Reliance Jio-Facebook deal : జియో-ఫేస్‌బుక్ డీల్... ఇద్దరికీ లాభమే : బ్రోకరేజ్ సంస్థలు

Reliance jio-Facebook Mega Deal : రిలయన్స్ జియో-ఫేస్‌బుక్ డీల్... భవిష్యత్తు లిస్టింగ్స్‌కి బెంచ్‌మార్క్‌లా నిలవబోతోందని బ్రోకరేజ్ సంస్థలు తెలిపాయి.

news18-telugu
Updated: April 22, 2020, 1:42 PM IST
Reliance Jio-Facebook deal : జియో-ఫేస్‌బుక్ డీల్... ఇద్దరికీ లాభమే : బ్రోకరేజ్ సంస్థలు
జియో-ఫేస్‌బుక్ డీల్... ఇద్దరికీ లాభమే : బ్రోకరేజ్ సంస్థలు
  • Share this:
Reliance jio-Facebook Mega Deal : రిలయన్స్ జియోలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ 9.99 శాతం వాటాను కొనడం, రూ.43,574 కోట్ల ($5.7 బిలియన్)కు వాటాను దక్కించుకోవడంతో... ఈ పెట్టుబడులపై స్టాక్ మార్కెట్ బ్రోకరేజ్ సంస్థలు పాజిటివ్‌గా స్పందించాయి. ఈ డీల్ వల్ల ఫేస్‌బుక్‌కి మరింత కలిసి రానుంది. వేగంగా పెరుగుతున్న ఇండియా మార్కెట్ దక్కించుకోవడంతోపాటూ... ఇండియాలోని ఆయిల్ నుంచి టెలికం కంపెనీల వరకూ అందరికీ సాయం చేసేందుకు వీలవ్వనుంది. ఇండియాలో ప్రత్యక్ష పెట్టుబడుల్లో (FDI)... ప్రపంచంలోనే అత్యంత తక్కువ వాటాను ఎక్కువ మొత్తానికి కొన్న పెట్టుబడి ఇదేనని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) తెలిపింది.

ఇండియా పట్ల మాకు ఇన్న నిబద్ధతని ఈ పెట్టుబడి తెలుపుతోంది. భారత దేశాన్ని జియో మార్చేసిన తీరు మమ్మల్ని ఆశ్చర్యపరిచింది. జియోతో కలిసి... మేం మరింత మంది ప్రజలను కనెక్ట్ చేసేందుకు కమిట్‌మెంట్‌తో ఉన్నాం అని ఫేస్‌బుక్ తెలిపింది.


ఫేస్‌బుక్, జియోకి ఈ డీల్ కలిసొస్తుందని బ్రోకరేజ్ సంస్థలు చెబుతున్నాయి. ఏ సంస్థ ఏమంటుందో చూద్దాం.

Jefferies Brokerage : ఈ డీల్ వల్ల జియో ప్లాట్‌ఫామ్స్‌కి ముందుగా రూ.43,600 కోట్లు వస్తాయి. దీని ఎంటర్ ప్రైజ్ వాల్యూ రూ.47,700 అవుతుంది. EBITDAకి ఇది రూ.398-477 బిలియన్ అవుతుంది. జియో ప్లాట్‌ఫామ్స్ బ్యాలెన్స్ షీట్‌లో ఫేస్‌బుక్ రూ.41,000 కోట్ల నెట్ డెబిట్ కలిగివుంటుంది. దీన్ని బట్టీ చూస్తే... ఫేస్‌బుక్... జియోకి చెందిన EBITDAని ప్రస్తుత లెవెల్ నుంచి డబుల్ అయ్యాలా ఆశిస్తుంది. జియో ప్లాట్‌ఫామ్స్‌కి భవిష్యత్తులో లిస్టింగ్‌కి ఇదో బెంచ్‌మాల్క్ వాల్యుయేషన్ అవుతుంది.

Angel Broking Brokerage : ఇది రెండు కంపెనీలకూ లాభమే. జియోకి ఉన్న 388 మిలియన్ల ఆడియన్స్‌ను ఫేస్‌బుక్ పొందగలదు. అలాగే... రిలయన్స్... తన డెబిట్‌ను చెల్లించగలదు. వాట్సాప్, ఫేస్‌బుక్ మెసెంజర్ సర్వీసులను పొందగలదు. కరోనా తర్వాత.. ప్రపంచం ఫోకస్... డిజిటల్ వైపు ఉంటుంది. అందువల్ల రెండు కంపెనీలకూ చక్కటి అవకాశాలుంటాయి. ఇండియాలో ఉన్న 90 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లకు చేరవచ్చు. రిలయన్స్ ఇప్పటికే 7 శాతం రోజువారీ ట్రేడ్ కలిగివుంది. మార్కెట్లకు ఇది కలిసొచ్చే అంశం. డిజిటల్ సర్వీస్ కంపెనీగా మారుతున్న జియోకి మంచి లిస్టింగ్ ఇస్తుంది. ఇండియాలో ఎక్కువ డిజిటల్ బిజినెస్ అవకాశాల్ని అందుకోవడానికి ఫేస్‌బుక్‌కి కలిసొస్తుంది.

DART Research (Dolat Capital) Brokerage : ఈ పెట్టుబడి ఈక్విటీ వాల్యూ రూ.4.4 లక్షల కోట్లు ఉంటుంది. ఎంటర్‌ప్రైజ్ వాల్యూ రూ.4.62 లక్షల కోట్లుగా ఉంది. ట్రాన్సాక్షన్‌కి ముందు జియో నెట్ డెబిట్ ప్రస్తుతం రూ.22,000 కోట్లు. నెట్ క్యాష్ పోస్ట్ ట్రాన్సాక్షన్ దాదాపు రూ.21600 కోట్లు. అందువల్ల జియో పోస్ట్ ట్రాన్సాక్షన్ ఎంటర్‌ప్రైజ్ వాల్యూ రూ.4.2 లక్షల కోట్లు అవుతుంది. జియోకి చెందిన EV అంచనాలైన రూ.4.1 లక్షల కోట్ల కంటే... ఇది 3 శాతం ఎక్కువే. ఇప్పుడు రిలయన్స్ బ్యాలెన్స్ షీట్... మరింత బలపడుతుంది. దీని వల్ల రిలయన్స్ జియో... మరింత బలంగా దూసుకుపోయేందుకు, భవిష్యత్ టెక్నాలజీ ప్రయోజనాలు పొందేందుకు వీలవుతుంది.Edelweiss Securities Brokerage : ఇది అంచనాలకు మించిన డీల్. ఇందులో చాలా అంశాలున్నాయి. వాట్సాప్‌ని జియోమార్ట్‌తో వాడొచ్చు. ఇదో కీలక అంశం.
First published: April 22, 2020, 1:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading