Reliance Jio - Facebook Deal | జియో - ఫేస్ బుక్ డీల్‌పై ఆనంద్ మహీంద్రా అద్భుత విశ్లేషణ

Reliance Jio Facebook Deal | రిలయన్స్ జియోలో ఫేస్ బుక్ 9.99 శాతం వాటాను కొనుగోలు చేసింది.

news18-telugu
Updated: April 22, 2020, 3:19 PM IST
Reliance Jio - Facebook Deal | జియో - ఫేస్ బుక్ డీల్‌పై ఆనంద్ మహీంద్రా అద్భుత విశ్లేషణ
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
భారత టెలికం దిగ్గజం రిలయన్స్ జియోలో అమెరికాకు చెందిన సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ 9.99 శాతం వాటాను కొనుగోలు చేసింది. రూ.43,574 కోట్లకు ఈ వాటాను దక్కించుకుంది. రూ.4.62 లక్షల కోట్ల విలువ ఉన్న జియోలో వాటా కొనుగోలు వల్ల జియోలో అతిపెద్ద మైనారిటీ షేర్ హోల్డర్‌గా ఫేస్‌బుక్ నిలవనుంది. దీనిపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు. రిలయన్స్ జియో - ఫేస్ బుక్ డీల్ అనేది కేవలం రెండు సంస్థలకు మాత్రమే లాభదాయకం కాదని, భారత ఆర్థిక వ్యవస్థ ప్రాధాన్యాన్ని తెలియజేస్తుందన్నారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మీద ప్రశంసలు కురిపించారు. ‘ఫేస్‌బుక్‌తో జియో డీల్ అనేది కేవలం ఆ రెండు సంస్థలకు మాత్రమే లాభదాయం కాదు. ప్రస్తుతం కరోనా వైరస్ సంక్షోభ సమయంలో జరిగిన ఈ ఒప్పందం జరిగింది. సంక్షోభం తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ ప్రాధాన్యం తెలియజేయడానికి ఇది బలమైన సంకేతం. భారత దేశం ప్రపంచానికి ఆర్థిక వృద్ధి కేంద్రంగా, ఓ ఇరుసుగా మారుతుందనే కల్పనను ఇది బలపరుస్తుంది. బ్రావో ముఖేష్’ అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.

First published: April 22, 2020, 3:13 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading