హోమ్ /వార్తలు /బిజినెస్ /

జియో దూకుడు... రిలయన్స్ మూడో త్రైమాసికం ఫలితాలు వెల్లడి

జియో దూకుడు... రిలయన్స్ మూడో త్రైమాసికం ఫలితాలు వెల్లడి

రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ (File Photo)

రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ (File Photo)

రిలయన్స్ ఇండస్ట్రీస్ మూడో త్రైమాసిక ఫలితాలపై స్పందించిన సంస్థ అధినేత ముఖేష్ అంబానీ... ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతికూల ఆర్థిక పరిస్థితులు ఈ ఫలితాల్లో ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ మూడో త్రైమాసికం ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సవం మూడో త్రైమాసికంలో సంస్థ 13.5 శాతం వృద్ధితో రూ. 11,640 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అయితే ఈ త్రైమాసికంలో కంపెనీ యొక్క స్థూలమైన ఆదాయంలో మాత్రం క్షీణత నమోదైంది. 1.40 శాతం తగ్గుదలతో రూ. 1.68 లక్షల కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ 1,71 లక్షల కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 28.2 శాతం వృద్ధిని నమోదు చేసిన జియో రూ. 16,517 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి జియో వినియోదారుల సంఖ్య 37 కోట్లకు చేరింది. గతేడాదితో పోలిస్తే ఈ అంశంలో జియో 32.1 శాతం వృద్దిని నమోదు చేయడం విశేషం. కంపెనీ సాధించిన ఫలితాలపై స్పందించిన సంస్థ అధినేత ముఖేష్ అంబానీ... ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల ఆర్థిక పరిస్థితులు ఈ ఫలితాల్లో ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు. దేశ ప్రజలకు నాణ్యమైన డిజిటల్ సేవలను అందించడంపై జియో దృష్టి పెట్టిందని ఆయన తెలిపారు.

First published:

Tags: Jio, Mukesh Ambani, Reliance Industries

ఉత్తమ కథలు