RIL Partnership: గ్రీన్ హైడ్రోజన్ వైపు రిలయన్స్ అడుగులు... డెన్మార్క్ కంపెనీతో RNESL ఒప్పందం

RIL Partnership: గ్రీన్ హైడ్రోజన్ వైపు రిలయన్స్ అడుగులు... డెన్మార్క్ కంపెనీతో RNESL ఒప్పందం (ప్రతీకాత్మక చిత్రం)

RIL Partnership | గ్రీన్ హైడ్రోజన్ బిజినెస్‌లో భారీగా పెట్టుబడులు పెట్టబోతున్నట్టు ప్రకటించిన రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) అందుకు తగ్గట్టుగా ఒప్పందాలు చేసుకుంటోంది. డెన్మార్క్‌కు చెందిన స్టైస్ డాల్ (Stiesdal) కంపెనీతో తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది.

  • Share this:
రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ (RNESL) హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్స్ తయారు చేసేందుకు ముందడుగు వేసింది. ఇందుకు డెన్మార్క్‌కు చెందిన స్టైస్ డాల్ (Stiesdal) కంపెనీతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్‌కు లైసెన్సు కూడా తీసుకునట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. స్టైస్ డాల్ కంపెనీ వాతావరణ మార్పుల తీవ్రతను తగ్గించే సాంకేతిక పరిజ్ఙానాన్ని అభివృద్ధి చేసింది. ఈ పద్ధతిని వాణిజ్య విధానంలోకి తీసుకువచ్చింది. ఈ సాంకేతిక పరిజ్ఙానం వల్ల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ధర గణనీయంగా తగ్గుతుంది.

గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి రిలయన్స్ నిర్దేశించుకున్న 1-1-1 లక్ష్యాన్ని చేరేందుకు ఇది ఉపయోగపడుతుందని ఈ ఏడాది సెప్టెంబరులో జరిగిన ఇంటర్నేషన్ క్లైమేట్ సదస్సులో రిలయన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ ప్రకటించారు. ఈ సాంకేతిక పరిజ్ఙానం వల్ల రాబోయే దశాబ్ద కాలంలో ఒక కిలో హైడ్రోజన్ ఒక డాలరుకే లభిస్తుందన్నారు. 2030 నాటికి కిలో హైడ్రోజన్ రెండు డాలర్లకే ఉత్పత్తి చేయాలని ప్రపంచ దేశాల లక్ష్యంగా ఉన్నట్టు ముఖేష్ అంబానీ గుర్తుచేశారు.

7th Pay Commission: ఆ ఉద్యోగుల‌కు రూ.17,951 బోనస్ ప్రకటించిన కేంద్రం... ద‌స‌రా, దీపావళి బొనాంజా

ఆఫ్‌షోర్ విండ్ ఎనర్జీ ఉత్పత్తిలో వాతావరణ మార్పుల సాంకేతిక పరిజ్ఙానం అభివృద్ధి చేసుకునేందుకు రెండు కంపెనీలు కలసి పనిచేయాలని కూడా నిర్ణయించాయి. హైడ్రోజన్‌ను విద్యుత్‌గా మార్చడం, స్థిర విద్యుత్ ఉత్పత్తి, దీర్ఘకాలం విద్యుత్ నిల్వ, కార్బన్ నెగటివ్ ఇంధనాల ఉత్పత్తి కోసం కూడా ఈ రెండు కంపెనీలు కలసి పనిచేయనున్నాయని వెల్లడించారు ముఖేష్ అంబానీ. విస్తారంగా లభించే సౌరశక్తి నుంచి గ్రీన్ ఎనర్జీలోకి మారాలనే భారత లక్ష్యాన్ని.. సాంకేతిక పరిజ్ఙానాన్ని వినూత్నస్థాయికి పెంచడం ద్వారా చేరుకోవచ్చన్నారు .

భారతదేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక సంస్థ రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ లిమిటెడ్ తో ఒప్పందం చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని స్టైస్ డాల్ కంపెనీ సీఈఓ హెన్రిక్ స్టైస్ డాల్ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో మా సాంకేతిక పరిజ్ఙానం వినియోగించుకోవడంకంటే గొప్ప అనుభూతి మరొకటి ఉండదని ఆయన తెలిపారు.

EPF Account: ఈపీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్... దీపావళి లోపు గుడ్ న్యూస్

స్టైస్ డాల్‌లో నాలుగు అనుబంధ సంస్థలు ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కో ప్రత్యేక పునరుత్పాదక శక్తి ఉత్పత్తులపై దృష్టి సారించాయని హెన్రిక్ గుర్తు చేశారు. స్టైస్ డాల్ ఆఫ్‌షోర్ టెక్నాలజీ టెట్రా, ఫ్లోటింగ్, విండ్ టర్భైన్ మాడ్యూల్ ను కూడా అభివృద్ధి చేసింది. స్టైస్ డాల్ స్టోరేజీ టెక్నాలజీస్ గ్రిడ్ స్కేల్ విధానంలో విద్యుత్ నిల్వ సదుపాయాలను అభివృద్ధి పరిచిందన్నారు. పిండిచేసిన రాయిలో ఉండే వేడి రూపంలో ఈ విద్యుత్తును నిల్వ చేస్తుంది.

లిథియం అయాన్ బ్యాటరీల కంటే కూడా ఎక్కువ సమయం విద్యుత్ నిల్వ చేయవచ్చని ఆయన తెలిపారు. విమానాల కోసం కో2 నెగటివ్ ఇంధనాన్ని ఉత్పత్తి చేయగల స్త్కైక్లన్ టెక్ ని స్లైస్ డాల్ ఫ్యూయల్ టెక్నాలజీస్ అభివృద్ధి చేసింది. స్టైస్ డాల్ ఫిక్స్ టెక్నాలజీస్ నీటిలో ఉండే విద్యుత్ విశ్లేషణ వ్యవస్థలను తక్కువ ఖర్చుతో హైడ్రోజన్ గా మార్చే సాంకేతిక పరిజ్ఙాన్నాన్ని అభివృద్ధి పరిచిందని హెన్ రిక్ తెలిపారు.

Aadhaar Card: మీ పేరుతో ఎన్ని సిమ్ కార్డ్స్ ఉన్నాయి? సింపుల్‌గా చెక్ చేయండి ఇలా

రిలయన్స్ కొత్త దశా దిశ


రిలయన్స్ ఇండస్ట్రీస్ తన ఇంధన,మెటీరియల్ వ్యాపారాలను మార్చే ప్రక్రియలో ఉంది. ఇందుకోసం కంపెనీ చైర్మన్ సీఎండీ ముఖేష్ అంబానీ జూన్ లో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలోనే కొత్త ప్రణాళికను వివరించారు. హైపర్ ఇంటిగ్రేషన్లో సాంకేతికత, శాస్త్రీయ పరిజ్ఙానం, ఆ తరవాత క్లీన్ ఎనర్జీ ని డిమాండ్ కు సరిపడా ఉత్పత్తి చేయడం, ఉత్పత్తి ఖర్చు తగ్గించడం లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. మూడో దశలో వ్యాపార సరళిలో నిర్వహించుకునే విధంగా శక్తి సామర్ధ్యాలను పెంచుకోవాలని ముఖేష్ అంబానీ ప్రణాళిక సిద్దం చేశారు.

గుజరాత్ లోని జామ్ నగర్ ధీరూభాయ్ అంబానీ గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్సులో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి కోసం రూ.75,000 కోట్ల వ్యయంతో 5,000 ఎకరాల్లో గిగా ప్యాక్టరీ ఏర్పాటు చేయనున్నారు. ఈ కాంప్లెక్సులో సోలార్ ఎనర్జీ ఉత్పత్తి కోసం ఓ ఇంటిగ్రేటెడ్ సోలార్ ఫోటో వోల్టాయిక్ మాడ్యూల్ ఫ్యాక్టరీ, విద్యుత్ ను నిల్వ చేయడానికి ఆధునిక ఎనర్జీ స్టోరేజ్ బ్యాటరీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నారు.

Aadhaar Card Fraud: ఆధార్‌ కార్డు విషయంలో వెంటనే ఈ పనిచేయకపోతే మోసపోతారు జాగ్రత్త

గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయడానికి ఎలక్ట్రోలైజర్ ఫ్యాక్టరీ, ఇంధన సెల్ ఫ్యాక్టరీ ద్వారా హైడ్రోజన్ ను మోటివ్, స్టేషనరీ పవర్ గా మార్చే ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నారు. ఇందులో గిగా ఫ్యాక్టరీ ఏర్పాటుకు అవసరమైన పరికరాలు తయారు చేయడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తేనున్నారు. గత కొన్నాళ్లుగా లక్ష్యాన్ని చేరుకునేందుకు అవసరమైన సమీకరణలు, భాగస్వాములను చేర్చుకుంటున్నామని ముఖేష్ అంబానీ ప్రకటించారు.

ఆర్ఎన్ఎస్ఈఎల్ హైడ్రోజన్ ఎలక్రోలైజర్ల అభివృద్ధి, తయారు చేయడానికి స్టైస్ డాల్ తో ఒప్పందం చేసుకున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ అక్టోబరు 12 ఓ ప్రకటనలో తెలిపింది. దీని కోసం లైసెన్స్ కూడా పొందినట్టు స్టాక్ ఎక్స్ఛేంజ్ కు తెలిపారు. నార్వే దేశానికి చెందిన ఆర్ఈసీ సోలార్ హోల్డింగ్స్ ను కొనుగోలు చేసినట్టు రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ లిమిటెడ్ అక్టోబరు 10న ప్రకటించింది.

ఈ కొనుగోలు ద్వారా ఫోటో వోల్టాయిక్ పీవీ తయారీలో, హెటెరో జంక్షన్ టెక్నాలజీ సహాయంతో సోలార్ ఫ్లాంట్ల పనితీరును మెరుగుపరచడం ద్వారా ప్రపంచంలోనే ప్రముఖ ఉత్పత్తిదారుగా కీలక పాత్ర పోషించనున్నారు. స్టెర్లింగ్, విల్సన్ సోలార్ లిమిటెడ్ లో 40 శాతం వాటా కొనుగోలు చేయడం కంపెనీ క్లీన్ ఎనర్జీ ఆశయాలను మెరుగు పరుస్తుందని ముఖేష్ అంబానీ ప్రకటించారు.
Published by:Santhosh Kumar S
First published: