రిలయెన్స్ జియో ఫైబర్ యూజర్లకు శుభవార్త. యాన్యువల్ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ తీసుకున్నవారికి మరిన్ని బెనిఫిట్స్ అందిస్తోంది జియోఫైబర్. బ్రాంజ్ నుంచి టైటానియం వరకు అన్ని యాన్యువల్ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్‌పై అదనపు డేటా అందిస్తోంది జియో ఫైబర్. బ్రాంజ్ ప్లాన్ తీసుకున్నవారికి రూ.699 ధరకు సాధారణంగా 350 జీబీ డేటా లభిస్తుంది. ఇకపై 100 జీబీ డేటా అదనంగా పొందొచ్చు. మంత్లీ రెంటల్ తీసుకున్నవారికి 250 జీబీ డేటా లభిస్తుంది. ఇకపై 100 జీబీ అదనంగా పొందొచ్చు. ఇక నెలకు రూ.849 విలువగల సిల్వర్ ప్లాన్ ఏడాదికి తీసుకున్నవారికి సాధారణంగా 800 జీబీ డేటా లభిస్తుంది. ఇకపై అదనంగా 200 జీబీ డేటా పొందొచ్చు.
ఇక నెలకు రూ.1,200 జియో ఫైబర్ గోల్డ్ ప్లాన్ సబ్స్క్రైబర్లకు 1,750 జీబీ మంత్లీ డేటా లభిస్తుంది. యాన్యువల్ ప్లాన్ తీసుకుంటే 500 జీబీ డేటా అదనంగా వాడుకోవచ్చు. నెలకు రూ.2,499 జియో ఫైబర్ డైమండ్ ప్లాన్ తీసుకున్నవారికి 4,000 జీబీ డేటా లభిస్తుంది. ఏడాదికి ప్లాన్ తీసుకుంటే అదనంగా 1250 జీబీ డేటా పొందొచ్చు. నెలకు రూ.3,999 విలువ గల ప్లాటినం ప్లాన్ తీసుకున్నవారికి 7,500 జీబీ డేటా లభిస్తుంది. వార్షిక ప్లాన్ తీసుకుంటే అదనంగా 2,500 జీబీ డేటా పొందొచ్చు. ఇక జియో ఫైబర్‌లో ఖరీదైన ప్లాన్ రూ.8,499 తీసుకున్నవారికి నెలకు 15,000 జీబీ డేటా లభిస్తుంది. వార్షిక ప్లాన్ తీసుకుంటే అదనంగా 5,000 జీబీ డేటా పొందొచ్చు.
ఇక మార్చిలో జియో ఫైబర్ 10 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఉచితంగా బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అందించిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ కష్టకాలంలో డేటా వినియోగం పెరిగిపోవడంతో సామాజిక బాధ్యతగా జియో ఫైబర్ ఈ సేవల్ని ప్రకటించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.