Home /News /business /

RELIANCE JIO FACEBOOK MEGA DEAL A LOOK AT HOW JIO HAS BEEN INCREASING AUDIENCE REACH IN INDIA SS

Reliance Jio-Facebook deal: జియో మరింత దూసుకెళ్లడం ఖాయం... ఎలాగంటే

Reliance Jio-Facebook deal: జియో మరింత దూసుకెళ్లడం ఖాయం... ఎలాగంటే
(ప్రతీకాత్మక చిత్రం)

Reliance Jio-Facebook deal: జియో మరింత దూసుకెళ్లడం ఖాయం... ఎలాగంటే (ప్రతీకాత్మక చిత్రం)

Reliance jio-Facebook Mega Deal | ఫేస్‌బుక్-జియో డీల్‌తో భారతదేశంలో అన్ని రకాల వ్యాపారాలకు కొత్త అవకాశాలు రాబోతున్నాయి. ఎక్కువగా భారతదేశంలోని 6 కోట్ల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా వ్యాపారాలు, 1.2 కోట్ల రైతులు, 3 కోట్ల చిరు వ్యాపారులు, లక్షలాది చిన్న, మధ్యతరహా ఎంటర్‌ప్రైజెస్‌పై ఫోకస్ పెరగనుంది.

ఇంకా చదవండి ...
    రిలయెన్స్ జియో-ఫేస్‌బుక్ మధ్య రూ.43,574 కోట్ల డీల్ కుదిరింది. ఏప్రిల్ 22న ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాయి రెండు కంపెనీలు. జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఫేస్‌బుక్ రూ.43,574 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సబ్సిడరీ అయిన జియో ప్లాట్‌ఫామ్స్‌లో డిజిటల్ యాప్స్, డిజిటల్ ఎకోసిస్టమ్స్, హైస్పీడ్ కనెక్టివిటీ లాంటివన్నీ ఉన్నాయి. రిలయెన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ 38.8 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లకు కనెక్టివిటీ ప్లాట్‌ఫామ్స్ అందిస్తోంది. ఇక ఫేస్‌బుక్ విషయానికొస్తే ఈ సంస్థకు చెందిన వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ లాంటివాటికి ప్రపంచంలోనే అతిపెద్ద దేశమైన భారతదేశం ఇల్లు లాంటిది. స్టాటిస్టా లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఫేస్‌బుక్ యూజర్ బేస్ ఇండియాలోనే ఎక్కువగా ఉంది. జనవరి నాటికి 26 కోట్ల మంది యూజర్లు ఫేస్‌బుక్‌కు ఉన్నారు. ఆ తర్వాత 18 కోట్ల యూజర్లతో యూఎస్ రెండో స్థానంలో ఉంది.

    ఫేస్‌బుక్ మాత్రమే కాదు ఈ సంస్థకు చెందిన ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్‌ యూజర్ బేస్ కూడా ఇండియాలో ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా వాట్సప్‌కు 200 కోట్ల మంది యూజర్లు ఉంటే భారతదేశంలోనే ఎక్కువ యూజర్లున్నారు. ఇండియాలో 40 కోట్ల మంది వాట్సప్ యూజర్లు ఉన్నారని 2019 లో వెల్లడించారు నీతీ ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్. గత ఐదేళ్లలో 56 కోట్ల మంది యూజర్లకు ఇంటర్నెట్ యాక్సెస్ లభించింది. ఇప్పుడు ఫేస్‌బుక్-జియో డీల్‌తో భారతదేశంలో అన్ని రకాల వ్యాపారాలకు కొత్త అవకాశాలు రాబోతున్నాయి. ఎక్కువగా భారతదేశంలోని 6 కోట్ల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా వ్యాపారాలు, 1.2 కోట్ల రైతులు, 3 కోట్ల చిరు వ్యాపారులు, లక్షలాది చిన్న, మధ్యతరహా ఎంటర్‌ప్రైజెస్‌పై ఫోకస్ పెరగనుంది.

    కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలపై తీవ్ర ప్రభావం ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రెండు దిగ్గజ సంస్థల మధ్య ఒప్పందం ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ సంక్షోభ సమయంలో గతంలో కంటే డిజిటలైజేషన్ చాలా ముఖ్యమైనదని భారతీయులు గ్రహించారు. కరోనా వైరస్ సంక్షోభం ముగిసిన తర్వాత భారతదేశ ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనానికి సమగ్ర డిజిటలైజేషన్ అవసరం.

    ఇవి కూడా చదవండి:

    SBI Mobile Banking: ఎస్‌బీఐ మొబైల్ బ్యాంకింగ్‌కు రిజిస్టర్ చేయండి ఇలా

    EPF: రూ.15,000 లోపు జీతం ఉన్నవారికి త్వరలో గుడ్ న్యూస్?

    Akshay Tritiya 2020: ఆన్‌లైన్‌లో బంగారంపై అక్షయ తృతీయ ఆఫర్స్ ఇవే
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Facebook, Jio, JioFiber, Mukesh Ambani, Reliance, Reliance Industries, Reliance Jio, RIL, Whatsapp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు