Jio: ప్రభుత్వానికి సమస్యలు తెలపడంలో సీవోఏఐ విఫలం...జియో లేఖాస్త్రం
టెలికాం రంగంలోని సాధ్యాసాధ్యాలను ప్రభుత్వానికి తెలపడంలో పలు సందర్భాల్లో సీవోఏఐ విఫలమైందని జియో అసంతృప్తి వ్యక్తం చేసింది.
news18-telugu
Updated: October 30, 2019, 8:35 PM IST

Jio (ప్రతీకాత్మక చిత్రం)
- News18 Telugu
- Last Updated: October 30, 2019, 8:35 PM IST
సెల్యూలర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) తమ అభిప్రాయాలను ప్రభుత్వంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో విఫలం అయ్యిందని పేర్కొంది. అలాగే టెలికాం రంగంలోని సాధ్యాసాధ్యాలను ప్రభుత్వానికి తెలపడంలో పలు సందర్భాల్లో సీవోఏఐ విఫలమైందని జియో అసంతృప్తి వ్యక్తం చేసింది. సుదీర్ఘ లేఖలో పేర్కొన్న 13 అంశాల్లో తమ సమస్యలను లేవనెత్తి సీవోఏఐ డైరక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ కు పూర్తి విషయం తెలియచేశారు. సెల్యూలర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) వ్యవహార శైలిపై రిలయన్స్ జియో అభ్యంతరం వ్యక్తం చేసింది. టెలికాం ఆపరేటర్ల వాణిజ్య సమాఖ్యగా ఉన్న సీఓఏఐ తమ సూచనలు, సలహాలను పట్టించుకోవడం లేదని అలాగే టెలికాం సెక్టార్ లో తలెత్తుతున్న కష్టనష్టాలను సైతం సూచిస్తూ సుదీర్ఘ లేఖను విడుదల చేసింది.
అంతేకాదు ప్రభుత్వానికి టెలికాం రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై రిప్రజంటేషన్ ఇవ్వడంలో సైతం సీవోఏఐ సరిగ్గా వ్యవహరించలేదని తెలిపింది. అంతే కాదు ప్రభుత్వానికి సీవోఏఐ రాసిన లేఖతో తాము ఏకీభవించడం లేదని జియో లేఖలో పేర్కొంది. అలాగే ఇద్దరు ఆపరేటర్ల తప్పిదాలను మొత్తం సెక్టార్ పై ఆపదించలేమని జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ పేరిట విడుదల చేసిన లేఖలో తెలిపింది.

JIO NEW All IN ONE PLANS: జియో సరికొత్త ఆల్ ఇన్ వన్ ప్లాన్స్ ఇవే...
జియో సినిమా యూజర్లకు బంపర్ ఆఫర్...సన్‌నెక్ట్స్ సినిమాలన్నీ చూసే చాన్స్...
జియో నుంచి సరికొత్త న్యూ ఆల్ ఇన్ వన్ ప్లాన్స్...వివరాలు ఇవిగో..
Jio Fiber New Plans: మరో 2 కొత్త జియో ఫైబర్ ప్లాన్స్... బెనిఫిట్స్ ఇవే
మార్కెట్ రారాజు.. రిలయన్స్ ఇండస్ట్రీస్ విజయ ప్రస్థానం సాగిందిలా..
సరికొత్త రికార్డు సృష్టించిన RIL .. దేశ చరిత్రలోనే తొలిసారి..
Loading...