Home /News /business /

RELIANCE JEWELS UNVEILS NEW SHOWROOM AT MADINAGUDA HYDERABAD KNOW INAGURAL OFFERS AND DISCOUNTS SS

Reliance Jewels: హైదరాబాద్‌లో మరో రిలయెన్స్ జ్యువెల్స్ స్టోర్... డిస్కౌంట్, క్యాష్‌బ్యాక్ ఆఫర్స్ ఇవే...

Reliance Jewels: హైదరాబాద్‌లో మరో రిలయెన్స్ జ్యువెల్స్ స్టోర్... డిస్కౌంట్, క్యాష్‌బ్యాక్ ఆఫర్స్ ఇవే...
(image: Reliance Jewels)

Reliance Jewels: హైదరాబాద్‌లో మరో రిలయెన్స్ జ్యువెల్స్ స్టోర్... డిస్కౌంట్, క్యాష్‌బ్యాక్ ఆఫర్స్ ఇవే... (image: Reliance Jewels)

Reliance Jewels | అక్టోబర్ 31 వరకు హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్, క్రెడిట్ కార్డులతో కొనేవారికి 10 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్‌లో కూడా నగలు సొంతం చేసుకోవచ్చు.

    దీపావళి సీజన్‌లో బంగారం కొనాలనుకుంటున్నారా? పెళ్లి కోసం ముందే నగలు తీసుకుందామనుకుంటున్నారా? అయితే మీకు శుభవార్త. హైదరాబాద్‌లో మరో రిలయెన్స్ జ్యువెల్స్ స్టోర్ ఏర్పాటైంది. మదీనాగూడలోని జీఎస్ఎం మాల్‌లోని నాలుగో అంతస్తులో కొత్త స్టోర్ ప్రారంభించింది రిలయెన్స్ జ్యువెల్స్. ప్రారంభోత్సవ ఆఫర్లను ప్రకటించింది. బంగారు నగల మేకింగ్ ఛార్జీల్లో 25 శాతం తగ్గింపు, డైమండ్ జ్యువెలరీపై 25 శాతం వరకు తగ్గింపు, మొదటి 100 మంది కస్టమర్లకు గోల్డ్ కాయిన్ ఉచితం లాంటి ఆఫర్లను ప్రకటించింది రిలయెన్స్ జ్యువెల్స్. దాంతో పాటు రూ.5 లక్షల కన్నా ఎక్కువ గోల్డ్, డైమండ్ జ్యువెలరీ కొనేవారు అదనంగా 5 శాతం తగ్గింపు పొందొచ్చు. అక్టోబర్ 31 వరకు హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్, క్రెడిట్ కార్డులతో కొనేవారికి 10 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్‌లో కూడా నగలు సొంతం చేసుకోవచ్చు. ఇందుకోసం ప్లాన్స్ ప్రకటించింది రిలయెన్స్ జ్యువెల్స్. ప్లాన్ పూర్తైన తర్వాత ఇన్‌స్టాల్‌మెంట్‌లో 350% బెనిఫిట్స్ పొందొచ్చు. కస్టమర్లు తమ పేమెంట్ వివరాలను వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

     Reliance Jewels, Reliance Jewels madinaguda, Reliance Jewels hyderabad, Reliance Jewels offers, Reliance Jewels discount, Reliance Jewels sale, రిలయెన్స్ జ్యువెల్స్, రిలయెన్స్ జ్యువెల్స్ మదీనాగూడ, రిలయెన్స్ జ్యువెల్స్ హైదరాబాద్, రిలయెన్స్ జ్యువెల్స్ ఆఫర్స్, రిలయెన్స్ జ్యువెల్స్ డిస్కౌంట్, రిలయెన్స్ జ్యువెల్స్ సేల్
    image: Reliance Jewels


    రాజస్తాన్ సంస్కృతీ సంప్రదాయాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రత్యేకంగా రూపొందించిన 'అతుల్య' కలెక్షన్ నగల్ని ఈ స్టోర్‌లో కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. రాజస్తాన్ ప్యాలెస్‌లు, బ్లాక్ ప్రింటింగ్ లాంటివన్నీ నగలపై అద్భుతంగా తీర్చిదిద్దడం విశేషం. ప్రతీ ఆభరణం భారతీయ వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. 22 క్యారట్ నగలతో పాటు 18 క్యారెట్ గోల్డ్, డైమెండ్ నగలు ఆకట్టుకుంటున్నాయి. రిలయెన్స్ జ్యువెల్స్ స్టోర్‌లో కాంప్లిమెంటరీ సర్వీసెస్‌లో భాగంగా మీ బంగారం నాణ్యత ఎంతో ఉచితంగా చెక్ చేసుకోవడంతో పాటు క్లీనింగ్ సర్వీసెస్ కూడా అందిస్తోంది. ప్రస్తుతం 96 పట్టణాల్లో 203 రిలయెన్స్ జ్యువెల్స్ స్టోర్స్ ఉన్నాయి.

    తక్కువ ధరతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది... రెడ్‌మీ 8 ఎలా ఉందో చూడండి



    ఇవి కూడా చదవండి:

    SBI ATM: ఛార్జీలు పడకుండా ఏటీఎంలో ఎన్నిసార్లైనా డబ్బులు డ్రా చేయండి ఇలా

    Aadhar Reprint: ఆధార్ కార్డు పోయిందా? ఈ స్టెప్స్ ఫాలో అవండి

    SBI Card: ఎస్‌బీఐ డెబిట్ కార్డ్ ఉన్నవారికి గుడ్ న్యూస్... డబ్బులు లేకపోయినా షాపింగ్ చేయొచ్చు ఇలా
    First published:

    Tags: Gold, Gold jewellery, Gold prices, Reliance

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు