హోమ్ /వార్తలు /బిజినెస్ /

Jio 6th Anniversary Offer: జియో యూజర్లకు గుడ్ న్యూస్... రూ.10 లక్షల వరకు రివార్డ్స్

Jio 6th Anniversary Offer: జియో యూజర్లకు గుడ్ న్యూస్... రూ.10 లక్షల వరకు రివార్డ్స్

Jio 6th Anniversary Offer: జియో యూజర్లకు గుడ్ న్యూస్... రూ.10 లక్షల వరకు రివార్డ్స్
(image: Jio)

Jio 6th Anniversary Offer: జియో యూజర్లకు గుడ్ న్యూస్... రూ.10 లక్షల వరకు రివార్డ్స్ (image: Jio)

Jio 6th Anniversary Offer | జియో ప్లాన్ రీఛార్జ్ చేయాలనుకునేవారికి అలర్ట్. జియో ఆరో యానివర్సరీ ఆఫర్స్ ప్రకటించింది రిలయన్స్ జియో. సెప్టెంబర్ 11 వరకు జియో ప్లాన్స్ (Jio Plans) రీఛార్జ్ చేసేవారికి ఈ ఆఫర్స్ లభిస్తాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

రిలయన్స్ జియో 6వ వార్షికోత్సవం సందర్భంగా అద్భుతమైన ఆఫర్స్ ప్రకటించింది. జియో ఆరో వార్షికోత్సవం (Jio 6th Anniversary) సందర్భంగా రెండు ఆఫర్స్ ప్రకటించింది. జియో యూజర్లకు రూ.10 లక్షల వరకు రివార్డ్స్ అందించడమే కాకుండా, ఓ ప్లాన్ రీఛార్జ్ (Jio Plans) చేసేవారికి అదనంగా ఆరు బెనిఫిట్స్ అందిస్తోంది. జియో యూజర్లు సెప్టెంబర్ 11 వరకు ఈ ఆఫర్స్ పొందొచ్చు. ఇవి లిమిటెడ్ పీరియడ్ ఆఫర్స్ మాత్రమే. ఆ తర్వాత ఆఫర్స్ అందుబాటులో ఉండవు. సెప్టెంబర్ 12 నుంచి రీఛార్జ్ చేసేవారికి జియో 6వ వార్షికోత్సవం ఆఫర్స్ లభించవు. మరి జియో 6వ వార్షికోత్సవం సందర్బంగా ఎలాంటి ఆఫర్స్ పొందొచ్చో తెలుసుకోండి.

Jio Rs 2,999 Plan: జియో ఆరో వార్షికోత్సవం సందర్భంగా రూ.2,999 యాన్యువల్ ప్లాన్‌పై ఆరు ఆఫర్స్ పొందొచ్చు. సెప్టెంబర్ 11 లోగా జియో రూ.2,999 యాన్యువల్ ప్లాన్ రీఛార్జ్ చేస్తే అదనంగా 75జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. ట్రావెల్ ఆఫర్‌లో భాగంగా ఇక్సిగో నుంచి రూ.750 కూపన్ లభిస్తుంది. ఇక్సిగోలో రూ.4,500 కన్నా ఎక్కువ ట్రాన్సాక్షన్‌పై ఈ ఆఫర్ ఉపయోగించుకోవచ్చు. ఇక హెల్త్ ఆఫర్‌లో భాగంగా నెట్‌మెడ్స్ నుంచి రూ.750 తగ్గింపు కూపన్ లభిస్తుంది. మూడు డిస్కౌంట్ కూపన్స్ లభిస్తాయి. రూ.1,000 కన్నా ఎక్కువ ట్రాన్సాక్షన్‌పై 25 శాతం చొప్పున డిస్కౌంట్ పొందొచ్చు.

Mobile Releases: ఒకే రోజు... నాలుగు కొత్త స్మార్ట్‌ఫోన్ల రిలీజ్... ధర, ఫీచర్స్ వివరాలివే

ఇక ఫ్యాషన్ ఆఫర్‌లో భాగంగా ఆజియో నుంచి రూ.750 కన్నా ఎక్కువ తగ్గింపు లభిస్తుంది. రూ.2,990 కన్నా ఎక్కువ లావాదేవీలపై ఈ ఆఫర్ పొందొచ్చు. ఎంటర్‌టైన్‌మెంట్ ఆఫర్‌లో భాగంగా జియో సావన్ ప్రో 6 నెలల ప్యాక్‌పై 50 శాతం తగ్గింపు లభిస్తుంది. ఎలక్ట్రానిక్స్ ఆఫర్‌లో భాగంగా రిలయన్స్ డిజిటల్‌లో రూ.5,000 కన్నా ఎక్కువ కొన్నవారికి రూ.500 డిస్కౌంట్ లభిస్తుంది. జియో రూ.2,999 యాన్యువల్ ప్లాన్‌పైన మాత్రమే ఈ 6 ఆఫర్స్ లభిస్తాయి. ఇతర ప్లాన్స్‌కు ఈ ఆఫర్ వర్తించదు.

Poco M5: కొత్త ప్రాసెసర్, 6GB ర్యామ్, 50MP కెమెరాతో పోకో ఎం5 వచ్చేసింది... ఆఫర్ ధర, ఫీచర్స్ వివరాలివే

జియో రూ.2,999 యాన్యువల్ ప్లాన్ రీఛార్జ్ చేసిన తర్వాత మైజియో యాప్‌లో మై కూపన్స్ సెక్షన్లో ఈ వోచర్స్ చూడొచ్చు. ఆఫ్‌లైన్‌లో, ఆన్‌లైన్‌లో రీఛార్జ్ చేసేవారికి ఈ ఆఫర్స్ వర్తిస్తాయి. ఈ కూపన్స్ రీడీమ్ చేయడానికి ముందుగా మైజియో యాప్‌లో లాగిన్ కావాలి. ఆ తర్వాత మై కూపన్స్ సెక్షన్ ఓపెన్ చేయాలి. అందులో మీరు రీడీమ్ చేయాలనుకునే కూపన్ లేదా వోచర్ సెలెక్ట్ చేయాలి. కోడ్ ఉపయోగించి ఆఫర్ రీడీమ్ చేయాలి. ఇక జియో మరో ఆఫర్ కూడా ప్రకటించింది. రూ.299 కన్నా ఎక్కువ ప్రీపెయిడ్ ప్లాన్స్ రీఛార్జ్ చేసేవారికి రివార్డ్స్ ప్రకటించింది. రోజూ రూ.10 లక్షల వరకు రివార్డ్స్ పొందొచ్చు.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Jio, Reliance Jio

ఉత్తమ కథలు