Home /News /business /

RELIANCE JEWELS LAUNCHES NEW SHOWROOM IN GUNTUR KNOW OFFERS AND DISCOUNTS SS

Reliance Jewels: రిల‌య‌న్స్ జ్యుయెల్స్‌ కొత్త స్టోర్ ప్రారంభం... క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్ ఆఫర్లివే

Reliance Jewels: రిల‌య‌న్స్ జ్యుయెల్స్‌ కొత్త స్టోర్ ప్రారంభం... క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్ ఆఫర్లివే
(ప్రతీకాత్మక చిత్రం, image: Reliance Jewels)

Reliance Jewels: రిల‌య‌న్స్ జ్యుయెల్స్‌ కొత్త స్టోర్ ప్రారంభం... క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్ ఆఫర్లివే (ప్రతీకాత్మక చిత్రం, image: Reliance Jewels)

Reliance Jewels | రాజస్తాన్ సంస్కృతీ సంప్రదాయాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రత్యేకంగా రూపొందించిన 'అతుల్య' కలెక్షన్ నగల్ని ఈ స్టోర్‌లో కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

    బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త. గుంటూరులో రిలయెన్స్ జ్యుయెల్స్ ప్రధాన స్టోర్ ప్రారంభమైంది. కస్టమర్లకు 'అతుల్య' కలెక్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది రిలయెన్స్ జ్యుయెల్స్. దీపావళి, ధంతేరాస్‌ను దృష్టిలో పెట్టుకొని ఆఫర్లను ప్రకటించింది రిలయెన్స్ జ్యుయెల్స్. బంగారు ఆభరణాల, వజ్రాల నగల తయారీపై 25% వరకు తగ్గింపు లభిస్తుంది. మొదటి వంద మంది కస్టమర్లకు ఉచిత బంగారు నాణెం సొంతం చేసుకోవచ్చు. రూ.5 లక్షల కన్నా ఎక్కువ కొన్నవారికి వజ్రాల ఆభరణాల తయారీపై 5% వరకు అదనంగా తగ్గింపు లభిస్తుంది. దీంతోపాటు హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనే కస్టమర్లకు 10% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ ఆఫర్లన్నీ అక్టోబర్ 23 నుంచి 31 వరకే. షరతులు వర్తిస్తాయి. ఇక రాజస్తాన్ సంస్కృతీ సంప్రదాయాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రత్యేకంగా రూపొందించిన 'అతుల్య' కలెక్షన్ నగల్ని ఈ స్టోర్‌లో కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. రాజస్తాన్ ప్యాలెస్‌లు, బ్లాక్ ప్రింటింగ్ లాంటివన్నీ నగలపై అద్భుతంగా తీర్చిదిద్దడం విశేషం. ప్రతీ ఆభరణం భారతీయ సంస్కృతిని, వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. 22 క్యారెట్ నగలతో పాటు 18 క్యారెట్ గోల్డ్, డైమెండ్ నగలు ఆకట్టుకుంటున్నాయి. మెడ‌లో వేసుకునే ఆక‌ర్ష‌ణీయ‌మైన గొలుసు (చోక‌ర్‌), చిన్న‌, పెద్ద శ్రేణిలోని నెక్లెస్‌లు ఈ పండుగ సీజ‌న్‌లో ఆకట్టుకోనున్నాయి.

    Reliance Jewels launches new shoroom in Guntur Know offers and discounts
    గుంటూరులో ప్రారంభమైన రిలయెన్స్ జ్యుయెల్స్ స్టోర్
    (image: Reliance Jewels)


    పెద్ద ఎత్తున విస్త‌ర‌ణ ప్ర‌ణాళిక‌ల‌తో ముందుకు సాగుతున్న రిల‌య‌న్స్ జ్యుయెల్స్... త‌న వినియోగ‌దారుల‌కు విస్తృత శ్రేణిలో ఆభ‌ర‌ణాలు అందించ‌డ‌మే కాకుండా వాటికి సంబంధించిన పూర్తి సేవ‌ల‌ను అందించనుంది. కొత్త షోరూంలో అందుబాటులో ఉండే అధునాత‌న టెక్నాల‌జీ స‌హాయంతో వినియోగ‌దారుల‌కు ఉత్త‌మ సేవ‌ల‌ను అందించడం వ‌ల్ల‌ స‌మ‌గ్ర‌ షాపింగ్ అనుభూతిని కలిగిస్తుంది. ప్ర‌స్తుతం రిల‌య‌న్స్ జ్యుయెల్స్ షాప్ ఇన్ షాప్ (ఎస్ఐఎస్‌) విభాగంలోని వాటిని క‌లుపుకొని 99 న‌గ‌రాల్లో 200 పైగా స్టోర్ల‌తో వినియోగ‌దారుల‌కు మెరుగైన సేవ‌లు అందిస్తోంది.

    అదరగొట్టే లుక్స్‌తో 'బజాజ్ ఎలక్ట్రిక్ చెతక్'... ఎలా ఉందో చూడండి



    ఇవి కూడా చదవండి:

    Dhanteras 2019: ధంతేరాస్‌కు నగలు కొనేవారు ఈ టిప్స్ ఫాలో అవండి

    Gold Bond: మార్కెట్ రేట్ కన్నా తక్కువ ధరకే బంగారం... కొనండి ఇలా

    LIC: మీ ఎల్ఐసీ పాలసీకి బోనస్ వచ్చిందా? ఎస్ఎంఎస్‌తో తెలుసుకోవచ్చు
    First published:

    Tags: Dhanteras gold, Gold, Gold jewellery, Gold ornmanets, Gold prices, Gold rates, Reliance

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు