• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • RELIANCE INDUSTRIES RIGHTS ENTITLEMENT SHARES TRADING AT PREMIUM ON DAY ONE SS

Reliance: మొదటి రోజు ప్రీమియంలో ట్రేడ్ అవుతున్న రిలయెన్స్ రైట్స్ ఎన్‌టైటిల్మెంట్

Reliance: మొదటి రోజు ప్రీమియంలో ట్రేడ్ అవుతున్న రిలయెన్స్ రైట్స్ ఎన్‌టైటిల్మెంట్

Reliance(ప్రతీకాత్మక చిత్రం)

Reliance Industries Limited Rights Entitlements | రైట్స్ ఎన్‌టైటిల్మెంట్స్ ప్లాట్‌ఫామ్‌ అంటే రైట్స్ హోల్డర్లు తమ ఎన్‌టైటిల్మెంట్‌ను ఎక్స్‌ఛేంజ్‌లల్లో ప్రత్యేక ప్లాట్‌ఫామ్స్‌లో ట్రేడ్ చేసుకోవచ్చు.

  • Share this:
    రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్-RIL రూ.53,125 కోట్ల రైట్స్ ఇష్యూను తెరిచింది. స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లల్లో కొత్తగా ప్రారంభించిన ప్లాట్‌ఫామ్స్‌లో రైట్స్ ఎన్‌టైటిల్మెంట్స్ ఏకకాలంలో ట్రేడ్ అవుతున్నాయి. రైట్స్ ఎన్‌టైటిల్మెంట్స్ షేర్ రూ.193 దగ్గర ట్రేడ్ అవుతోంది. మధ్యాహ్నం 1.28 గంటలకు రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్ ధర రూ.1429 దగ్గర ట్రేడ్ అవుతోంది. రైట్స్ ఇష్యూ ధర రూ.1257. అంటే ప్రస్తుత మార్కెట్ ధర కన్నా రైట్స్ ఇష్యూ ధర రూ.172 తక్కువ. కానీ రైట్స్ ఎన్‌టైటిల్మెంట్స్ రూ.193 దగ్గర ట్రేడ్ అవుతోంది. అంటే ప్రస్తుత మార్కెట్ ధర కన్నా రూ.21 ఎక్కువగా ట్రేడ్ అవుతుండటం విశేషం. ఇన్వెస్టర్లు ఎక్కువ ధర చెల్లించి రిలయెన్స్ షేర్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

    ఈ రోజు ప్రారంభంలోనే రైట్స్ ఎన్‌టైటిల్మెంట్స్ షేర్ రూ.211.60 ధరను తాకింది. ఇంట్రాడేలో గరిష్టంగా రూ.212.60 వరకు అనుమతి ఉంది. అంటే దీని కన్నా కేవలం ఒక రూపాయి తక్కువ. ఇక మరో దశలో రూ.156 ధరను తాకింది. రైట్స్ ఎన్‌టైటిల్మెంట్స్ ప్లాట్‌ఫామ్‌లో 2.4 కోట్ల షేర్లు చేతులు మారాయి. రైట్స్ ఎన్‌టైటిల్మెంట్స్ ప్లాట్‌ఫామ్‌లో ట్రేడింగ్ మే 29 వరకు కొనసాగనుంది. రైట్స్ ఎన్‌టైటిల్మెంట్స్ ప్లాట్‌ఫామ్‌ అంటే రైట్స్ హోల్డర్లు తమ ఎన్‌టైటిల్మెంట్‌ను ఎక్స్‌ఛేంజ్‌లల్లో ప్రత్యేక ప్లాట్‌ఫామ్స్‌లో ట్రేడ్ చేసుకోవచ్చు.

    ఇక రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్-RIL రైట్స్ ఇష్యూ 2020 జూన్ 3న ముగుస్తుంది. ప్రస్తుత షేర్‌హోల్డర్లకు ప్రతీ 15 షేర్లకు 1 షేర్‌ను రూ.1,257 ధరకు ఆఫర్ చేసింది కంపెనీ. రికార్డ్ తేదీని మే 14గా నిర్ణయించింది. రూ.10 ఫేస్ వ్యాల్యూతో 42,26,26,894 ఈక్విటీ షేర్లను ఇష్యూ చేస్తోంది కంపెనీ. రిలయెన్స్ ఇండస్ట్రీస్ షేర్‌హోల్డర్లు రైట్స్ ఇష్యూ సబ్‌స్క్రైబింగ్ కోసం 25 శాతం చెల్లిస్తే చాలు. మిగతా డబ్బుల్ని వచ్చే ఏడాది మే, నవంబర్‌లో చెల్లించాలి. అంటే రూ.1,257 షేర్‌కు ఇప్పుడు రూ.314.25 చెల్లించాలి. మిగతా మొత్తాన్ని 2021 మేలో 25 శాతం, 2021 నవంబర్‌లో 50 శాతం చొప్పున చెల్లించాలి.

    ఇవి కూడా చదవండి:

    Special Trains: జూన్ 1 నుంచి 200 ప్రత్యేక రైళ్లు... టికెట్ బుకింగ్ ఇలా

    Credit Card: క్రెడిట్ కార్డ్ యూజర్లకు షాక్... కోవిడ్ 19 సమాచారంతో ఎర

    IRCTC Refund Rules: రైలు టికెట్లపై మారిన రీఫండ్ రూల్స్ ఇవే
    Published by:Santhosh Kumar S
    First published:

    అగ్ర కథనాలు