హోమ్ /వార్తలు /బిజినెస్ /

Reliance Jio: జియో బంపర్ ఆఫర్.. కొత్త ఫోన్.. రెండేళ్ల అపరిమిత కాల్స్‌, ఇంటర్నెట్ సర్వీస్‌.. కేవలం రూ. 1999కే..

Reliance Jio: జియో బంపర్ ఆఫర్.. కొత్త ఫోన్.. రెండేళ్ల అపరిమిత కాల్స్‌, ఇంటర్నెట్ సర్వీస్‌.. కేవలం రూ. 1999కే..

New Jio Phone 2020 Offer: కొత్త జియో ఫోన్‌తో పాటు రెండేళ్ల పాటు అపరిమిత వాయిస్ కాల్స్, అన్‌లిమిటెడ్ డాటా( నెలకు 2 జీబీ)ని కలుపుకుని కేవలం 1999 రూపాయలకే అందించనుంది.

  టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన రిలయెన్స్ జియో.. వినియోగదారులకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. కొత్త జియో ఫోన్‌తో పాటు రెండేళ్ల పాటు అపరిమిత వాయిస్ కాల్స్, అన్‌లిమిటెడ్ డాటా(నెలకు 2 జీబీ)ని కలుపుకుని కేవలం 1999 రూపాయలకే అందించనుంది. ఈ ఆఫర్‌ను పొందిన వినియోగదారులు రెండేళ్ల పాటు ఫోన్‌ రిఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కొత్త జియో ఫోన్‌తో పాటు ఒక ఏడాది పాటు అపరిమిత వాయిస్ కాల్స్, అన్‌లిమిటెడ్ డాటా(నెలకు 2 జీబీ)ని కలుపుకుని 1499 రూపాయలకు అందించబోతున్నట్టు ప్రకటించింది. ఈ ఆఫర్ పొందిన వినియోగదారులు ఏడాది పాటు ఫోన్ రిఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేదు.

  ఇక ప్రస్తుతం జియో ఫోన్ వాడుతున్న వారికి కూడా సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది సంస్థ. ఇందులో భాగంగా ఏడాది పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, అన్‌లిమిటెడ్ డాటా (నెలకు 2జీబీ) పొందేందుకు రూ. 749 చెల్లించాల్సి ఉంటుంది. మార్చి ఒకటో తేదీ నుంచి అన్ని రిలయెన్స్ రిటైల్, జియో రిటైల్ స్టోర్స్‌లో ఈ ఆఫర్ అందుబాటులోకి రానుంది.

  Reliance jio new offer, New Jio Phone 2020 Offer, New Jio Phone 2020 Offer for 1999, New Jio Phone 2020 Offer for 1499, reliance jio new offers, reliance jio offers, new jio phones, రిలయెన్స్ జియో ఆఫర్లు, రిలయెన్స్ జియో కొత్త ఆఫర్లు
  రిలయెన్స్ జియో కొత్త ఆఫర్

  4జీ టెక్నాలజీ అందుబాటులో ఉన్న ప్రస్తుత తరుణంలోనే ఇంకా 30 కోట్ల మంది వినియోగదారులు 2జీ టెక్నాలజీని వినియోగిస్తున్నారని.. 2జీ ముక్త భారత్‌లో భాగంగా ఈ కొత్త ఆఫర్‌ను తీసుకొచ్చినట్టు వెల్లడించింది. 5జీ టెక్నాలజీని అందిపుచ్చుకునే సమయంలో 30 కోట్ల మంది ఇంకా సరైన ఇంటర్నెట్ సర్వీసులు వినియోగించుకోలేని 2జీ టెక్నాలజీ మొబైల్ సర్వీసులనే వాడుతున్నారని రిలయన్స్ జియో డైరెక్టర్ ఆకాష్ అంబానీ అంబానీ అన్నారు. టెక్నాలజీ లాభాలు ఏ కొద్దిమందికి మాత్రమే పరిమితం కాకూడదనే ఉద్దేశ్యంతో జియో పని చేసిందని.. ఈ క్రమంలోనే న్యూ జియో ఫోన్ 2021 ఆఫర్‌ను తీసుకొచ్చిందని తెలిపారు.

  First published:

  Tags: Jio, Jio phone

  ఉత్తమ కథలు