RELIANCE JEWELS LAUNCHES BELLA COLLECTION WITH A DASH OF COLOUR FOR THE WOMEN DETAILS HERE VB
Reliance Jewels-Bella Collection: ఈనాటి మహిళల కొరకు రిలయన్స్ జ్యువెల్స్ ‘బెల్లా కలెక్షన్’.. ఇక ప్రతీ రోజు ప్రత్యేకమే..
ప్రతీకాత్మక చిత్రం
భారతదేశపు ప్రముఖ ఆభరణాల బ్రాండ్ అయిన రిలయన్స్ జ్యువెల్స్(Reliance Jewels) కొత్తగా బెల్లా కలెక్షన్ ను(Bella Collection) ప్రారంభించింది. ఈ ప్రత్యేక కలెక్షన్(Collection) ఈ సహస్రాబ్ధి మరియు జెన్జడ్ మహిళలకు ప్రతిరోజును ప్రత్యేకంగా చేయడము లక్ష్యంగా కలిగి ఉంది.
భారతదేశపు ప్రముఖ ఆభరణాల బ్రాండ్ అయిన రిలయన్స్ జ్యువెల్స్(Reliance Jewels) కొత్తగా బెల్లా కలెక్షన్ ను(Bella Collection) ప్రారంభించింది. ఈ ప్రత్యేక కలెక్షన్(Collection) ఈ సహస్రాబ్ధి మరియు జెన్జడ్ మహిళలకు ప్రతిరోజును ప్రత్యేకంగా చేయడము లక్ష్యంగా కలిగి ఉంది. సున్నితంగా మరియు ఆధునికంగా ఉండే డిజైన్లతో(Designs) ఈ అద్భుతమైన రోజ్ గోల్డ్ మరియు అసలు కంటే కొంచం తక్కువ-విలువైన రంగు రాళ్ళ ఆభరణాల ప్రారంభముతో రిలయన్స్ జ్యువెల్స్(Reliance Jewels) ఆధునిక మహిళల కొరకు సంబరాలను జరుపుతోంది. బెల్లా ఒక ధోరణి! ఒక వాక్యము! ఇది ఇతరుల కంటే భిన్నంగా ఉంచుతుంది. ఈ ప్రత్యేక కలెక్షన్ డాష్ ఆఫ్ కలర్ ను చేర్చుటకు మరియు ప్రతిరోజును ప్రత్యేకంగా చేయుటకు రూపొందించబడింది. బెల్లా కలెక్షన్(Bella Collections) లోని ఆభరణాలు(Jewellery) సున్నితంగా మరియు కాలానుగుణంగా ఉంటాయి. దీనితో ఇవి ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు లేదా సాధారణ విందులకు కూడా బాగుంటాయి.
ఈ లారియట్ శైలి నెక్వేర్ మరియు సన్నని, తేలిక బరువు కలిగిన చెవిదుద్దులను రోజూ ధరించే భారీ డిజైన్ ఆభరణాలకు ప్రత్యామ్నాయంగా కోరుకుంటున్నారు. సున్నితమైన డిజైన్ల జటిలమైన సమ్మేళనమైన ఈ అందమైన కలెక్షన్, అనుకోని విందు ప్రణాళికల నుండి స్నేహితులతో షాపింగ్ వరకు మీ దైనందిన పనులకు, చిన్న చిన్న విహార యాత్రల నుండి ఆదివారపు బ్రంచెస్ వరకు, ఇంట్లో చిన్న చిన్న వేడుకల నుండి వారాంతపు పార్టీలు లేదా విందు డేట్స్ వరకు అన్నిటికి ఉత్తమమైనది.
ఏక మరియు అనేక పొరల నెక్లేసులు, బ్రేస్లెట్లు మరియు చెవిదుద్దుల కొత్త డిజైన్లు 14KT రోజ్ గోల్డ్ లో అందుబాటులో ఉన్నాయి మరియు వీటిల్లో ఈనాటి మహిళలకు ఉత్తమమైనవిగా చేసే ముత్యాలతో పెరీడాట్ ఆకుపచ్చ మరియు అమెథిస్ట్ పర్పుల్ రంగుల అసలు కంటే కొంచం తక్కువ-విలువైన రంగు రాళ్ళు ఉన్నాయి. ఈ డిజైన్లు తక్కువ అకంకరణలతో మరియు సున్నితమైన మరియు త్రిమితీయ ఆకారాలతో రూపొందించబడ్డాయి. ఈ డిజైన్లు రత్నాలను సురక్షితంగా పట్టుకొని ఉండే విధంగా ప్రత్యేకంగా బెజెల్ లో ఏర్పాటు చేయబడ్డాయి. ఈ కలెక్షన్ ధరలు రూ. 5,500/- నుండి ప్రారంభం కావడం వలన అందరికి అందుబాటులో ఉంటాయి.
రిలయన్స్ జ్యువెల్స్ ద్వారా బెల్లా ఫిల్మ్ ఈ కలెక్షన్ సంబరాలను జరుపుకుంటోంది మరియు కొత్త డిజైన్లు ఈనాటి యువతకు మరియు ఆధునిక మహిళలకు భావగీతాలుగా ఉన్నాయి. ఈ ఫిల్మ్ యొక్క లింక్: https://youtu.be/dsvHwbtPdHA
దేశవ్యాప్తంగా 150+ నగరాలలోని 300+ రిలయన్స్ జ్యువెల్స్ షోరూమ్స్ & ఎస్ఐఎస్ లలో ఉన్న అద్భుతమైన సేకరణల నుండి వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు, మరియు ఈ సేకరణ రిలయన్స్ జ్యువెల్స్ వెబ్సైట్ https://bit.ly/PR_Bella పై కూడా అందుబాటులో ఉన్నాయి.
కొత్త కలెక్షన్ గురించి మాట్లాడుతూ, రిలయన్స్ జ్యువెల్స్ సీఈఓ శ్రీ సునీల్ నాయక్, ఇలా అన్నారు, “మా ప్రత్యేక బెల్లా కలెక్షన్ లో సమకాలీన డిజైన్ల కొత్త చేరికతో రిలయన్స్ జ్యువెల్స్ లో పనిచేసే మేమంతా ఎంతో పులకరించిపోతున్నాము. ఈ కలెక్షన్ లోని ప్రతి ఒక్క డిజైన్ ఈనాటి యువతులు ఆశించే పొందిక మరియు శైలిని ప్రదర్శించే విధంగా రూపొందించబడింది. ఈసారి డాష్ ఆఫ్ కలర్ తో వారికి ప్రతి రోజు ప్రత్యేకమైనదిగా చేయడమే లక్ష్యంగా ఈ కలెక్షన్ తయారు చేయబడింది. సున్నితమైన మరియు ఫ్యాషన్ గా ఉన్న ఈ డిజైన్లు ప్రతిరోజు ఆఫీస్ లుక్స్, బ్రంచెస్, పార్టీలు మరియు ఫ్యాషన్ కోరుకునే మహిళల సాధారణ లుక్స్ కొరకు ఉత్తమమైనవి. ఎప్పటికప్పుడు మా వినియోగదారులు రిలయన్స్ జ్యువెల్స్ కు వచ్చినప్పుడు వారి ఎంపికలను అన్నిటిని అందించాలనేది మా ప్రయత్నము.”
రిలయన్స్ జ్యువెల్స్ గురించి..
రిలయన్స్ జ్యువెల్స్ భారతదేశపు అగ్రగామి రీటెయిలర్ అయిన రిలయన్స్ రీటెయిల్ లో ఒక భాగము. ఈ బ్రాండ్ బంగారము, వజ్రాలు & వెండి ఆభరణాల కలెక్షన్ యొక్క ఆకర్షణీయమైన మరియు విస్తృతమైన శ్రేణిని అందిస్తుంది. డిజైన్ మరియు హస్తకళపై దృష్టితో, ఈ బ్రాండ్ మా వినియోగదారులకు కళలు, హస్తకళ మరియు భారతీయ సంస్కృతిచే ప్రేరేపితమైన ప్రత్యేకమైన మరియు అసమానమైన డిజైనర్ కలెక్షన్ ను అందించడము లక్ష్యంగా కలిగి ఉంది తన వినియోగదారులు జీవితములో ప్రతి ఒక్క ప్రత్యేక క్షణాన్ని సంబరంగా జరుపుకోవాలని రిలయన్స్ జ్యువెల్స్ విశ్వసిస్తుంది.
రిలయన్స్ జ్యువెల్స్ కు 150+ నగరాలలో 300+ ఫ్లాగ్షిప్ షోరూమ్స్ & షాప్-ఇన్ షాప్స్ ఉన్నాయి మరియు విశేషంగా అభివృద్ధి చెందుతోంది. ఆదర్శప్రాయమైన సేవలు మరియు ఏకీకృతమైన ఆభరణాల షాపింగ్ అనుభవాన్ని అందిస్తూ ఈ బ్రాండ్ ఎప్పుడు వినియోగదారుల ఆనందాన్ని నిర్ధారిస్తుంది. రిలయన్స్ జ్యువెల్స్ వద్ద, బంగారము మరియు వజ్రాలు అత్యంత పోటీ ధరలకు అందుబాటులో ఉన్నాయి. సున్నా-తరుగు మరియు పోటీతత్వ మజూరి వినియోగదారులకు 100% సంతృప్తిని అందిస్తాయి. రిలయన్స్ జ్యువెల్స్ ప్రతి ఆభరణములో 100 శాతము స్వచ్ఛత, పారదర్శకమైన ధరలు మరియు హామీ ఉన్న నాణ్యతను అందిస్తుంది.
ఈ బ్రాండ్ 100 శాతము బిఐఎస్ హాల్ మార్క్డ్ బంగారము మాత్రమే అందిస్తుంది మరియు ఉపయోగించబడే ప్రతి వజ్రము స్వతంత్ర ధృవీకరణ ప్రయోగశాలలచే ధృవీకరించబడి ఉంటుంది. అన్ని రిలయన్స్ జ్యువెల్స్ షోరూమ్స్ కు మరమ్మత్తుల కొరకు క్యూసీ టెక్ గదులు, బంగారము యొక్క స్వచ్ఛతను అంచనా వేయుటకు వినియోగదారులకు కారట్ మీటర్లు ఉచితంగా అందుబాటులో ఉంటాయి. ఇంతే కాకుండా ఈ బ్రాండ్ ప్రతి కొనుగోలుపై లాయల్టీ పాయింట్స్ అందిస్తుంది.
ప్రతి కలెక్షన్ లో అద్భుతమైన రకాలు కలిగిన డిజైన్లతో రిలయన్స్ జ్యువెల్స్ లో ప్రతి ఒక్క వ్యక్తిత్వానికి మరియు ప్రతి సందర్భానికి ఒక ఆభరణము ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.