కరోనా ప్రభావం నుంచి వ్యాపార రంగాలు కోలుకుంటున్నాయి. అనేక ప్రముఖ టెక్స్టైల్ కంపెనీలు తమ పర్యావరణ, సామాజిక బాధ్యత లక్ష్యాలను పోస్ట్-పాండమిక్ వ్యూహంలో భాగంగా రూపొందిస్తున్నాయి. దీంతో క్రమంగా సస్టైనబుల్ టెక్స్‌టైల్‌కు డిమాండ్ పుంజుకుంది. ప్రపంచంలోనే అత్యధికంగా పాలిస్టర్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) ఉత్పత్తి చేస్తోంది. ఫిలమెంట్ నూలు, ప్రధానమైన ఫైబర్లను కూడా ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తోంది. తాజాగా తన ఫైర్ రెసిస్టెంట్ పాలిస్టర్ రెక్రాన్ ఎఫ్‌ఎస్‌ను మరింత అభివృద్ది చేసేందుకు రిలయన్స్ (Reliance) చర్యలు తీసుకుంటోంది. రెక్రాన్ ఎఫ్‌ఎస్‌లో ఎఫ్ఆర్ఎక్స్ ఇన్నోవేషన్స్‌కి చెందిన నోఫియా టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు ప్రకటించింది.
తాజా అప్డేట్ వివరాలను రిలయన్స్ ఓ ప్రకటనలో వెల్లడించింది. నోఫియా పాలీమెరిక్ ఫాస్పరస్-బేస్డ్ కెమిస్ట్రీ రెక్రాన్ ఎఫ్ఎస్ని సస్టైనబుల్‌గా మారుస్తుందని పేర్కొంది. పాలిస్టర్ టెక్స్టైల్ అప్లికేషన్లకు సాంకేతికంగా ఉన్నతమైనదిగా చేయడంలో సహాయపడుతుందని తెలిపింది. దీని అడిటివ్స్ టెక్స్టైల్ అప్లికేషన్ల కోసం OEKO-TEX స్టాండర్డ్ 100 ధ్రువీకరణ పొందాయని, ChemForward, Green Screen, TCO వంటి ఇతర సర్టిఫికేషన్లు పొందిందని పేర్కొంది. ఈ లేటెస్ట్ టెక్నాలజీ సేఫ్టీ, సస్టైనబిలిటీ ప్రమాణాలకు అనుగుణంగా ఉందని తెలిపింది.
Tirumala Darshanam: శ్రీవారి భక్తులకు శుభవార్త... తిరుమలలో రూ.300 దర్శనం టికెట్ సులువుగా పొందండి ఇలా
సర్క్యులర్ ఎకానమీ లక్ష్యాలను చేరుకోవడానికి టెక్స్టైల్ కంపెనీలు సస్టైనబుల్ ప్రొడక్టులను అందించే వినూత్న టెక్నాలజీ ఆధారపడుతున్నాయి. గ్లోబల్ టెక్స్టైల్ ఫ్లేమ్ రిటార్డెంట్స్ మార్కెట్ పరిమాణం 2021లో 519.5 మిలియన్ల డాలర్ల విలువను కలిగి ఉంది. 2022 నుంచి 2030 వరకు 3.6 శాతం కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్(CAGR) వద్ద విస్తరించిందని రిలయన్స్ పేర్కొంది.
సస్టైనబుల్, పర్యావరణ అనుకూలమైన, ఫైర్ రెసిస్టెన్స్ టెక్నాలజీలపై టెక్స్టైల్ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని RIL తెలిపింది. రిక్రాన్ ఎఫ్ఎస్ అనేది రిలయన్స్ విస్తృతమైన R&D విజయాలలో ఒక భాగం. నేచురల్ రిసోర్సెస్ మాత్రమే వినియోగించి జీవితకాలంపాటు పర్యావరణ హితంగా ఉండే ప్రొడక్టులను రూపొందించే లక్ష్యంతో రిలయన్స్ పని చేస్తోంది. భారతీయ రైల్వేలు వాటి అగ్నిమాపక భద్రత, మన్నిక కారణంగా సీట్లు, కర్టెన్లలో రెక్రాన్ ఎఫ్ఎస్- బేస్డ్ ఫాబ్రిక్లను ఉపయోగిస్తాయి.
Save Money: జీతం రాగానే రూ.500 పొదుపు చేయండి... రూ.2.5 లక్షలకు పైగా రిటర్న్స్ మీ బ్యాంకు ఖాతాలోకి
రెక్రాన్ ఎఫ్ఎస్ అత్యాధునిక సదుపాయాలతో తయారు చేశారని, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అని పాలిస్టర్ బిజినెస్ సెక్టార్ హెడ్ హేమంత్ D.శర్మ న్యూస్18తో అన్నారు. RIL అందించే బాధ్యతాయుతమైన సంరక్షణ ఉత్పత్తులలో భాగమని చెప్పారు. టెక్నాలజీ సాయంతో మరింత అభివృద్ధి చేస్తుండటంపై కంపెనీ గర్వంగా ఉందని పేర్కొన్నారు. ఆరోగ్యం, పర్యావరణం, సౌందర్యానికి హాని కలిగించకుండా అసాధారణమైన ఫైర్ సేఫ్టీని అందించడానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. మరోవైపు, శుభలక్ష్మి పాలిస్టర్స్ లిమిటెడ్, శుభలక్ష్మి పాలిటెక్స్ లిమిటెడ్ సంస్థల పాలిస్టర్ బిజినెస్‌ను కొనుగోలు చేస్తున్నట్లు RIL గత నెలలో ప్రకటించింది. RIL అనుబంధ సంస్థ రిలయన్స్ పెట్రోలియం రిటైల్ లిమిటెడ్ ఈ కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Reliance, Reliance Industries