HOME »NEWS »BUSINESS »reliance jewels launches new showroom in nizamabad offers free gold coin for first 100 customers ss

Reliance Jewels: తెలంగాణలో రిలయెన్స్ జ్యువెల్స్ కొత్త షోరూమ్... 100 గోల్డ్ కాయిన్స్ ఫ్రీ

Reliance Jewels: తెలంగాణలో రిలయెన్స్ జ్యువెల్స్ కొత్త షోరూమ్... 100 గోల్డ్ కాయిన్స్ ఫ్రీ
Reliance Jewels: (ప్రతీకాత్మక చిత్రం)

Reliance Jewels | తెలంగాణలో మరో షోరూమ్ ఏర్పాటు చేసింది రిలయెన్స్ జ్యువెల్స్. ప్రారంభోత్సవంలో భాగంగా కస్టమర్లకు ఆఫర్స్ ప్రకటించింది.

  • Share this:
    రిలయెన్స్ జ్యువెల్స్ తన నగల వ్యాపారాన్ని విస్తరిస్తోంది. తెలంగాణలో మరో షోరూమ్‌ను ప్రారంభించింది. నిజామాబాద్‌లో ద్వారకా రోడ్‌లో కొత్త షోరూమ్‌ను ఏర్పాటు చేసింది. కస్టమర్ల కోసం ప్రారంభోత్సవ ఆఫర్లను ప్రకటించింది. బంగారు ఆభరణాల మజూరీ ఛార్జీలలో 20% వరకు తగ్గింపు, వజ్రాల ఆభరణాలపై 20% వరకు తగ్గింపు, మొదటి 100 మంది కస్టమర్లకు బంగారు నాణేలను ఉచితంగా అందిస్తోంది రిలయెన్స్ జ్యువెల్స్. రూ.2 లక్షల కన్నా ఎక్కువ బంగారు ఆభరణాలు కొంటే మజూరీపై, వజ్రాల నగలపై అదనంగా 5% తగ్గింపు పొందొచ్చు. ఈ ఆఫర్లు 2020 ఫిబ్రవరి 16 వరకే ఉంటాయి. ఈ ఆఫర్లు పొందాలనుకునేవారికి నియమనిబంధనలు వర్తిస్తాయి.

    నిజామాబాద్‌లో రిలయెన్స్ జ్యువెల్స్ ఏర్పాటు చేసిన షోరూమ్‌లో సంప్రదాయ ఆభరణాలతో పాటు సమకాలీన బంగారు, వజ్రాల నగలు ఉన్నాయి. అన్‌కట్, పోల్కి, జడావు, ఆంటిక్, మీనాక్షి లాంటి స్టైల్స్‌లో నగలను కస్టమర్ల కోసం ప్రదర్శిస్తోంది రిలయెన్స్ జ్యువెల్స్. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కస్టమర్లకు అద్భుతమైన షాపింగ్ ఎక్స్‌పీరియెన్స్ సొంతం అవుతుంది. ఖాతాదారుల కోసం గోల్డెన్ స్టెప్స్ ఆఫర్‌ను కూడా ప్రారంభిస్తోంది రిలయెన్స్ జ్యూవెల్స్. ఖాతాదారులు ప్రతీ నెల వాయిదాలు చెల్లించి, స్కీమ్ ముగిసిన తర్వాత నగలు కొనుగోలు చేయొచ్చు. నెలవారీ వాయిదాలను డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఈసీఎస్ ద్వారా చెల్లించొచ్చు. ఇక వీటితో పాటు బంగారం స్వచ్ఛతను పరీక్షించడం, ఆభరణాలను శుభ్రపర్చడం లాంటి సేవల్ని కస్టమర్లకు ఉచితంగా అందిస్తోంది రిలయెన్స్ జ్యువెల్స్.



    ఇవి కూడా చదవండి:

    Realme PaySa: ఐదు నిమిషాల్లో రూ.1,00,000 వరకు అప్పు... 'రియల్‌మీ పేసా' ఆఫర్

    Kakeibo: కాకీబో... ఈ జపనీస్ టెక్నిక్ తెలిస్తే లక్షాధికారి కావొచ్చు

    Gold: బంగారు నగలు కొనేవారు ఈ టిప్స్ ఫాలో అవండి
    Published by:Santhosh Kumar S
    First published:February 10, 2020, 16:57 IST