Reliance Jio: మోస్ట్ పాపులర్ బ్రాండ్‌గా రెండో స్థానంలో రిలయెన్స్ జియో

Reliance Jio | రిలయెన్స్ జియోకు ప్రధాన పోటీ కంపెనీల్లో ఒకటైన ఎయిర్‌టెల్ ఎనిమిదో స్థానానికే పరిమితమైంది.

news18-telugu
Updated: June 7, 2019, 3:39 PM IST
Reliance Jio: మోస్ట్ పాపులర్ బ్రాండ్‌గా రెండో స్థానంలో రిలయెన్స్ జియో
Reliance Jio: మోస్ట్ పాపులర్ బ్రాండ్‌గా రెండో స్థానంలో రిలయెన్స్ జియో (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
రిలయెన్స్ జియోకు సంచలనాలు కొత్తేమీ కాదు. ముఖేష్ అంబానీ టెలికాం కంపెనీ రిలయెన్స్ జియో ప్రారంభించిననాటి నుంచి అన్నీ సంచలనాలు, రికార్డులే. భారతదేశంలో మోస్ట్ పాపులర్ బ్రాండ్స్ ఏవి అని Ipsos India నిర్వహించిన సర్వేలో రిలయెన్స్ జియో ఏకంగా రెండో స్థానం సాధించడం విశేషం. మొదటి స్థానంలో సెర్చ్ ఇంజిన్ గూగుల్ నిలిచింది. గతేడాది ఇదే సర్వేలో గూగుల్, అమెజాన్ తర్వాత రిలయెన్స్ జియో మూడో స్థానంలో ఉండేది. ఈసారి ఒక స్థానాన్ని మెరుగుపర్చుకొని రెండో స్థానానికి చేరుకుంది. రిలయెన్స్ జియోకు ప్రధాన పోటీ కంపెనీల్లో ఒకటైన ఎయిర్‌టెల్ ఎనిమిదో స్థానానికే పరిమితమైంది. వీటితో పాటు పేటీఎం, సాంసంగ్, అమెజాన్ లాంటి టెక్నాలజీ కేటగిరీ కంపెనీలో టాప్ టెన్ జాబితాలో ఉన్నాయి.

భారతదేశంలో వృద్ధి చెందిన రిలయెన్స్ జియో బ్రాండ్ ర్యాంకింగ్‌లో దూసుకెళ్లింది. బ్రాండ్ అనేది చాలాముఖ్యం. పేరు తెచ్చుకోవడం సులువే కానీ నిలబెట్టుకోవడం కష్టం. టాప్-5 కంపెనీల్లో గ్లోబల్ బ్రాండ్స్‌తో పాటు లోకల్ బ్రాండ్స్ ఉండటం విశేషం. మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి హ్యాండ్‌సెట్ తయారీ వరకు అన్ని సేవలు అందిస్తున్న రిలయెన్స్ జియోతో పాటు డిజిటల్ వ్యాలెట్, ఇ-కామర్స్ కంపెనీ అయిన పేటీఎం ఉన్నాయి.
వివేక్ గుప్తా, మేనేజింగ్ డైరెక్టర్, బిజినెస్ హెడ్, Ipsos India


Ipsos India సర్వేలో టాప్-10 స్థానాల్లో ఉన్న కంపెనీలు ఇవే...


1. గూగుల్


2. రిలయెన్స్ జియో
3. పేటీఎం4. ఫేస్‌బుక్
5. అమెజాన్
6. సాంసంగ్
7. మైక్రోసాఫ్ట్
8. ఎయిర్‌టెల్
9. ఫ్లిప్‌కార్ట్
10. యాపిల్ ఐఫోన్

Redmi K20 Pro: షావోమీ నుంచి కొత్త ఫోన్స్... రెడ్‌మీ కే20, కే 20 ప్రో


ఇవి కూడా చదవండి:

Indian Navy Jobs: బీటెక్ చదివితే నేవీలో ఉద్యోగం... రూ.2 లక్షల వరకు జీతం

Beep Festival: కోల్‌కతాలో 'బీప్' ఫెస్టివల్... ఎందుకో తెలుసా?

Helmet Rule: హెల్మెట్ లేదా? అయితే బండి సీజ్... కొత్త హెల్మెట్ కొంటేనే రిలీజ్
First published: June 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు