రిలయెన్స్ జియో మరో మూడు కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రకటించింది. ఇవి ఆల్ ఇన్ వన్ ప్రీపెయిడ్ యాన్యువల్ ప్లాన్స్. అంటే ఒకసారి రీఛార్జ్ చేస్తే సుమారు ఏడాది వరకు బెనిఫిట్స్ లభిస్తాయి. ఎక్కువ వేలిడిటీతో ప్లాన్స్ కోరుకునేవారి కోసం ఈ కొత్త ప్లాన్స్ ప్రకటించింది రిలయెన్స్ జియో. రూ.1,001 నుంచి ప్లాన్స్ మొదలౌతాయి. రూ.1,001 ప్లాన్‌తో పాటు రూ.1,301, రూ.1,501 ప్లాన్స్ కూడా ఉన్నాయి. ఈ ప్లాన్స్ రీఛార్జ్ చేసిన వారికి డేటాతో పాటు వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ లభిస్తాయి. మరి ఏ ప్లాన్ రీఛార్జ్ చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో తెలుసుకోండి.
Jio Rs 1,001 Plan: రిలయెన్స్ జియో రూ.1,001 ఆల్ ఇన్ వన్ ప్లాన్ రీఛార్జ్ చేసినవారికి 336 రోజుల వేలిడిటీ లభిస్తుంది. మొత్తం 49 జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. అంటే రోజుకు 150 ఎంబీ డేటా చొప్పున వస్తుంది. డైలీ లిమిట్ క్రాస్ కాగానే స్పీడ్ తగ్గుతుంది. తక్కువ డేటా ఉపయోగించేవారికి ఈ ప్లాన్ ఉపయోగకరం. ఈ ప్లాన్‌లో జియో నుంచి జియోకు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. నాన్ జియో కాల్స్ 12,000 నిమిషాలు ఉంటాయి. రోజూ 100 ఎస్ఎంఎస్‌లతో పాటు జియో యాప్స్‌కి కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.
Prepaid Plans: 84 రోజుల వేలిడిటీ, డేటాతో Airtel, Jio, Vi ప్లాన్స్ ఇవే
మీ EPF Account Transfer ఆన్‌లైన్‌లో ఈజీగా చేయండిలా
Jio Rs 1,301 Plan: రిలయెన్స్ జియో రూ.1,301 ఆల్ ఇన్ వన్ ప్లాన్ రీఛార్జ్ చేసినవారికి 336 రోజుల వేలిడిటీ లభిస్తుంది. మొత్తం 164 జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. అంటే రోజుకు 500 ఎంబీ డేటా చొప్పున వస్తుంది. డైలీ లిమిట్ క్రాస్ కాగానే స్పీడ్ తగ్గుతుంది. తక్కువ డేటా ఉపయోగించేవారికి ఈ ప్లాన్ ఉపయోగకరం. ఈ ప్లాన్‌లో జియో నుంచి జియోకు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. నాన్ జియో కాల్స్ 12,000 నిమిషాలు ఉంటాయి. రోజూ 100 ఎస్ఎంఎస్‌లతో పాటు జియో యాప్స్‌కి కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.
Jio Rs 1,501 Plan: రిలయెన్స్ జియో రూ.1,501 ఆల్ ఇన్ వన్ ప్లాన్ రీఛార్జ్ చేసినవారికి 336 రోజుల వేలిడిటీ లభిస్తుంది. మొత్తం 504 జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. అంటే రోజుకు 1.5 జీబీ డేటా చొప్పున వస్తుంది. డైలీ లిమిట్ క్రాస్ కాగానే స్పీడ్ తగ్గుతుంది. తక్కువ డేటా ఉపయోగించేవారికి ఈ ప్లాన్ ఉపయోగకరం. ఈ ప్లాన్‌లో జియో నుంచి జియోకు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. నాన్ జియో కాల్స్ 12,000 నిమిషాలు ఉంటాయి. రోజూ 100 ఎస్ఎంఎస్‌లతో పాటు జియో యాప్స్‌కి కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.
ఇవే కాకుండా జియో నుంచి మరో నాలుగు ఆల్ ఇన్ వన్ ప్లాన్స్ ఉన్నాయి. రూ.75, రూ.125, రూ.155, రూ.185 ప్లాన్స్ ఉన్నాయి. ఈ ప్లాన్స్ వేలిడిటీ 28 రోజులు మాత్రమే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: BUSINESS NEWS, Jio, Reliance Jio