Jio-Dineout: డైన్‌అవుట్ ఫెస్టివల్‌లో జియో యూజర్లకు ఆఫర్లు

Reliance Jio-Dineout | జియో యూజర్లు మైజియో యాప్‌ ఓపెన్ చేసి కూపన్స్ సెక్షన్‌లో డిస్కౌంట్ కోడ్ పొందొచ్చు. మైజియో యాప్‌ లేని జియో సబ్‌స్క్రైబర్లు యాప్ డౌన్‌లోడ్ చేసుకొని డైన్అవుట్ ప్లాట్‌ఫామ్‌లో కూపన్స్ రీడీమ్ చేసుకోవచ్చు.

news18-telugu
Updated: August 1, 2019, 6:55 PM IST
Jio-Dineout: డైన్‌అవుట్ ఫెస్టివల్‌లో జియో యూజర్లకు ఆఫర్లు
Jio-Dineout: డైన్‌అవుట్ ఫెస్టివల్‌లో జియో యూజర్లకు ఆఫర్లు
news18-telugu
Updated: August 1, 2019, 6:55 PM IST
జియో యూజర్లకు గుడ్ న్యూస్. డైన్అవుట్ నిర్వహిస్తున్న గ్రేట్ ఇండియన్ రెస్టారెంట్ ఫెస్టివల్‌‌కు రిలయెన్స్ జియో డిజిటల్ పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తోంది. 2019 ఆగస్ట్ 1 నుంచి 2019 సెప్టెంబర్ 1 వరకు ఈ ఫెస్టివల్ జరుగుతోంది. గ్రేట్ ఇండియన్ రెస్టారెంట్ ఫెస్టివల్‌‌లో జియో యూజర్లకు ప్రత్యేకమైన బెనిఫిట్స్ లభించబోతున్నాయి. డైన్‌అవుట్‌ ద్వారా రిజర్వేషన్స్ చేసేవారికి సాధారణంగా బుకింగ్ ఫీజు ఉంటుంది. కానీ జియో యూజర్లు బిల్లుపై డిస్కౌంట్స్‌తో పాటు ఫుడ్, డ్రింక్స్, బఫెపై 1+1 ఆఫర్స్ పొందొచ్చు. డైన్ అవుట్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్న 17 పట్టణాల్లో మొదటి బుకింగ్‌పై జియో యూజర్లకు రూ.100 వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ ఎక్స్‌క్లూజీవ్ ఆఫర్ కేవలం జియో యూజర్లకు మాత్రమే.

జియో యూజర్లు మైజియో యాప్‌ ఓపెన్ చేసి కూపన్స్ సెక్షన్‌లో డిస్కౌంట్ కోడ్ పొందొచ్చు. మైజియో యాప్‌ లేని జియో సబ్‌స్క్రైబర్లు యాప్ డౌన్‌లోడ్ చేసుకొని డైన్అవుట్ ప్లాట్‌ఫామ్‌లో కూపన్స్ రీడీమ్ చేసుకోవచ్చు. ఆగస్ట్ 1 నుంచి సెప్టెంబర్ 1 వరకు జరిగే గ్రేట్ ఇండియన్ రెస్టారెంట్ ఫెస్టివల్‌‌లో టోటల్ బిల్, ఫుడ్ బిల్, డ్రింక్స్ బిల్, బఫెపై 50% తగ్గింపు ఆఫర్ చేస్తోంది డైన్అవుట్. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, పూణె, చెన్నై, అహ్మదాబాద్, చండీగఢ్, గోవా, జైపూర్ లక్నో, ఇండోర్, సూరత్, కొచ్చి, లుధియానా, నాగ్‌పూర్ నగరాల్లో ఈ ఫెస్టివల్ జరుగుతోంది.

BMW X7: ఇండియాలోనే బీఎండ్ల్యూ ఎక్స్7 తయారీ... కారు ఎలా ఉందో చూడండి




ఇవి కూడా చదవండి:

New Rules: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే భారీ జరిమానా... కొత్త ఫైన్స్ ఇవే

Amazon Freedom Sale: అమెజాన్‌లో 'ఫ్రీడమ్ సేల్'... ఆఫర్ల వివరాలివే
Loading...
WhatsApp: వాట్సప్ 1000 జీబీ ఇంటర్నెట్ డేటా ఉచితంగా ఇస్తోందా?
First published: August 1, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...