హోమ్ /వార్తలు /బిజినెస్ /

Reliance Industries: ఒలింపిక్స్, కామన్‌వెల్త్, ఏషియన్ గేమ్స్ నిర్వహణ కోసం ఐఓఏతో రిలయన్స్ భాగస్వామ్యం

Reliance Industries: ఒలింపిక్స్, కామన్‌వెల్త్, ఏషియన్ గేమ్స్ నిర్వహణ కోసం ఐఓఏతో రిలయన్స్ భాగస్వామ్యం

ఒలింపిక్స్, కామన్‌వెల్త్, ఏషియన్ గేమ్స్ నిర్వహణ కోసం ఐఓఏతో రిలయన్స్ భాగస్వామ్యం

ఒలింపిక్స్, కామన్‌వెల్త్, ఏషియన్ గేమ్స్ నిర్వహణ కోసం ఐఓఏతో రిలయన్స్ భాగస్వామ్యం

Reliance Industries | ఒలింపిక్స్, కామన్‌వెల్త్, ఏషియన్ గేమ్స్ నిర్వహణ కోసం ఐఓఏతో రిలయన్స్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. పారిస్ 2024 ఒలింపిక్స్‌కు ముందు, భారతదేశం జూన్ 2023లో ముంబైలోని అత్యాధునిక జియో వరల్డ్ సెంటర్‌లో 140వ ప్రతిష్టాత్మక IOC సెషన్‌ను కూడా నిర్వహించనుంది.

ఇంకా చదవండి ...

భవిష్యత్తులో ఒలింపిక్ క్రీడలను నిర్వహించాలనే ఆకాంక్షతో భారతీయ అథ్లెట్ల ప్రదర్శనలను పెంచడం, జాతీయ క్రీడా సమాఖ్యలకు మద్దతు ఇవ్వడం, ప్రపంచ క్రీడా దేశంగా భారతదేశాన్ని నిర్మించడం లక్ష్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL), ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) దీర్ఘకాల భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. ఈ భాగస్వామ్యం కింద, ఆర్ఐఎల్, ఐఓఏ పారిస్ ఒలింపిక్స్ 2024లో మొట్టమొదటి ఇండియా హౌస్‌ను కూడా ఏర్పాటు చేస్తాయి. IOA ప్రధాన భాగస్వామిగా, RIL కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడలు, ఒలింపిక్స్ క్రీడలతో సహా ప్రధాన మల్టీ స్పోర్ట్ ఈవెంట్లలో భారతీయ అథ్లెట్లకు మద్దతు ఇస్తుంది.

ఒలింపిక్ హాస్పిటాలిటీ హౌస్‌లు ఆటల సంప్రదాయంలో భాగం. పారిస్ 2024 ఒలింపిక్స్‌లో భారతదేశం మొదటి ఒలింపిక్ హౌస్ ఏర్పాటు ఓ చారిత్రాత్మక మైలురాయి అవుతుంది. మన దేశం కాకుండా ఇతర దేశాల్లో ఒలింపిక్ హౌస్‌ను ఏర్పాటు చేయడం, ప్రపంచ క్రీడల్లో ఒకటైన ప్రముఖ ఈవెంట్‌లో భారతదేశాన్ని ప్రపంచానికి పరిచయం చేయడం, ఒలింపిక్ ఉద్యమం పట్ల RIL నిబద్ధతకు మరొక ఉదాహరణగా నిలుస్తుంది.

New Rules in August: అలర్ట్... మీ డబ్బుకు సంబంధించి ఆగస్టులో అమల్లోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే

ప్రపంచ క్రీడా రంగంలో భారతదేశం ప్రధాన స్థానాన్ని ఆక్రమించడం మా కల. IOAతో మా భాగస్వామ్యం ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, అవకాశాలతో దేశవ్యాప్తంగా ఉన్న యువ క్రీడాకారులకు మద్దతు ఇవ్వడంలో, సాధికారత కల్పించడంలో రిలయన్స్ ఫౌండేషన్ లోతైన నిబద్ధతను బలపరుస్తుంది. 2024లో జరిగే పారిస్ ఒలింపిక్ క్రీడలలో మొట్టమొదటిసారిగా ఇండియా హౌస్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి మేము చాలా సంతోషిస్తున్నాము. భారతదేశ అపారమైన ప్రతిభను, సామర్థ్యాన్ని, ఆకాంక్షను ప్రపంచానికి ప్రదర్శించడానికి ఇది గొప్ప అవకాశం.

నీతా అంబానీ, ఐఓసీ మెంబర్, డైరెక్టర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్

ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌తో ఈ భాగస్వామ్యానికి రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు, నీతా అంబానీకి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. భారతీయ క్రీడలకు మద్దతు ఇవ్వడంలో, ఒలింపిక్ ఉద్యమంలో చేరడానికి భావితరం పిల్లలను ప్రేరేపించడంలో వారు అందిస్తున్న నిరంతర మద్దతుకు ధన్యవాదాలు. పారిస్ 2024 ఒలింపిక్స్‌లో ఇండియా హౌస్ ఉండటం చాలా ముఖ్యమైన సందర్భం. ఒలింపిక్ ఉద్యమం పట్ల భారతదేశ నిబద్ధతను పునరుద్ఘాటించడంలో ఇది ఒక పెద్ద అడుగు.

రాజీవ్ మెహ్తా, ఐఓఏ సెక్రెటరీ జనరల్

పారిస్ 2024 ఒలింపిక్స్‌కు ముందు, భారతదేశం జూన్ 2023లో ముంబైలోని అత్యాధునిక జియో వరల్డ్ సెంటర్‌లో 140వ ప్రతిష్టాత్మక IOC సెషన్‌ను కూడా నిర్వహించనుంది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సంవత్సరంలో IOC సెషన్ ఏర్పాటు చేయడం విశేషం. ఇది భారతదేశంలో క్రీడల పాత్రను హైలైట్ చేస్తుంది. ఒలింపిక్ ఉద్యమంలో భారతదేశం సహకారాన్ని సెలబ్రేట్ చేస్తోంది.

Money Matters: ఈ డేట్ గుర్తుంచుకోండి... సామాన్యులకు మరోసారి షాక్ తప్పదు

మే 2022లో భారతదేశపు మొట్టమొదటి 'ఒలింపిక్ వాల్యూస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్' (OVEP) ఒడిషాలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇది ఒలింపిజం ప్రధాన విలువలను పెంపొందించడంలో విద్య, క్రీడల జంట శక్తులను మిళితం చేస్తుంది. OVEP యువకులకు శ్రేష్ఠత, గౌరవం, స్నేహం లాంటి ఒలింపిక్ విలువలను పరిచయం చేయడానికి IOC రూపొందించిన కార్యక్రమం. పిల్లలు చురుకుగా, ఆరోగ్యంగా, బాధ్యతాయుతమైన పౌరులుగా మారడంలో సహాయపడటానికి ఈ విలువల-ఆధారిత పాఠ్యాంశాలను వ్యాప్తి చేయడం ఈ కార్యక్రమం లక్ష్యం.

First published:

Tags: Commonwealth Game 2022, Nita Ambani, Olympics, Paris Olympics 2024, Reliance Industries, RIL

ఉత్తమ కథలు