Reliance Jio | నాలుగో త్రైమాసికం లాభాల్లో దూసుకుపోయిన జియో

ప్రతీకాత్మక చిత్రం

రిలయన్స్ జియో సంస్థ నాలుగో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. 2020 సంవత్సరం క్యూ4లో కూడా జియో లాభాల్లో దూసుకుపోయింది.

  • Share this:
    రిలయన్స్ జియో సంస్థ నాలుగో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. 2020 సంవత్సరం క్యూ4లో కూడా జియో లాభాల్లో దూసుకుపోయింది. నాలుగో త్రైమాసికంలో రూ.2331 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. క్యూ 3లో నికర లాభం రూ.1350 కోట్లు. 2018 -19 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రిలయన్స్ జియో రూ.840 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. మూడో క్వార్టర్‌తో పోలిస్తే నాలుగో క్వార్టర్‌లో 72 శాతం ఆదాయం పెరిగింది. వార్షిక ఆదాయం పరంగా చూస్తే నికర లాభం 177.5 శాతం వృద్ధి నమోదైంది.

    రిలయన్స్ జియో దేశవ్యాప్తంగా 388 మిలియన్ కస్టమర్లను కలిగి ఉంది. 2020 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో 24 మిలియన్ యూజర్లు కొత్తగా జాయిన్ అయ్యారు. లాక్ డౌన్ సమయంలో కూడా రిలయన్స్ జియో నెట్ వర్క్ డ్రాప్ సమస్యలు లేకుండా సేవలు అందించింది. నాలుగో త్రైమాసికంలోనే రిలయన్స్ జియో ఫేస్ బుక్‌తో జతకట్టింది. సోషల్ మీడియాదిగ్గజం అయిన ఫేస్ బుక్ రిలయన్స్ జియోలో 9.99 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఆ డీల్ విలువ రూ.43574 కోట్లు. దీంతోపాటు జియో త్వరలో జియోమీట్ పేరుతో దేశవ్యాప్తంగా వీడియో ప్లాట్ ఫామ్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.

    ఆపరేషన్స్ ద్వారా ఆదాయం రూ.14,835 కోట్లు

    నికర లాభం రూ.2331 కోట్లు  (క్యూ4లో)

    ఈ ఏడాది సబ్‌స్క్రైబర్లు 26 .3శాతం వృద్ది

    వైర్‌లెస్ డేటా ట్రాఫిక్ 1284 కోట్ల జీబీ (క్యూ4లో)

    టోటల్ వాయిస్ ట్రాఫిక్ 87634 నిమిషాలు (క్యూ4లో)
    Published by:Ashok Kumar Bonepalli
    First published: