Reliance Jewels: రిలయన్స్ జువలరీస్ నుంచి ధన్‌తేరాస్ కోసం Kaasyam Collection..సంబరాలు..

ప్రతీకాత్మకచిత్రం

భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన ఆభరణాల బ్రాండ్‌లలో ఒకటైన రిలయన్స్‌ జ్యువెల్స్‌ ఈ పండుగ సీజన్‌ ప్రారంభం సందర్భంగా "కాశ్యం” అనే అద్భుత ఆభరణాల కలెక్షన్‌ ను ప్రారంభించింది.

 • Share this:
  భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన ఆభరణాల బ్రాండ్‌లలో ఒకటైన రిలయన్స్‌ జ్యువెల్స్‌ ఈ పండుగ సీజన్‌ ప్రారంభం సందర్భంగా "కాశ్యం” అనే అద్భుత ఆభరణాల కలెక్షన్‌ ను ప్రారంభించింది. కళ, సంస్కృతి, దేవాలయాలు, నిర్మాణ అద్భుతాల నుండి ఈ కలెక్షన్ ప్రేరణ పొందింది. దీనిలో బనారస్‌ సంప్రదాయ విశిష్టత, వారసత్వం, వారి గొప్ప నమ్మకాలు వ్యక్తీకరించబడినవి. కాశి విశ్వనాథ్‌ దుర్గా కుండ్‌ దేవాలయం, రత్నేష్‌ మహాదేవ్‌ దేవాలయం, విశాలాక్షి & బౌద్ధ దేవాలయం, రామ్‌నగర్‌ కోట, తులసి ఘాట్‌, ప్రాచీన ద్వారాలు & జంతర్‌ మంతర్‌ వంటి కళా రూపాల నేపథ్యంతో, బనారన్‌ చీరలు, గంగా ఆర్తి, గంగా ఘాట్‌, గులాబీ మీనాకారి & రిపాస్సే వంటి శక్తివంతమైన & అందమైన కళారూపాల విభిన్న డిజైనులలో రూపొందించబడిన వైభవమైన నగల ఆభరణాలను వినియోగదారులు ఎంచుకోవచ్చు.

  ఈ బ్రాండ్‌ డిజైన్‌ వారసత్వాన్ని కొనసాగించడానికి & నవరాత్రి, దుర్గా పూజ, దీపావళి & ధన్‌ తేరస్‌ పండుగలు, వివాహాలు వంటి ప్రత్యేక సందర్భాలలో వినియోగదారుల కోసం మరింత ప్రత్యేకంగా చేయడానికి, గొప్ప సాంస్కృతిక వారసత్వం, నిర్మాణాత్మక అద్భుతాలు, బనారస్ కళలు బంగారం & డైమండ్‌లో అందమైన నెక్లెస్‌లు, చెవి రింగులు & కంకణాలు రూపంలో ఈ అద్భుతమైన కలెక్షన్ ప్రారంభించింది.

  కాశ్యం కలెక్షన్‌


  ఈ కలెక్షన్ అసాధారణమైన ఎంపికను అందిస్తుంది. ఇక్కడ వినియోగదరులు అద్భుతమైన, వైభవమైన లగ్జరీ ప్రధాన చోకర్‌ సెట్‌ల నుండి పొడవైన, సొగసైన నెక్లెస్‌ సెట్‌ల నుండి సున్నితమైన & అందమైన నెక్లెస్‌ సెట్లు & గాజులను ఎంచుకోవచ్చు. వివిధ సందర్భాలు, బడ్జెట్‌లకు అనుకూలంగా విస్తృత శ్రేణిలో నగలు లభిస్తాయి. ఈ గోల్డ్‌ కలెక్షన్‌లో అనేక డిజైన్‌లలో అద్భుతమైన వారసత్వంతో, మీనాకారి ఆర్ట్‌తో టెంపుల్‌ స్టైల్‌ జువెలరీ, పురాతన ఎల్లో గోల్డ్‌ & యాంటిక్‌ ఫినిషింగ్‌లలో చాలా క్లిష్టమైన ఫిలిగ్రీ స్టైల్‌ నగలు మీకు లభిస్తాయి. మీ పండుగ తరుణం, వివాహ వేడుక, సమకాలీన సందర్భాలకు ఈ డైమండ్‌ సెట్స్‌ కచ్చితంగా సరిపోతాయి.

  ఈ కలెక్షన్‌ వీక్షణానికి:


  వివిధ బనారస్‌ వైభవాలతో రూపొందిన కాశ్యం కలెక్షన్లో చేరిన మరికొన్ని:
  బనారస్‌ చీరల కలెక్షన్: బనారస్‌ చీరలు భారతదేశంలోని చీరల్లో అత్యుత్తమమైనవి. బంగారు, వెండి బ్రోకేడ్‌ లేదా జరీ, చక్కటి పట్టు, సంపన్న ఎంబ్రాయిడరీకి ప్రసిద్ధి చెందాయి. బనారస్‌ చీరల కలెక్షన్ బనారస్‌ చీరల స్పూర్తితో డిజైన్‌ చేయబడి వైభవాన్ని ప్రదర్శిస్తున్నవి.

  REC సోలార్ ఎనర్జీ కంపెనీని కొనుగోలు చేసిన రిలయన్స్ ఇండస్ట్రీస్.. కొత్త తరం HJT టెక్నాలజీని సంస్థ ఎలా ఉపయోగించుకోనుంది?


  గులాబీ మీనకారి కలెక్షన్: ఇది భారతదేశంలోని అరుదైన హస్తకళలలో ఒకటి, ఇది గై ఘాట్‌ సమీపంలోని వారణాసి “బై-లేన్స్‌' లో సాధన చేయబడుతుంది. ఈ కళను 17వ శతాబ్దం ప్రారంభంలో మొఘల్‌ కాలంలో పెర్షియన్‌ ఎనామెలిస్టులు వారణాసి నగరానికి తీసుకువచ్చారు. 'మీనా' అనే పదం పెర్షియన్‌ పదం 'మినూ' స్త్రీ రూపం దీని అర్హం 'స్వర్గం'. ఇది స్వర్గం నీలి రంగును సూచిస్తుంది.

  కాశ్యం కలెక్షన్‌


  కాశీ విశ్వనాథ్‌ ఆలయ కలెక్షన్: ఈ ఆలయ సేకరణ శివుడికి అంకితమైన అత్యంత ప్రసిద్ధ హిందూ దేవాలయాలలో ఒకటి. మందిర నిర్మాణం మూడు భాగాలుగా ఉంటుంది. మొదటిది విశ్వనాథ్‌ లేదా మహాదేవ మందిరంపై శిఖరాన్ని తెలుపుతుంది. రెండవది బంగారు గోపురం, మూడవది బంగారు శిఖరం అగ్రశ్రేణి విశ్వనాథుడు జెండా, త్రిశూలం కలిగినది.

  ప్రాచీన గేట్‌వే కలెక్షన్: ప్రతి ఒక్కరికీ బనారస్‌ దృశ్యపరమైన ఆనందం అందిస్తాయి. మనోహరమైన పాత ఇరుకు దారులు కానివ్వండి లేదా స్వదేశీ గృహ నిర్మాణాలు లేదా అద్భుతంగా చెక్కబడిన దేవాలయాలు నగరం మొట్టమొదటి దృశ్యం అత్యంత స్వాగతించదగినదిగా ఉంటుంది. తామర మొగ్గలుగా చెక్కడంతో ఇవి దైవత్వానికి చిహ్నం సజీవంగా కనిపిస్తాయి.

  RIL 44th AGM: గ్లోబల్ సంస్థగా రిలయన్స్ ఆవిర్భావం..సరికొత్త ప్రపంచం వైపు అడుగులు: ముఖేష్ అంబానీ


  గంగా ఆర్తి & ఘాట్‌ కలెక్షన్: వారణాసిలోని ఘాట్లు గంగా నది ఒడ్డుకు వెళ్లే నదీతీరం మెట్లు. వారణాసిలో నగరంలో 88 ఘాట్లు ఉన్నాయి. చాలా ఘాట్లు స్నానం, పూజ వేడుక ఘాట్లు, రెండు ఘాట్లను ప్రత్యేకంగా దహన ప్రదేశాలుగా ఉపయోగిస్తారు.

  రాంనగర్‌ కోట కలెక్షన్: ప్రేమ అత్యంత ఉద్వేగభరితమైన వ్యక్తీకరణలలో దైవత్వం ఒకటి. అలాగే రాంనగర్‌ కోట అందం పట్ల ప్రేమను వ్యక్తపరుస్తుంది. మొఘల్‌ శైలిలో చెక్కబడిన ఈ రాజ భవనం జీవితంలోని ప్రతి అంశంలో అందం ఎలా ఉంటుందో చెప్పడానికి సజీవ సాక్ష్యం.

  జంతర్‌ మంతర్‌ కలెక్షన్: బనారస్‌ ఎన్నో గుప్త నిధుల ప్రదేశం. వాటిలో జంతర్‌ మాతర్‌ ఒకటి. దీనిని 1737లో మహారాజా జై సింగ్‌ నిర్మించారు, ఇది పవిత్ర నగరం వలె శాశ్వతమైన, దైవికమైన నిర్మాణ అద్భుతం. ఇది ప్రతి ఆధ్యాత్మిక, సాంస్కృతిక భావనల సమ్మేళనం.

  కొత్త కలెక్షన్ గురించి రిలయన్స్‌ జ్యువెల్స్‌ సి‌ఈ‌ఓ సునీల్‌ నాయక్‌ మాట్లాడుతూ "పండుగలు భారతీయ సంస్కుతిలో ఒక అంతర్భాగం. ధన్‌ తేరాస్, పుష్య నక్షత్రం, దీవావళి మన దేశంలో జరుపుకునే అతి ముఖ్మమైన పండుగలు. ధన్‌ తేరాస్ సమయంలో బంగారం కొనుగోలు చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అభరణాలలో మా డిజైన్ సొంప్రదాయాన్సి కొనసాగించడానికి బనారస్‌ స్ఫూర్తితో అద్భుతంగా సృష్టించబడిన మా అందమైన అభరణాల కలెక్షన్ "కాశ్యం” అందించడం మాకు సంతోషం కలిగిస్తున్నది. ఈ కలెక్షన్ ప్రతి బంగారు, వజ్రాల హరం & చేవిదుదులు ప్రత్యేకమైనవి. ఇవి బనారస్‌ విభిన్న కళలు సంప్రదాయం, వారసత్వ సంపదలకు ప్రాతినిద్యం వహిస్తాయి. ధన్‌ తేరాస్ పండుగ ముందుగా ఈ కలెక్షన్ మా కష్టమర్లకు అందించడం మరింత వ్రత్యేకమైనది. లగ్జరీ, వైభవం, స్వచ్ఛత, కళల ఔనత్యాన్ని ప్రతిబింబించే అత్యంత ఉత్కష్టమైన కళాత్మకమైన ఈ కలెక్షన్ మేము శుభప్రదమై ధన్ తెరస్ పండుగ ముందు అందిస్తూ ఆ అద్భుతమైన డిజైన్ల నగలతో తమ ప్రియమైన వారితో ఆనందం పంచుకుంటారని మేము ఆశిస్తున్నాం" అని అన్నారు.

  భారతదేశం అంతటా రిలయన్స్‌ జ్యువెల్స్‌ అవుట్‌లెట్లలో కాశ్యం కలెక్షన్ అందుబాటులో ఉంది. మీరు రిలయన్స్‌ జ్యువెల్స్‌ షోరూమ్‌లలో షాపింగ్‌ చేయవచ్చు ఇంకా గోల్డ్‌ జ్యువెలరీ మేకింగ్‌ & డైమండ్‌ జ్యువెలరీ వాల్యూపై 30% వరకు ప్రత్యేక ఆఫర్‌ను కూడా పొందవచ్చు. అన్ని ప్రదేశాలలో మా స్టోర్లు, దుకాణాలను సందర్శించే కుటుంబాలను సురక్షితంగా ఉంచడానికి మేము అన్ని భద్రతా మార్గదర్శకాలు, పరిశుభ్రత చర్యలను అమలు చేశాము.

  ఈ అద్భుతమైన కలెక్షన్ నుండి డిజైన్‌లను రిలయన్స్‌ జ్యువెల్స్‌ వెబ్‌సైట్‌ https://bit.ly/3A0D7RS లో ప్రత్యేకంగా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. వినియోగదారులు వారి ఇంటి నుండి వర్చువల్‌ ట్రై-ఆన్‌ ఎంపికను కూడా ఉపయోగించుకొనవచ్చు.

  రిలయన్స్ జ్యువెల్స్ గురించి:
  రిలయన్స్ జ్యువెల్స్ అనేది రిలయన్స్ రిటైల్ లిమిటెడ్‌లో ఒక భాగం, భారతదేశంలోని టాప్ 10 విశ్వసనీయ రిటైల్ బ్రాండిస్‌లో ఒకటి. ఈ బ్రాండ్ అద్భుతమైన, విస్తృత శ్రేణి గోల్డ్, డైమండ్, ప్లాటినం & సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్లను అందిస్తుంది. డిజైన్, హస్తకళలపై దృష్టి సారించి, కళలు గొప్ప భారతీయ వారసత్వం ద్వారా ప్రేరణ పొందిన రిలయన్స్ జ్యువెల్స్ తమ కస్టమర్‌లకు ప్రత్యేకమైన, ప్రత్యేకమైన డిజైనర్ సేకరణలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రిలయన్స్ జ్యువెల్స్ స్వచ్ఛమైన ప్రేమ, భావోద్వేగాల బంగారు తారాన్ని అలంకరించడం ద్వారా జీవితంలోని ప్రతి ప్రత్యేక క్షణాన్ని జరుపుకోవాలని విశ్వసిస్తుంది.

  రిలయన్స్ జ్యువెల్స్ భారతదేశంలో 100పైగా నగరాల్లో 200పైగా ఫ్లాగ్‌షిప్ షోరూమ్‌లు & షాప్-ఇన్ షాపులను కలిగి ఉంది, నిర్వహిస్తోంది, విస్తరిస్తోంది. బ్రాండ్ ఎల్లప్పుడూ ఆదర్శప్రాయమైన సేవలు, ఏకీకృత ఆభరణాల షాపింగ్ అనుభవాన్ని అందించడం ద్వారా కస్టమర్ ఆనందాన్ని అందిస్తుంది. రిలయన్స్ జ్యువెల్స్‌లో బంగారం, వజ్రాలు అత్యంత పోటీ ధరల్లో లభిస్తాయి. జీరో-వేస్టేజ్, మేకింగ్ ఛార్జీలు వినియోగదారులకు 100% సంతృప్తిని అందిస్తాయి. రిలయన్స్ జ్యువెల్స్ ప్రతి దానిలో 100 శాతం స్వచ్ఛత, పారదర్శక ధర, నాణ్యత హామీ ఇస్తుంది. ఈ బ్రాండ్ 100 శాతం బి‌ఐ‌ఎస్ హాల్‌మార్క్ చేసిన బంగారాన్ని మాత్రమే ఉపయోగిస్తుంది. ప్రతి వజ్రం స్వతంత్ర ధృవీకరణ ప్రయోగశాలల ద్వారా అంతర్జాతీయంగా ధృవీకరించబడింది. అన్ని రిలయన్స్ జ్యువెల్స్ షోరూమ్‌లలో క్యూ‌సి టెక్ రూమ్‌లు మరమ్మతులు చేయబడతాయి, కారాట్ మీటర్లు కస్టమర్ల కోసం ఎన్నో ఇతర సేవలతో పాటుగా బంగారం స్వచ్ఛతను ఉచితంగా అంచనా వేస్తాయి. బ్రాండ్ కూడా ప్రతి కొనుగోలుపై లయల్టీ పాయింట్లను అందిస్తుంది. ప్రతి సేకరణలో అద్భుతమైన విభిన్న డిజైన్లతో, రిలయన్స్ జ్యువెల్స్ ప్రతి సందర్భానికి ఒక ఆభరణాన్ని కలిగి ఉంటుంది.

  మీ సమీపంలోని రిలయన్స్ జ్యువెల్స్ షోరూం కోసం : https://bit.ly/RJStrs
  యూట్యూబ్ చానెల్ - https://bit.ly/3CFj3Y5
  Connect with us:
  facebook: https://www.facebook.com/RelianceJewels/
  Instagram: https://www.instagram.com/reliancejewels/
  Published by:Krishna Adithya
  First published: