Reliance Jewels: రిలయెన్స్ జ్యువెల్స్‌లో 'ఆభర్' కలెక్షన్... మేకింగ్ ఛార్జీలపై 30% డిస్కౌంట్

Reliance jewels special anniversary offer | బంగారు నగలు కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. రిలయెన్స్ జ్యువెల్స్ స్పెషల్ యానివర్సరీ ఆఫర్ ప్రకటించింది. వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: August 13, 2020, 3:53 PM IST
Reliance Jewels: రిలయెన్స్ జ్యువెల్స్‌లో 'ఆభర్' కలెక్షన్... మేకింగ్ ఛార్జీలపై 30% డిస్కౌంట్
Reliance Jewels: రిలయెన్స్ జ్యువెల్స్‌లో 'ఆభర్' కలెక్షన్... మేకింగ్ ఛార్జీలపై 30% డిస్కౌంట్
  • Share this:
రిలయెన్స్ జ్యూవెల్స్ సరికొత్త కలెక్షన్‌ను లాంఛ్ చేసింది. యానివర్సరీ సందర్భంగా 'ఆభర్' కలెక్షన్‌ను పరిచయం చేసింది. కొత్త ఆశలతో కొత్త ప్రారంభం, ఆశా కిరణానికి గుర్తుగా లాంతర్‌ను స్ఫూర్తిగా తీసుకొని 'ఆభర్' కలెక్షన్‌ను రూపొందించడం విశేషం. 'ఆభర్' కలెక్షన్‌లో బంగారం, వజ్రాలతో 54 వినూత్నమైన డిజైన్స్‌తో ఇయర్ రింగ్స్ ఉన్నాయి. డాంగ్లర్స్, ఫ్రింజెస్, టాప్ అండ్ డ్రాప్స్, షాండిలియర్స్, ఝుంకీ, స్టడ్స్, నీడిల్స్, చాంద్‌బలీ లాంటి వెరైటీస్ ఉన్నాయి. వీటి బరువు 3 గ్రాముల నుంచి 15 గ్రాముల మధ్య వీటిని తయారుచేశారు. #WeOweYou అనే థీమ్‌తో ఈ కలక్షన్‌ను ప్రమోట్ చేస్తోంది రిలయెన్స్ జ్యువెల్స్. కొన్నేళ్లుగా రిలయెన్స్ జ్యూవెల్స్ బ్రాండ్‌పై నమ్మకాన్ని, విశ్వాసాన్ని చూపిస్తున్న కస్టమర్లకు కృతజ్ఞతను చాటేలా ఈ ప్రమోషన్ క్యాంపైన్‌ను స్కేర్‌క్రో ఎం అండ్ సీ సాట్చి డిజైన్ చేయడం విశేషం.

'ఆభర్' కలెక్షన్‌, #WeOweYou క్యాంపైన్ ద్వారా రిలయెన్స్ జ్యువెల్స్ యానివర్సరీని జరుపుకుంటోంది. ఈ క్యాంపైన్‌కు సంబంధించిన 4 నిమిషాల అడ్వర్టైజ్‌మెంట్ కూడా ఆకట్టుకుంటోంది. స్పెషల్ యానివర్సరీ ఆఫర్ కూడా ప్రకటించింది రిలయెన్స్ జ్యువెల్స్. బంగారు నగల తయారీపై 30%, డైమండ్ వ్యాల్యూపై 30% తగ్గింపు ప్రకటించింది. ఈ ఆఫర్ 2020 ఆగస్ట్ 31 వరకు మాత్రమే. ఇక కరోనా వైరస్ భయాలు ఉండటంతో ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా ప్రభుత్వం సూచించిన ప్రమాణాలు పాటిస్తూ షోరూమ్‌లను నిర్వహిస్తోంది రిలయెన్స్ జ్యువెల్స్. కస్టమర్లు షాపులోకి వచ్చిన దగ్గర్నుంచి తిరిగి వెళ్లేంత వరకు వారి భద్రతకు ప్రాధాన్యం ఇస్తోంది. సోషల్ డిస్టెన్సింగ్ నియమ నిబంధనలు, భద్రతా ప్రమాణాలు పాటించేలా షోరూమ్ సిబ్బందికి శిక్షణ ఇచ్చింది.
Published by: Santhosh Kumar S
First published: August 13, 2020, 3:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading