 Data Add On Plan: జియో రూ.241 డేటా యాడ్ ఆన్ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 40జీబీ డేటా వాడుకోవచ్చు. వేలిడిటీ 30 రోజులు.

Realme 10 Pro Series: భారీ ఫీచర్స్‌తో రియల్‌మీ 10 ప్రో, రియల్‌మీ 10 ప్రో ప్లస్ వచ్చేశాయి

Jio Rs 301 Data Add On Plan: జియో రూ.301 డేటా యాడ్ ఆన్ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 50జీబీ డేటా వాడుకోవచ్చు. వేలిడిటీ 30 రోజులు.

Jio Rs 555Data Add On Plan: జియో రూ.555 డేటా యాడ్ ఆన్ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 55జీబీ డేటా వాడుకోవచ్చు. వేలిడిటీ 55 రోజులు.

Jio Rs 2878 Data Add On Plan: జియో రూ.2878 డేటా యాడ్ ఆన్ ప్లాన్ రీఛార్జ్ చేస్తే రోజూ 2జీబీ డేటా వాడుకోవచ్చు. వేలిడిటీ 365 రోజులు.

Jio Rs 2998 Data Add On Plan: జియో రూ.2998 డేటా యాడ్ ఆన్ ప్లాన్ రీఛార్జ్ చేస్తే రోజూ 2.5జీబీ డేటా వాడుకోవచ్చు. వేలిడిటీ 365 రోజులు.

ఇవన్నీ డేటా యాడ్ ఆన్ ప్యాక్స్ మాత్రమే. ఇందులో కాలింగ్, ఎస్ఎంఎస్ లాంటి ఇతర బెనిఫిట్స్ ఏవీ ఉండవు. ఎక్కువ డేటా ఉపయోగించేవారికి మాత్రమే ఈ ప్లాన్స్ ఉపయోగపడతాయి. ఇక యాక్టీవ్ ప్లాన్స్ ఉన్నవారి కోసం డేటా వోచర్ ప్లాన్స్ ఉన్నాయి. అంటే ఒక రోజులో లభించే డేటా ఉపయోగించిన తర్వాత అదనంగా 4జీ డేటా వాడుకోవాలనుకుంటే 4జీ డేటా ఓచర్ రీఛార్జ్ చేయొచ్చు. మరి వీటిపై ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకోండి.

WhatsApp: మెటా అవతార్‌ ఫీచర్‌ వాట్సప్‌‌లో వచ్చేసింది... ఎలా పనిచేస్తుందంటే

Jio Rs 121 4G Data Voucher: జియో రూ.121 డేటా వోచర్ రీఛార్జ్ చేస్తే 12జీబీ డేటా లభిస్తుంది.

Jio Rs 61 4G Data Voucher: జియో రూ.61 డేటా వోచర్ రీఛార్జ్ చేస్తే 6జీబీ డేటా లభిస్తుంది.

Jio Rs 25 4G Data Voucher: జియో రూ.25 డేటా వోచర్ రీఛార్జ్ చేస్తే 2జీబీ డేటా లభిస్తుంది.

Jio Rs 15 4G Data Voucher: జియో రూ.15 డేటా వోచర్ రీఛార్జ్ చేస్తే 1జీబీ డేటా లభిస్తుంది.

First published:

Tags: FIFA World Cup 2022, Football, Jio, Jio Recharge Plans, Reliance Jio

ఉత్తమ కథలు