Home /News /business /

RELIANCE JIO BP OPENS EV CHARGING HUB IN DELHI PETROL PUMP COUNT INCHING UP HERE IS MORE DETAILS SK

Jio-bp: దేశంలోనే అతి పెద్ద ఈవీ చార్జింగ్ హబ్‌ను ప్రారంభించిన జియో-బీపీ.. ఎక్కడో తెలుసా?

జియో-బీపీ

జియో-బీపీ

Reliance -BP: రిలయన్స్, బీపీ సంస్థలు భారత్‌లో తమ ఫ్యూయర్ రిటైల్ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తున్నారు. ఇందులో భాగంగానే ఢిల్లీలోని ద్వారకలో ఈవీ చార్జింగ్ హబ్ ఏర్పాటు చేశాయి.

  దేశ ప్రజలకు మెరుగైన ఈవీ సేవలదించడమే లక్ష్యంగా.. బిలియనీర్ ముకేశ్ అంబానీ (Mukesh Ambani)కి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL), ఇంధన దిగ్గజం బీపీ (BP) మరో అడుగు ముందుకేశాయి. ఢిల్లీలో అతి పెద్ద ఈవీ చార్జింగ్ హబ్‌ను సంయుక్తంగా ప్రారంభించాయి.  రిలయన్స్, బీపీ సంస్థలు భారత్‌లో తమ ఫ్యూయర్ రిటైల్ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఢిల్లీలోని ద్వారకలో ఈవీ చార్జింగ్ హబ్ ఏర్పాటు చేశాయి. Jio-bp దేశంలోని అతిపెద్ద EV ఛార్జింగ్ హబ్‌లలో ఒకదానిని ఢిల్లీలోని ద్వారకలో ప్రారంభించినట్లు రిలయన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. బ్లూస్మార్ట్ దీని ప్రైమరీ కస్టమర్‌గా ఉన్నట్లు పేర్కొంది.

  TCS సంచలన రికార్డు, ప్రపంచంలోనే అత్యంత విలువైన బ్రాండ్‌గా 2వ స్థానంలో నిలిచిన టెక్ దిగ్గజం

  రిలయన్స్ బీపీ మొబిలిటీ లిమిటెడ్ (RBML) జియో-బీపీ (Jio-bp) బ్రాండ్ పేరుతో పనిచేస్తోంది. భారతదేశంలో ప్రముఖ EV ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌గా ఉండాలనే లక్ష్యంతో.. మల్టిపుల్ డిమాండ్ అగ్రిగేటర్లు, ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారులు (OEMలు), టెక్నాలజీ భాగస్వాములతో కలిసి పనిచేస్తోందని RIL ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే RBML తన మొదటి Jio-bp బ్రాండ్ మొబిలిటీ స్టేషన్‌ని నవీ ముంబైలోని గత ఏడాది అక్టోబర్‌లో ప్రారంభించింది. అప్పటి నుండి నెట్‌వర్క్‌ను విస్తరిస్తూ వస్తున్నారు.

  2019లో రిలయన్స్ యాజమాన్యంలోని 1,400 పెట్రోల్ పంపులు, 31 ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) స్టేషన్లలో 49 శాతం వాటాను బిపి కొనుగోలు చేసింది. 1 బిలియన్ డాలర్లకు వాటిని దక్కించుకుంది. రిలయన్స్ ప్రస్తుత పెట్రోల్ పంపులు జాయింట్ వెంచర్‌కు బదిలీ చేశారు. 2025 నాటికి వీటి సంఖ్యను 5,500కి పెంచాలని యోచిస్తున్నారు. ఇక రిలయన్స్ బీపీ మొబిలిటీ లిమిటెడ్ (RBML)లో మిగిలిన 51 శాతం వాటాను రిలయన్స్ కలిగి ఉంది. ఇంధన రవాణా కోసం RBML ఇప్పటికే మార్కెటింగ్ అధికారాన్ని కూడా పొందిన విషయం తెలిసిందే.

  Ola Dash: ఓలా స్టోర్ ఇకపై ఓలా డాష్ గా పేరు మార్పు...10 నిమిషాల్లో ఇంటికి సరుకుల డెలివరీ...

  పెట్రోలియం మంత్రిత్వ శాఖ వెబ్‌సైల్లో అందుబాటులో ఉన్న తాజా సమాచారం ప్రకారం .. సెప్టెంబర్ 2021 చివరి నాటికి RBML 1,427 అవుట్‌లెట్‌లను కలిగి ఉండగా.. ఇప్పుడా సంఖ్య 1,448 కి పెరిగింది. మనదేశంలో ఆటో ఫ్యూయల్ రీటైలింగ్లో ప్రభుత్వ రంగ సంస్థలదే ఆధిపత్యం. భారత్లో ఉన్న మొత్తం పెట్రోల్ బంకుల్లో 81,099 ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వహిస్తున్నవే కావడం విశేషం. రోస్‌నేఫ్ట్‌కు చెందిన నయారా ఎనర్జీ 6,496 బంకులతో అతిపెద్ద ప్రైవేట్ ఫ్యూయల్ రిటైలర్‌గా ఉంది. ఇక షెల్ కంపెనీకి మన దేశంలో 310 పెట్రోల్ పంపులు ఉన్నాయి.

  ప్రభుత్వ యాజమాన్యంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) 33,546 పెట్రోల్ పంపులతో అతిపెద్ద ఇంధన రిటైలర్‌గా ఉంది. ఇక ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తున్న భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) 19,668 అవుట్‌లెట్‌లను కలిగి ఉంది. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL)కి 19,602 పెట్రోల్ పంపులున్నాయి.

  Ola Electric Car: ఆకట్టుకుంటున్న ఓలా ఎలక్ట్రిక్ కారు డిజైన్.. మార్కెట్​లోకి

  ఐతే రాబోయే 20 ఏళ్లల్లో ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇంధనాల మార్కెట్‌గా భారతదేశం మారే అవకాశం ఉంది. పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చేందుకు జియో-బీపీ మొబిలిటీ స్టేషన్లు ఏర్పాటవుతున్నాయి. యాడిటివైజ్డ్ ఫ్యూయె్స్, ఈవీ ఛార్జింగ్, రిఫ్రెష్‌మెంట్స్ లాంటివన్నీ ఈ స్టేషన్ల దగ్గర లభిస్తాయి. కాలక్రమంలో తక్కువ కార్బన్ ఉత్పత్తయ్యే పరిష్కారాలను అందిచనుంది జియో-బీపీ.

  భారతదేశం అంతటా రిలయన్స్‌కు పలు వ్యాపారాల్లో విస్తారమైన ఉనికి, లోతైన అనుభవం ఉంది. దీని ద్వారా ఇంధనాలు, మొబిలిటీలో అగ్రగామిగా మారేందుకు ఈ జాయింట్ వెంచర్ ఏర్పాటైంది. కోట్లాది రిలయన్స్ రీటైల్, జియో, బీపీ కస్టమర్లకు ఫ్యూయెల్స్, ల్యూబ్రికెంట్స్, లో కార్బన్ మొబిలిటీ సొల్యూషన్స్ అందించనున్నాయి. రెగ్యులర్ ఫ్యూయెల్స్ కాకుండా దేశవ్యాప్తంగా జియో-బీపీ మొబిలిటీ స్టేషన్స్ ద్వారా యాడిటివైజ్డ్ ప్యూయెల్‌ను ఎలాంటి ఖర్చు లేకుండా పొందొచ్చు. ఈ ఇంధనంలో అంతర్జాతీయంగా అభివృద్ధి చేయబడిన 'యాక్టివ్' సాంకేతికత ఉంటుంది. ఇది ఇంజిన్‌లను శుభ్రంగా ఉంచడానికి సహాయపడుతుంది. క్లిష్టమైన ఇంజిన్ భాగాలపై రక్షణ పొరను ఏర్పరుస్తుంది.

  జియో-బీపీ సంయుక్తంగా కలిసి తమ మొబిలిటీ స్టేషన్ల దగ్గర ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్, బ్యాటరీ స్వాప్ స్టేషన్స్ ఏర్పాటు చేయనున్నాయి. ఇతర ప్రాంతాల్లో మొబిలిటీ పాయింట్స్ ఏర్పాటు చేస్తాయి. ఈ జాయింట్ వెంచర్ భారతదేశంలో ప్రముఖ ఈవీ ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్లేయర్‌గా మారడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ స్టేషన్ల దగ్గర వైల్డ్ బీన్ కేఫ్ ద్వారా కస్టమర్లకు రిఫ్రెష్‌మెంట్స్ కూడా లభిస్తాయి. ప్రతీ రోజు 24 గంటలు అందుబాటులో ఉండే ఈ షాప్‌కు రిలయన్స్ రీటైల్ అవసరమైన సరుకుల్ని, స్నాక్స్, ఇతర తినుండారాలను అందిస్తుంది. వైల్డ్ బీన్ కేఫ్‌లో సిగ్నేచర్ కాఫీతో పాటు స్థానికంగా లభించే మసాలా ఛాయ్, సమోసా, ఉప్మా, పన్నీర్ టిక్కా రోల్, చాక్లెట్ లావా కేక్ లాంటి స్నాక్స్ లభిస్తాయి.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Business, Electric Vehicles, Jio, Petrol, Reliance

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు