Home /News /business /

RELIANCE JEWELS VARALAKSHMI COLLECTIONS GREAT DISCOUNTS UPTO 25 PERCENT HERE IS OFFERS DETAILS NS

Reliance Jewels: ‘దేవతలా మెరిసిపోండి’.. రిలయన్స్ జ్యువెల్స్ వరలక్ష్మి కలెక్షన్ 2022.. 25% వరకు తగ్గింపులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భారతదేశంలోని ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్, రిలయన్స్ జ్యువెల్స్, వరలక్ష్మీ వ్రతం పండుగను పురస్కరించుకొని తమ ప్రత్యేక వరలక్ష్మి కలెక్షన్ ను ప్రారంభించింది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Vijayawada
  భారతదేశంలోని ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్, రిలయన్స్ జ్యువెల్స్ (Reliance Jewels) వరలక్ష్మీ వ్రతం (Varalaxmi Vratham) పండుగను పురస్కరించుకొని తమ ప్రత్యేక వరలక్ష్మి కలెక్షన్ ను ప్రారంభించింది. ఇక్కడ భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో మహిళలు లక్ష్మీదేవిని పూజిస్తారు (Varalaxmi Vratham). తనంతట తానుగా దేవతలా ప్రతిబింబించే ప్రతి మహిళా జరుపుకొనే లక్ష్యంతో 'గ్లో లైక్ ఏ గాడెస్’ అనే సేకరణ కోసం బ్రాండ్ ప్రచారం ఉద్దేశించబడింది. దేవత యొక్క దివ్యత్వం, కృప మరియు తేజస్సు నుండి ప్రేరణ పొందిన ఈ సేకరణ, మహిళలందరూ తమ అంతర్గత దేవతను ఆలింగనం చేసుకోవడానికి ఒక గుర్తు. దక్షిణ భారతదేశ గొప్ప సాంస్కృతిక వారసత్వం మరియు సంప్రదాయాలను వెలికితీసే ఈ ఆభరణాలను  (Jewellary) ప్రాంతీయ అభిరుచులు, సాంస్కృతిక సూక్ష్మాంశాలు, శైలులను దృష్టిలో పెట్టుకొని రూపొందించారు. ప్రచారం, రూపకల్పనలు రెండూ పవిత్రమైన "కల్పవృక్షం" నుండి ప్రేరణ పొందాయి, ఈ వృక్షం లోతైన ఆధ్యాత్మిక, పౌరాణిక శక్తులను కలిగి ఉందని భక్తులు విశ్వసిస్తారు, సముద్ర మంథన్ పురాతన కథల నుంచి ఇది ఉద్భవించింది.

  నెక్లెస్ లు, చెవిరింగులు, గాజులు మరియు ఉంగరాలతో సహా సంక్లిష్టంగా రూపొందించబడ్డ సంప్రదాయ ఆభరణాలు ఈ కలెక్షన్ లో భాగం అవుతాయి. 22kt పసుపు బంగారం, పురాతన బంగారు దేవాలయ డిజైన్‌లలో రూపొందించబడి, రంగు రాళ్లతో అలంకరించబడిన, ప్రతి బంగారు ఆభరణపు డిజైన్ మరోదానికి భిన్నంగా ఉంటుంది, ఇది కలెక్షన్‌ని అన్ని విధాలుగా ప్రత్యేకంగా చేస్తుంది. అద్భుతమైన డైమండ్ కలెక్షన్‌లో చోకర్లు మరియు హరామ్ సెట్‌లు, పెండెంట్‌లపై పెర్ల్ డ్రాప్ యాక్సెంట్‌లు, రంగు రాళ్లు, గుదిగుచ్చి అద్దిన డైమండ్‌లు ఉంటాయి. దేవత దయ, సంయమనం, దైవత్వం ప్రతి ముక్కలో అందంగా ప్రతిబింబించబడతాయి, పండుగల సమయంలో ప్రతి మహిళకు ఇది ఖచ్చితమైన అలంకరణ.

  ఈ సేకరణ ప్రారంభం గురించి రిలయన్స్ జ్యువెల్స్ సీఈవో సునీల్ నాయక్ మాట్లాడుతూ, "పవిత్రమైన పండుగను ఘనంగా జరుపుకోవడం, సంగ్రహించడమే ఈ మొత్తం సేకరణలో మా విజన్. ఈ ప్రాంత కస్టమర్‌ల అభిరుచులకు అనుగుణంగా ఉండే ఈ విభిన్న శైలులను తీసుకురావడం మాకు సంతోషంగా ఉంది. దక్షిణ భారతదేశానికి చెందిన మా అత్యంత ఉద్వేగభరితమైన డిజైన్ బృందాలు… అందమైన డిజైన్లను సృష్టించడానికి ప్రతి క్లిష్టమైన డిజైన్ వివరాలు, ఎలిమెంట్స్ జతకూరేలా సేకరణపై జాగ్రత్తగా పనిచేశాయి" అని అన్నారు.

  ఈ సంవత్సరం 15వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న రిలయన్స్ జ్యువెల్స్… పండుగలు మరియు సందర్భాలు, అనేకమంది జీవితాలు, ఇళ్లలో చాలా ప్రియమైన, ప్రజాదరణ పొందిన భాగంగా మారింది. ప్రతి సంవత్సరం కస్టమర్‌ల జీవితంలోని ప్రతి సందర్భం, క్షణాలతో జ్యువెలరీ ద్వారా ఒక భావోద్వేగ సంబంధాన్ని సృష్టించడంపై బ్రాండ్ దృష్టి సారించింది. వరలక్ష్మి కలెక్షన్ వంటి కలెక్షన్లతో ఈ సంవత్సరం కూడా అనేక సందర్భాలలో రిలయన్స్ జ్యువెల్స్ వెలుగులద్దుతూ, ప్రజలను ప్రేరేపించే ‘బి ద మూమెంట్’లా తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది.

  వరలక్ష్మి కలెక్షన్ 2022లో బ్రాండ్ నుంచి ఎంచుకోగల సున్నితమైన శ్రేణికి అదనంగా, కంపెనీ ఆగస్టు 31 వరకు కస్టమర్ లందరికీ బంగారు ఆభరణాల తయారీ, డైమండ్ జువెలరీ విలువపై 25% వరకు తగ్గింపుతో ప్రత్యేక ఆఫర్‌ని అందిస్తోంది.


  రిలయన్స్ జ్యువెల్స్ గురించి:
  రిలయన్స్ జ్యువెల్స్ రిలయన్స్ రిటైల్ లిమిటెడ్‌లో ఒక భాగం, ఇది భారతదేశంలోని ప్రముఖ రిటైలర్. బ్రాండ్ అద్భుతమైన మరియు విస్తృతమైన గోల్డ్, డైమండ్ & వెండి ఆభరణాల సేకరణలను అందిస్తుంది. డిజైన్ మరియు హస్తకళపై దృష్టి సారించి, కళ, క్రాఫ్ట్ మరియు గొప్ప భారతీయ వారసత్వం నుండి ప్రేరణ పొందిన మా కస్టమర్‌లకు ప్రత్యేకమైన మరియు విశిష్టమైన డిజైనర్ కలెక్షన్‌లను అందించడం బ్రాండ్ లక్ష్యం. రిలయన్స్ జ్యువెల్స్ తన కస్టమర్ జీవితంలోని ప్రతి ప్రత్యేక క్షణాన్ని సంబరంగా జరుపుకోవాలని విశ్వసిస్తుంది.

  రిలయన్స్ జ్యువెల్స్ 150+ నగరాల్లో 300+ ఫ్లాగ్‌షిప్ షోరూమ్‌లు & షాప్-ఇన్ షాపులను కలిగి ఉంది, నిర్వహిస్తోంది మరియు ఘనంగా అభివృద్ధి చెందుతోంది. బ్రాండ్ ఎల్లప్పుడూ వారికి ఆదర్శప్రాయమైన సేవలు మరియు ఏకీకృత జ్యువెలరీ షాపింగ్ అనుభవం ద్వారా కస్టమర్లకు ఆనందాన్ని అందిస్తోంది. రిలయన్స్ జ్యువెల్స్ వద్ద, బంగారం, వజ్రాలు అత్యంత పోటీ ధరలలో లభిస్తాయి. జీరో-వేస్ట్ మరియు కాంపిటేటివ్ మేకింగ్ ఛార్జీలు కస్టమర్‌లకు 100 శాతం సంతృప్తిని అందిస్తాయి.


  రిలయన్స్ జ్యువెల్స్ ప్రతి ముక్కలో 100 శాతం స్వచ్ఛత, పారదర్శక ధర మరియు నాణ్యత హామీ ఇస్తుంది. బ్రాండ్ 100 శాతం BIS హాల్‌మార్క్డ్ గోల్డ్‌తో మాత్రమే డీల్ చేస్తుంది మరియు ఉపయోగించిన ప్రతి వజ్రం స్వతంత్ర ధృవీకరణ ప్రయోగశాలలచే ధృవీకరించబడుతుంది. అన్ని రిలయన్స్ జ్యువెల్స్ షోరూమ్‌లలో మరమ్మతుల కోసం క్యూసీ టెక్ రూమ్‌లు, బంగారం స్వచ్ఛతను ఉచితంగా అంచనా వేయడానికి కస్టమర్లకు కారత్ మీటర్లు ఉన్నాయి. ఇది కాకుండా బ్రాండ్ ప్రతి కొనుగోలుపై లాయల్టీ పాయింట్లను కూడా అందిస్తుంది. ప్రతీ సేకరణలో అద్భుతమైన వివిధ రకాల డిజైన్‌లతో, రిలయన్స్ జ్యువెల్స్ ప్రతి వ్యక్తిత్వానికి మరియు ప్రతి సందర్భానికి సరిపోయే ఆభరణాలను కలిగి ఉంది.
  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Jewellery, Reliance Jewels, Varalakshmi vratham

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు