రిలయన్స్ జియో తన ట్రూ 5జీ(Jio True 5G) సేవలను ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి, నెల్లూరు పట్టణాల్లో సోమవారం లాంఛనంగా ప్రారంభించింది. ఇప్పటికే తిరుమల, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు పట్టణాల్లో రిలయన్స్ జియో(Reliance Jio) తన ట్రూ 5జీ సేవలను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) నెట్వర్క్ కోసం జియో ఇప్పటికే రూ. 26,000 కోట్ల పెట్టుబడి పెట్టింది. అదనంగా 5 జి నెట్ వర్క్ ను ఏర్పాటు చేయడానికి మరో రూ. 6,500 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి పట్ల జియోకున్న అపారమైన నిబద్ధతను చూపిస్తుంది. ఈ ఏడాది చివరి నాటికి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి పట్టణం, తాలూకా, మండలం, గ్రామాల్లో జియో ట్రూ 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
జియో ట్రూ 5జి సేవల ప్రారంభంతో ఆంధ్రప్రదేశ్ ఉత్తమ టెలికమ్యూనికేషన్ నెట్ వర్క్ ను పొందడమే కాకుండా.. ఇ-గవర్నెన్స్, విద్య , ఆరోగ్య సంరక్షణ, ఐటి మరియు ఎస్ఎమ్ఇ వ్యాపార వృద్ధి రంగాల్లో అవకాశాలను మెరుగు పరుస్తోంది. జియో ట్రూ 5 జి పౌరులు, ప్రభుత్వం రియల్ టైమ్ ప్రాతిపదికన కనెక్ట్ అయ్యేందుకు వీలు కల్పిస్తుంది. చిట్టచివరి అడుగు వరకు ప్రభుత్వ పథకాల అమలు సామర్థ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఈ సందర్భంగా జియో ఆంధ్రప్రదేశ్ సీఈఓ మందపల్లి మహేష్ కుమార్ మాట్లాడుతూ.. “ఆంధ్రప్రదేశ్ లో జియో ట్రూ 5జీని విస్తరించడం పట్ల సంతోషంగా ఉంది. జియో ట్రూ 5జీ నెట్ వర్క్ అతి తక్కువ సమయంలోనే రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తుంది.
జియో ఇంజనీర్లు ప్రతి భారతీయుడికి ట్రూ -5 జి ప్రయోజనాలను అందించడానికి 24 గంటలు పనిచేస్తున్నారు. అందువల్ల ఈ గణనీయమైన మార్పుకు ఉన్న శక్తి, దాని అపార ప్రయోజనాలను మన దేశంలోని ప్రతి పౌరుడు అనుభవించగలడు. ఆంధ్రప్రదేశ్ ను డిజిటలైజ్ చేసి ముందుకు తీసుకెళ్లడంలో సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము” అన్నారు. జియో వినియోగదారులు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా గరిష్టంగా 1 Gbps+ వేగంతో అపరిమిత డేటాను పొందేందుకు Jio వెల్‌కమ్ ఆఫర్‌కు ఆహ్వానించబడతారని పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Jio, Jio TRUE 5G