Home /News /business /

RELIANCE JIO BECOME INDIAS THIRD LARGEST COMPANY AFTER VISTA EQUITY DEAL OF 11367 CRORE BA

Reliance Jio | మూడు వారాల్లో రూ.60,596 కోట్లు, దేశంలో మూడో అతిపెద్ద కంపెనీగా జియో

రిలయన్స్ జియో అధినేత ముఖేష్ అంబానీ

రిలయన్స్ జియో అధినేత ముఖేష్ అంబానీ

Reliance Jio - Vista Deal | రిలయన్స్ జియో సంస్థ కేవలం మూడు వారాల్లోనే రూ.60,596కోట్ల నిధులను సమీకరించింది.

    రిలయన్స్ జియో సంస్థ కేవలం మూడు వారాల్లోనే రూ.60,596కోట్ల నిధులను సమీకరించింది. జియోలో వాటాల విక్రయం ద్వారా ఆ నిధులను రాబట్టింది. అమెరికాకు చెందిన విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్ సంస్థ జియోలో 2.32 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఆ డీల్ విలువ రూ.11,367 కోట్లు. మూడు వారాల కాలంలోనే రిలయన్స్ జియోలో ఇది మూడు అతి పెద్ద పెట్టుబడి. మొదట ఫేస్ బుక్, ఆ తర్వాత సిల్వర్ లేక్, ఇప్పుడు విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్ సంస్థలు జియోలో పెట్టుబడులు పెట్టి షేర్లు కొనుగోలు చేశాయి. రిలయన్స్ జియోలో ఏప్రిల్ 22న ఫేసే బుక్ 9.99శాతం షేర్లు కొనుగోలు చేసింది. మే 4న సిల్వర్ లేక్ పార్ట్ ‌నర్స్ 1.15 శాతం వాటాను కొనుగోలు చేసింది. మే 8న విస్టా ఈక్విటీ పార్ట్ నర్స్ 2.32 శాతం షేర్లు కొనుగోలు చేసింది. ఆ లెక్కన రిలయన్స్ జియో తర్వాత అత్యధిక షేర్లు కలిగిన రెండో సంస్థగా ఫేస్ బుక్, మూడో అతిపెద్ద షేర్ హోల్డర్‌గా విస్టా ఈక్విటీ పార్ట్ నర్స్, నాలుగో అతి పెద్ద షేర్ హోల్డర్ గా సిల్వర్ లేక్ పార్ట్ నర్స్ నిలిచాయి.

    మూడు వారాల్లో రూ.60,596 కోట్లు నిధులను జియో ద్వారా సమీకరించడంతో రిలయన్స్ జియో మార్కెట్ వాల్యూ రూ.5.16 లక్షల కోట్లకు చేరింది. ఆ రకంగా దేశంలో మూడో అతి పెద్ద మార్కెట్ క్యాప్ కలిగిన సంస్థగా జియో నిలిచింది. జియో కంటే ముందు రిలయన్స్ ఇండస్ట్రీస్ (జియో మాతృసంస్థ), ఐటీ దిగ్గజం టీసీఎస్ ఉన్నాయి.

    దేశంలో టాప్ 10 మార్కెట్ క్యాప్ కంపెనీలు
    రిలయన్స్ ఇండస్ట్రీస్
    టీసీఎస్
    రిలయన్స్ జియో
    హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
    హెచ్‌యూఎల్
    హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్
    ఎయిర్‌టెల్
    ఇన్ఫోసిస్
    కోటక్ మహీంద్ర
    ఐసీఐసీఐ బ్యాంక్
    ఐటీసీ
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Jio, Reliance Industries, Reliance Jio

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు