Reliance jio-Facebook Deal: రిలయెన్స్ జియోతో ఫేస్‌బుక్ డీల్ ఎందుకంటే

Reliance jio-Facebook Deal: రిలయెన్స్ జియోతో ఫేస్‌బుక్ డీల్ ఎందుకంటే (ప్రతీకాత్మక చిత్రం)

Reliance jio-Facebook Mega Deal | భారతదేశానికి చెందిన కంపెనీలో ఫేస్‌బుక్ వాటాలు కొనడం ఇదే మొదటిసారి కాదు. సోషల్ కామర్స్ కంపెనీ మీషోలో, ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ స్టార్టప్ అన్‌అకాడమీలో ఫేస్‌బుక్‌కు మైనారిటీ వాటాలున్నాయి.

 • Share this:
  రిలయెన్స్ జియోలో ఫేస్‌బుక్ 9.9% వాటాలు తీసుకుంటున్నట్టు ప్రకటించింది. రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్-RIL కు చెందిన టెలికామ్ యూనిట్‌ జియోలో వాటాల కోసం 5.7 బిలియన్ డాలర్లు అంటే రూ.43,574 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది ఫేస్‌బుక్. రిలయెన్స్ జియోలో ఫేస్‌బుక్ వాటాలు కొనడానికి పలు కారణాలున్నాయి. ఈ డీల్‌తో రిలయెన్స్ జియోలో అతిపెద్ద మైనార్టీ షేర్‌హోల్డర్‌గా మారింది ఫేస్‌బుక్. జియోకు 38.8 కోట్ల కస్టమర్లు ఉన్నారు. అతిపెద్ద ఆడియన్స్ బేస్‌ యాక్సెస్ ఫేస్‌బుక్‌కు లభిస్తుంది. భారతదేశంలో 6 కోట్ల చిన్న వ్యాపారులకు మరిన్ని అవకాశాలు రాబోతున్నాయి. పెరుగుతున్న డిజిటల్ ఎకానమీలో వ్యాపారాలు మరింత సమర్థవంతంగా నిర్వహించే వీలుంటుంది.

  ఉదాహరణకు జియో చిరు వ్యాపారుల ప్లాట్‌ఫామ్ అయిన జియోమార్ట్‌కు వాట్సప్ తోడైతే ప్రజలు వ్యాపారాలను సులువుగా కనెక్ట్ కాగలరు. షాపింగ్ చేయగలరు. జియోతో కలిసి మేము చేస్తున్న ప్రయత్నాలు భారతదేశ ఆర్థికాభివృద్ధికి కొత్త తలుపులు తెరుస్తుంది. ప్రజా శ్రేయస్సుకు ఉపయోగపడుతుంది.
  ఫేస్‌బుక్ ప్రకటన


  భారతదేశానికి చెందిన కంపెనీలో ఫేస్‌బుక్ వాటాలు కొనడం ఇదే మొదటిసారి కాదు. సోషల్ కామర్స్ కంపెనీ మీషోలో, ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ స్టార్టప్ అన్‌అకాడమీలో ఫేస్‌బుక్‌కు మైనారిటీ వాటాలున్నాయి. ఇక రిలయెన్స్ జియో విషయానికి వస్తే బిలియనీర్ ముకేష్ అంబానీ మూడేళ్ల క్రితం 40 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఈ టెలికాం సంస్థను ప్రారంభించారు. భారతదేశంలోనే అతిపెద్ద టెలికాం కంపెనీగా ఎదిగింది జియో. తక్కువ ధరకే ఇంటర్నెట్ అందిస్తూ 34 కోట్ల మంది కస్టమర్లను సంపాదించుకోగలిగింది. రిలయెన్స్ ఇండస్ట్ర్సీస్ లిమిటెడ్ తన అప్పుల్ని తగ్గించుకోవడానికి ఫేస్‌బుక్‌ డీల్ ఉపయోగపడుతుంది. 2021 మార్చి నాటికి నికర రుణాలు సున్నాకు చేరుకోవాలన్న ఆశయం నెరవేరుతుంది. రుణాలను తగ్గించుకోవడానికి రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్-RIL కొన్ని నెలలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కొన్ని వ్యాపారాల్లో వాటాలను అమ్ముతోంది. ఆయిల్, కెమికల్ వ్యాపారాల్లో 20 శాతం సౌదీ ఆరామ్‌కోకు, టవర్ బిజినెస్‌లో వాటాలను కెనెడియన్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్‌మెంట్‌కు అమ్మే దిశగా చర్చలు కొనసాగుతున్నాయి.

  ఇక ఫేస్‌బుక్ విషయానికొస్తే ఇటీవల భారతదేశంలో క్లిష్టమైన మార్కెట్‌గా అవతరించింది. భారతదేశంలో ఫేస్‌బుక్‌కు ఎక్కువ యూజర్లున్నారు. త్వరలో పేమెంట్ సేవల్ని కూడా ప్రారంభించబోతున్న వాట్సప్‌కు 34 కోట్ల మంది యూజర్లున్నారు. ఫేస్‌బుక్, వాట్సప్ వేగంగా విస్తరిస్తున్నా ఫ్రీ బేసిక్స్ పేరుతో అందించాలనుకున్న ఉచిత ఇంటర్నెట్ సేవలపై ట్రాయ్ నిషేధం విధించింది. ఇప్పుడు టెలికామ్ నుంచి ఇకామర్స్, హోమ్ ఇంటర్నెట్ వరకు అన్ని రంగాలపై పట్టు సాధించింది.

  తక్కువ ధరకే ఇంటర్నెట్ ప్లాన్స్, స్మార్ట్‌ఫోన్ల కారణంగా భారతదేశంలో ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 90 కోట్లకు పైనే ఉందని సిస్కో నివేదిక ఇటీవల వెల్లడించింది. 2023 నాటికి భారతదేశంలో 210 కోట్ల ఇంటర్నెట్ కనెక్టెడ్ డివైజ్‌లు ఉంటాయని అంచనా.

  సుమారు 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో జియోను సరికొత్త డిజిటల్ సర్వీసెస్ కంపెనీగా మారుస్తామని గతేడాది రిలయెన్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. భారతీయ కంపెనీలో డేటా సెంటర్లను తన అజూర్ క్లౌడ్‌తో శక్తివంతం చేయడానికి మైక్రోసాఫ్ట్ 2019 లో రిలయన్స్‌తో 10 సంవత్సరాల ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పుడు జియో-ఫేస్‌బుక్ మధ్య డీల్ కుదిరింది.

  ఇవి కూడా చదవండి:

  SBI Mobile Banking: ఎస్‌బీఐ మొబైల్ బ్యాంకింగ్‌కు రిజిస్టర్ చేయండి ఇలా

  EPF: రూ.15,000 లోపు జీతం ఉన్నవారికి త్వరలో గుడ్ న్యూస్?

  Akshay Tritiya 2020: ఆన్‌లైన్‌లో బంగారంపై అక్షయ తృతీయ ఆఫర్స్ ఇవే
  Published by:Santhosh Kumar S
  First published: