హోమ్ /వార్తలు /బిజినెస్ /

Jio Plans: వ్యాపారులకు శుభవార్త... జియో నుంచి ప్రత్యేక ప్లాన్స్

Jio Plans: వ్యాపారులకు శుభవార్త... జియో నుంచి ప్రత్యేక ప్లాన్స్

Jio Plans: వ్యాపారులకు శుభవార్త... జియో నుంచి ప్రత్యేక ప్లాన్స్
(image: Jio)

Jio Plans: వ్యాపారులకు శుభవార్త... జియో నుంచి ప్రత్యేక ప్లాన్స్ (image: Jio)

JioBusiness Plans | జియోబిజినెస్ పేరుతో వ్యాపారుల కోసం సరికొత్త ప్లాన్స్ ప్రకటించింది రిలయెన్స్. ఇందులో డేటా, వాయిస్ సేవలతో పాటు ఇతర సేవలు లభిస్తాయి. ప్లాన్స్ వివరాలు తెలుసుకోండి.

చిన్న, సూక్ష్మ, మధ్యతరహా వ్యాపారాలు నిర్వహించేవారికి రిలయెన్స్ జియో శుభవార్త చెప్పింది. 'జియో బిజినెస్' పేరుతో సరికొత్త ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్ ప్రకటించింది. తక్కువ ధరకే డేటా, వాయిస్ సేవల్ని అందిస్తోంది. చిన్న, సూక్ష్మ, మధ్యతరహా వ్యాపారులను దృష్టిలో పెట్టుకొని వారి అవసరాలకు తగ్గట్టుగా ప్లాన్స్ ప్రకటించింది. ఈ ప్లాన్స్ నెలకు రూ.901 రెంటల్‌తో ప్రారంభమౌతాయి. రూ.10,001 వరకు ప్లాన్స్ ఉన్నాయి. వేర్వేరు ప్లాన్స్‌కి బెనిఫిట్స్ కూడా వేరుగా ఉంటాయి. ఈ ప్లాన్స్‌లో అన్‌లిమిటెడ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఫిక్స్‌డ్ మొబైల్ కన్వర్జెన్స్, స్టాటిక్ ఐపీ, ప్రొడక్టివిటీ, జియో అటెండెన్స్, మార్కెటింగ్, కాన్ఫరెన్సింగ్, డివైజ్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలను www.jio.com/business వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

భారత ఆర్థిక వ్యవస్థకు చిన్న, సూక్ష్మ, మధ్యతరహా వ్యాపారాలు మూలం. ప్రస్తుతం వారికి తమ వ్యాపారాలను ముందుగు నడిపించడానికి ఉపయోగపడే ఇంటిగ్రేటెడ్ డిజిటల్ సేవలు అందుబాటులో లేవు. తమ వ్యాపారాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు డిజిటల్ టెక్నాలజీ సేవల్ని పొందలేకపోతున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జియోబిజినెస్ ద్వారా ఈ వ్యాపారాలకు ఉపయోగపడేలా వాయిస్, డేటా సేవలు, డిజిటల్ సొల్యూషన్స్, డివైజ్‌లను అందిస్తున్నాం. సులభంగా ఉపయోగించుకోగల ఈ సేవలతో వ్యాపారులు తమ వ్యాపారాలను సమర్థవంతంగా ఉపయోగించుకోగలరు. ప్రస్తుతం కనెక్టివిటీ, ప్రొడక్టివిటీ, ఆటోమేషన్ టూల్స్ కోసం నెలకు రూ.15,000 నుంచి రూ.20,000 వరకు ఖర్చు చేస్తున్నారు. అందులో పదో వంతు ఖర్చుతోనే ఈ సేవల్ని అందిస్తున్నాం. చిన్న, సూక్ష్మ, మధ్యతరహా వ్యాపారాలు సరికొత్త ఆత్మనిర్భర్ డిజిటల్ భారత్ వైపు అడుగులు వేసేందుకు ఇది ఉపయోగపడుతుంది.

ఆకాశ్ అంబానీ, డైరెక్టర్, జియో

JioBusiness data plans, JioBusiness special plans, Jio broadband plans for MSMEs, Jio broadband plans for business, Jio broadband plans for MSMEs, JioFiber latest plans, జియోబిజినెస్ డేటా ప్లాన్స్, జియోబిజినెస్ స్పెషల్ ప్లాన్స్, జియో బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్, జియోఫైబర్ లేటెస్ట్ ప్లాన్స్, జియోఫైబర్ కొత్త ప్లాన్స్
Jio Plans: వ్యాపారులకు శుభవార్త... జియో నుంచి ప్రత్యేక ప్లాన్స్
(image: Jio)

JioBusiness Plans: జియో బిజినెస్ ప్లాన్స్ వివరాలు ఇవే...


JioBusiness Rs 901 Plan: జియోబిజినెస్ రూ.901 ప్లాన్ తీసుకుంటే 100ఎంబీపీఎస్ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ లభిస్తుంది. ఒక లైన్‌తో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి. ఇండియాలో ఎక్కడికైనా కాల్స్ చేయొచ్చు.

JioBusiness Rs 1,201 Plan: జియోబిజినెస్ రూ.1,201 ప్లాన్ తీసుకుంటే 150ఎంబీపీఎస్ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ లభిస్తుంది. రెండు లైన్స్‌తో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి. ఇండియాలో ఎక్కడికైనా కాల్స్ చేయొచ్చు. ఆఫీస్ బయట బిజినెస్ కాల్స్ చేసేందుకు ఫిక్స్‌డ్ మొబైల్ కన్వర్జెన్స్ లభిస్తుంది. ఇంట్రడక్టరీ ఆఫర్‌లో భాగంగా మూడు నెలలు లభిస్తుంది. ప్రొడక్టివిటీ కోసం ఆఫీస్ యాప్స్, ఔట్‌లుక్ ఇమెయిల్, వన్ డ్రైవ్, టీమ్స్‌తో మైక్రోసాఫ్ట్ 365 సాఫ్ట్‌వేర్ 2 లైసెన్సులు లభిస్తాయి. జియో అటెండెన్స్ 10 లైసెన్స్‌లు లభిస్తాయి. మార్కెటింగ్ కోసం జియోఆన్‌లైన్ బేసిక్ వర్షన్ లభిస్తుంది.

SBI Annuity Scheme: ఈ స్కీమ్‌లో చేరితే ప్రతీ నెల అకౌంట్‌లోకి డబ్బులు... స్కీమ్ వివరాలివే

Flipkart Smartphone Carnival: ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్ కార్నివాల్... ఈ 20 మోడల్స్‌పై రూ.10,000 వరకు డిస్కౌంట్

JioBusiness Rs 2,001 Plan: జియోబిజినెస్ రూ.2,001 ప్లాన్ తీసుకుంటే 300ఎంబీపీఎస్ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ లభిస్తుంది. నాలుగు లైన్స్‌తో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి. ఇండియాలో ఎక్కడికైనా కాల్స్ చేయొచ్చు. ఆఫీస్ బయట బిజినెస్ కాల్స్ చేసేందుకు ఫిక్స్‌డ్ మొబైల్ కన్వర్జెన్స్ లభిస్తుంది. ఇంట్రడక్టరీ ఆఫర్‌లో భాగంగా మూడు నెలలు లభిస్తుంది. ప్రొడక్టివిటీ కోసం ఆఫీస్ యాప్స్, ఔట్‌లుక్ ఇమెయిల్, వన్ డ్రైవ్, టీమ్స్‌తో మైక్రోసాఫ్ట్ 365 సాఫ్ట్‌వేర్ 4 లైసెన్సులు లభిస్తాయి. జియో అటెండెన్స్ 10 లైసెన్స్‌లు లభిస్తాయి. మార్కెటింగ్ కోసం జియోఆన్‌లైన్ బేసిక్ వర్షన్ లభిస్తుంది. రిలయెన్స్ డిజిటల్ నుంచి డివైజ్‌లు కూడా లభిస్తాయి.

JioBusiness Rs 3,001 Plan: జియోబిజినెస్ రూ.3,001 ప్లాన్ తీసుకుంటే 500ఎంబీపీఎస్ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ లభిస్తుంది. నాలుగు లైన్స్‌తో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి. ఇండియాలో ఎక్కడికైనా కాల్స్ చేయొచ్చు. ఆఫీస్ బయట బిజినెస్ కాల్స్ చేసేందుకు ఫిక్స్‌డ్ మొబైల్ కన్వర్జెన్స్ లభిస్తుంది. ఇంట్రడక్టరీ ఆఫర్‌లో భాగంగా మూడు నెలలు లభిస్తుంది. ప్రొడక్టివిటీ కోసం ఆఫీస్ యాప్స్, ఔట్‌లుక్ ఇమెయిల్, వన్ డ్రైవ్, టీమ్స్‌తో మైక్రోసాఫ్ట్ 365 సాఫ్ట్‌వేర్ 6 లైసెన్సులు లభిస్తాయి. జియో అటెండెన్స్ 10 లైసెన్స్‌లు లభిస్తాయి. మార్కెటింగ్ కోసం జియోఆన్‌లైన్ బేసిక్ వర్షన్ లభిస్తుంది. రిలయెన్స్ డిజిటల్ నుంచి డివైజ్‌లు కూడా లభిస్తాయి.

Aadhaar Card Update: డాక్యుమెంట్స్ లేకపోయినా ఆధార్‌లో అడ్రస్ మార్చొచ్చు ఇలా

Rs 2000 Note: రూ.2000 నోటు నకిలీదని డౌట్ ఉందా? ఈ 17 గుర్తులు చెక్ చేయండి

JioBusiness Rs 5,001 Plan: జియోబిజినెస్ రూ.5,001 ప్లాన్ తీసుకుంటే 1జీబీపీఎస్ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ లభిస్తుంది. నాలుగు లైన్స్‌తో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి. ఇండియాలో ఎక్కడికైనా కాల్స్ చేయొచ్చు. ఆఫీస్ బయట బిజినెస్ కాల్స్ చేసేందుకు ఫిక్స్‌డ్ మొబైల్ కన్వర్జెన్స్ లభిస్తుంది. ప్రొడక్టివిటీ కోసం ఆఫీస్ యాప్స్, ఔట్‌లుక్ ఇమెయిల్, వన్ డ్రైవ్, టీమ్స్‌తో మైక్రోసాఫ్ట్ 365 సాఫ్ట్‌వేర్ 10 లైసెన్సులు లభిస్తాయి. జియో అటెండెన్స్ 20 లైసెన్స్‌లు లభిస్తాయి. మార్కెటింగ్ కోసం జియోఆన్‌లైన్ ప్రో వర్షన్ లభిస్తుంది. కాన్ఫరెన్సింగ్ కోసం జియోమీట్ 2 లైనెన్సులు, మైక్రోసాఫ్ట్ టీమ్స్ 10 లైసెన్సులు లభిస్తాయి. రిలయెన్స్ డిజిటల్ నుంచి డివైజ్‌లు కూడా లభిస్తాయి.

JioBusiness Rs 7,001 Plan: జియోబిజినెస్ రూ.7,001 ప్లాన్ తీసుకుంటే 1జీబీపీఎస్ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ లభిస్తుంది. ఎనిమిది లైన్స్‌తో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి. ఇండియాలో ఎక్కడికైనా కాల్స్ చేయొచ్చు. ఆఫీస్ బయట బిజినెస్ కాల్స్ చేసేందుకు ఫిక్స్‌డ్ మొబైల్ కన్వర్జెన్స్ లభిస్తుంది. ప్రొడక్టివిటీ కోసం ఆఫీస్ యాప్స్, ఔట్‌లుక్ ఇమెయిల్, వన్ డ్రైవ్, టీమ్స్‌తో మైక్రోసాఫ్ట్ 365 సాఫ్ట్‌వేర్ 15 లైసెన్సులు లభిస్తాయి. జియో అటెండెన్స్ 30 లైసెన్స్‌లు లభిస్తాయి. మార్కెటింగ్ కోసం జియోఆన్‌లైన్ ప్రో వర్షన్ లభిస్తుంది. కాన్ఫరెన్సింగ్ కోసం జియోమీట్ 3 లైనెన్సులు, మైక్రోసాఫ్ట్ టీమ్స్ 15 లైసెన్సులు లభిస్తాయి. రిలయెన్స్ డిజిటల్ నుంచి డివైజ్‌లు కూడా లభిస్తాయి.

JioBusiness Rs 10,001 Plan: జియోబిజినెస్ రూ.10,001 ప్లాన్ తీసుకుంటే 1జీబీపీఎస్ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ లభిస్తుంది. ఎనిమిది లైన్స్‌తో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి. ఇండియాలో ఎక్కడికైనా కాల్స్ చేయొచ్చు. ఆఫీస్ బయట బిజినెస్ కాల్స్ చేసేందుకు ఫిక్స్‌డ్ మొబైల్ కన్వర్జెన్స్ లభిస్తుంది. ప్రొడక్టివిటీ కోసం ఆఫీస్ యాప్స్, ఔట్‌లుక్ ఇమెయిల్, వన్ డ్రైవ్, టీమ్స్‌తో మైక్రోసాఫ్ట్ 365 సాఫ్ట్‌వేర్ 25 లైసెన్సులు లభిస్తాయి. జియో అటెండెన్స్ 50 లైసెన్స్‌లు లభిస్తాయి. మార్కెటింగ్ కోసం జియోఆన్‌లైన్ ప్రో వర్షన్ లభిస్తుంది. కాన్ఫరెన్సింగ్ కోసం జియోమీట్ 4 లైనెన్సులు, మైక్రోసాఫ్ట్ టీమ్స్ 25 లైసెన్సులు లభిస్తాయి. రిలయెన్స్ డిజిటల్ నుంచి డివైజ్‌లు కూడా లభిస్తాయి.

First published:

Tags: Jio, Jio fiber, JioFiber, Reliance Jio