Home /News /business /

RELIANCE INDUSTRIES TO RESTRUCTURE AND REPURPOSE GASIFICATION ASSETS JNK GH

Reliance: గ్యాసిఫికేషన్ ఆస్తుల పునర్నిర్మాణంపై రిలయన్స్ ఇండస్ట్రీస్ దృష్టి.. భవిష్యత్తు అవసరాల కోసం RIL కొత్త ప్రణాళికలు

గ్యాసిఫికేషన్ ఆస్తుల పునర్నిర్మాణంపై రిలయన్స్ దృష్టి (ప్రతీకాత్మక చిత్రం)

గ్యాసిఫికేషన్ ఆస్తుల పునర్నిర్మాణంపై రిలయన్స్ దృష్టి (ప్రతీకాత్మక చిత్రం)

Reliance Industries Limited: ఎనర్జీ అవసరాలను తీర్చడానికి సింగ్యాస్ (Syngas) లేదా సింథటిక్ గ్యాస్‌ను ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో గుజరాత్‌లోని జామ్‌నగర్ వద్ద గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్‌ను ఆర్‌ఐఎల్ ఏర్పాటు చేసింది. దీనివల్ల తక్కువ నిర్వహణ ఖర్చులతో ఒలేఫిన్స్ (olefins) ఉత్పత్తి సాధ్యమైంది.

ఇంకా చదవండి ...
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) మరో నిర్ణయంతో వార్తల్లో నిలుస్తోంది. సంస్థకు చెందిన గ్యాసిఫికేషన్ అండర్‌టేకింగ్‌ను పూర్తి-యాజమాన్యంలోని అనుబంధ సంస్థగా (Wholly-Owned Subsidiary- WOS) బదిలీ చేయాలని నిర్ణయించింది. ఇందుకు ఒక స్కీమ్ ఆఫ్ అరేంజ్‌మెంట్ అమలు చేయాలని ఆర్‌ఐఎల్ బోర్డు నిర్ణయించింది. గతంలో ఇంధనంగా (Fuel) పని చేసిన రిఫైనరీ ఆఫ్-గ్యాస్‌లను.. రిఫైనరీ ఆఫ్ గ్యాస్ క్రాకర్ (ROGC) కోసం ఫీడ్‌స్టాక్‌గా వినియోగిస్తున్నారు. దీంతో ఎనర్జీ అవసరాలను తీర్చడానికి సింగ్యాస్ (Syngas) లేదా సింథటిక్ గ్యాస్‌ను ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో గుజరాత్‌లోని జామ్‌నగర్ వద్ద గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్‌ను ఆర్‌ఐఎల్ ఏర్పాటు చేసింది. దీనివల్ల తక్కువ నిర్వహణ ఖర్చులతో ఒలేఫిన్స్ (olefins) ఉత్పత్తి సాధ్యమైంది. ఫలితంగా ఇంధనంగా వాడే సింథటిక్ గ్యాస్ సరఫరా విశ్వసనీయత పెరగడంతో పాటు ఎనర్జీ కాస్ట్‌ అస్థిరత తగ్గింది. జామ్‌నగర్ రిఫైనరీలో వినియోగం కోసం హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడానికి సింథటిక్ గ్యాస్‌ను కూడా ఉపయోగిస్తారు.

పూర్తిగా రీ-సైక్లింగ్ చేయగల, స్థిరమైన నెట్-జీరీ కార్బన్ తో కూడిన పోర్ట్‌ఫోలియోపై RIL దృష్టి పెట్టింది. ఎనర్జీ అవసరాలను తీర్చడానికి పునరుత్పాదకత, అధిక విలువ కలిగిన పదార్థాలు, రసాయనాలకు మారడం ద్వారా ఇది సాధ్యమవుతుందని సంస్థ భావిస్తోంది. RIL క్రమంగా పునరుత్పాదక శక్తిని ప్రాథమిక వనరుగా మార్చుకుంటోంది. దీంతో C1 రసాయనాలు, హైడ్రోజన్‌ సహా అధిక విలువ కలిగిన రసాయనాల కోసం అప్‌గ్రేడేషన్ అయితే మరిన్ని సింథటిక్ గ్యాస్‌లు అందుబాటులోకి వస్తాయి. హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసే ప్రక్రియలో విడుదలయ్యే అధిక సాంద్రత గల కార్బన్-డై-ఆక్సైడ్‌ను సులభంగా సంగ్రహించవచ్చు. దీనివల్ల కార్బన్ క్యాప్చర్ ధర గణనీయంగా తగ్గుతుంది. మొత్తంమీద ఈ చర్యలు జామ్‌నగర్ కాంప్లెక్స్ కార్బన్ ఫుట్‌ప్రింట్‌ను తగ్గించడంలో సహాయపడతాయని సంస్థ వెల్లడించింది.

Free Insurance: మీకు డెబిట్, క్రెడిట్ కార్డ్ ఉందా? ఉచితంగా ఇన్స్యూరెన్స్ పొందొచ్చు ఇలా



 భారతదేశంలో భవిష్యత్తులో ఈ అధిక విలువ కలిగిన రసాయనాల లోటు ఏర్పడే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. గ్యాసిఫికేషన్ ఆస్తులను పునర్నిర్మించడం ద్వారా ఫీడ్‌స్టాక్ కోసం సింథటిక్ గ్యాస్‌ను ఉపయోగిస్తూ ఈ రసాయనాలను ఉత్పత్తి చేయడానికి, పెరుగుతున్న దేశీయ డిమాండ్‌ను తీర్చడానికి వీలవుతుంది. ఫలితంగా మంచి వ్యాపార అవకాశం లభిస్తుంది. దీంతోపాటు హైడ్రోజన్ ఎకానమీ విస్తరిస్తున్నప్పుడు, హైడ్రోజన్ ఎకో సిస్టమ్‌ను స్థాపించే మొదటి సంస్థగా RIL ఎదుగుతుంది.


సింగ్యాస్ అప్లికేషన్‌లతో గ్యాసిఫైయర్ ఆస్తుల రిస్క్, రిటర్న్ స్వభావం అనేది కంపెనీకి చెందిన ఇతర వ్యాపారాలకు భిన్నంగా ఉండవచ్చు. ఈ బిజినెస్ ప్రొఫైల్ గ్యాసిఫికేషన్ ఆస్తులు, కొత్త మెటీరియల్స్, కెమికల్స్ ప్రాజెక్ట్‌ల కోసం విభిన్న పెట్టుబడిదారులను, వ్యూహాత్మక భాగస్వాములను ఆకర్షించే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో రిలయన్స్ బోర్డు గ్యాసిఫికేషన్ అండర్‌టేకింగ్‌ను స్లంప్ సేల్ ప్రాతిపదికన ఆమోదించింది. ఈ స్కీమ్ అపాయింటెడ్ తేదీ మార్చి 31, 2022 లేదా బోర్డు నిర్ణయించిన ఇతర తేదీగా ఉండవచ్చు. ఈ పథకానికి స్టాక్ ఎక్స్ఛేంజ్‌లు, రుణదాతలు, వాటాదారులు, NCLT, ఇతర నియంత్రణ అధికారుల ఆమోదం అవసరం.
Published by:John Kora
First published:

Tags: Reliance, Reliance Industries, RIL

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు