హోమ్ /వార్తలు /బిజినెస్ /

Reliance JioFiber: జియో ఫైబర్- ఆప్టిక్ నెట్‌వర్క్ పొడవుతో భూమిని 27 సార్లు చుట్టేయవచ్చు: ముఖేష్ అంబానీ

Reliance JioFiber: జియో ఫైబర్- ఆప్టిక్ నెట్‌వర్క్ పొడవుతో భూమిని 27 సార్లు చుట్టేయవచ్చు: ముఖేష్ అంబానీ

జియో ఫైబర్- ఆప్టిక్ నెట్‌వర్క్ పొడవుతో భూమిని 27 సార్లు చుట్టేయవచ్చు: ముఖేష్ అంబానీ

జియో ఫైబర్- ఆప్టిక్ నెట్‌వర్క్ పొడవుతో భూమిని 27 సార్లు చుట్టేయవచ్చు: ముఖేష్ అంబానీ

Reliance JioFiber: రిలయన్స్ ఇండస్ట్రీస్ 45వ యాన్యువల్ జనరల్ మీటింగ్‌ (Annual General Meeting)లో ఆ సంస్థ ఛైర్మన్ ముఖేష్ అంబానీ (Mukesh Ambani) ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

రిలయన్స్ ఇండస్ట్రీస్ 45వ యాన్యువల్ జనరల్ మీటింగ్‌ (Annual General Meeting)లో ఆ సంస్థ ఛైర్మన్ ముఖేష్ అంబానీ (Mukesh Ambani) ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సోమవారం జరిగిన ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ జియో పాన్-ఇండియా ఫైబర్-ఆప్టిక్ నెట్‌వర్క్ పొడవు 11 లక్షల కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉంటుందని అన్నారు. ఈ నెట్‌వర్క్‌ భూమి చుట్టూ 27 సార్లు తిరిగేందుకు సరిపోతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా లక్షల మంది జియో ఫైబర్ (JioFiber) సర్వీసులు వాడుతున్నారని ముకేశ్ అంబానీ తెలిపారు. ఇండియాలో జియోఫైబర్ సర్వీసులను ఇంకా విస్తరించనున్నామని వెల్లడించారు. ఇదే సమావేశంలో ఈ ఏడాది దీపావళి నాటికి ఇండియాలో 5G సేవలను రిలయన్స్ జియో ప్రారంభించనుందని ప్రకటించారు.


"ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే హై-క్వాలిటీ జియో ఫిక్స్‌డ్‌-లైన్ ఫైబర్-ఆప్టిక్ నెట్‌వర్క్ భారతదేశంలోని ప్రతి మూల నుంచి డేటా ట్రాఫిక్‌ను తీసుకువెళ్ళే సమాచార వెన్నెముక. ఇది ప్రతి మూల నుంచి డేటాను గ్లోబల్ ఇంటర్నెట్‌కి కనెక్ట్ చేస్తుంది. నేడు, జియో పాన్-ఇండియా ఫైబర్-ఆప్టిక్ నెట్‌వర్క్ పొడవు 11 లక్షల కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉంది. అంటే ఇది భూమిని 27 కంటే ఎక్కువ సార్లు చుట్టడానికి సరిపోతుంది." అని యాన్యువల్ జనరల్ మీటింగ్‌లో ముఖేష్ అంబానీ అన్నారు.


* జియో ఫైబర్‌ నం 1 సర్వీస్‌ ప్రొవైడర్‌
జియోఫైబర్ (JioFiber) ఇప్పుడు దేశంలోనే టాప్ ఫైబర్ టు ద ఎక్స్ (FTTX) సర్వీస్ ప్రొవైడర్ అని ముఖేష్ అంబానీ తెలిపారు. "జియోఫైబర్ ఇప్పుడు భారతదేశంలో 7 మిలియన్లకు పైగా కనెక్ట్ అయిన ఇళ్లు/ఆఫీసులు/వ్యాపారాలతో నంబర్ వన్ ఎఫ్‌టీటీఎక్స్ సర్వీస్ ప్రొవైడర్‌గా నిలుస్తోంది. కరోనా లాక్‌డౌన్లు అమలులో ఉన్నా జస్ట్ రెండేళ్లలోపు సాధించిన ఘనత ఇది. ప్రతి ముగ్గురు కొత్త కస్టమర్లలో ఇద్దరూ జియోఫైబర్‌ను ఎంచుకుంటున్నారు. గతేడాదిలో జియోఫైబర్‌ వేగమైన వృద్ధిని కూడా మేం చూశాం." అని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ అన్నారు.


ఈ బలమైన వృద్ధి నమోదవుతున్నా... ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలలో భారతదేశం ప్రపంచంలోని ఇతర దేశాల కంటే వెనుకబడి ఉందని ముఖేష్ అంబానీ చెప్పుకొచ్చారు. "కేవలం 20 మిలియన్ కనెక్షన్లతో, ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్ స్వీకరణలో ఇండియా ప్రపంచంలో 138వ స్థానంలో ఉంది. అభివృద్ధి చెందిన దేశాల మాదిరి కాకుండా మన దేశంలోని ఇళ్లు, ఆఫీసులు, బిజినెస్‌లు ఎక్కువ భాగం ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు లేకుండానే నడుస్తున్నాయి. ఇండోర్ Wi-Fi ఫెసిలిటీని కోల్పోయాయి. ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్ ఈ పద్ధతి మారాలి, వేగంగా మారాలి. జియో దీన్ని మారుస్తుంది. ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్ స్వీకరణలో మేం భారతదేశాన్ని టాప్-10 లీగ్‌లోకి ప్రవేశపెడతాం" అని అతను పేర్కొన్నారు.


ఇది కూడా చదవండి : జియో 5జీ నుంచి జియో క్లౌడ్ పీసీ వరకు... రిలయన్స్ 45వ ఏజీఎం హైలైట్స్ ఇవే


* దీపావళికి 5G సేవలు లాంచ్‌

రిలయన్స్ జియో 5G నెట్‌వర్క్ కోసం రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడిని కేటాయించిందని.. అలానే దీపావళి నాటికి మెట్రో నగరాల్లో 5G సేవలను ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నట్లు ముఖేష్ అంబానీ తెలిపారు. దీపావళి తర్వాత నుంచి డిసెంబర్ 2023 వరకు జియో 5G సేవలను నెలవారీగా దేశమంతటా విస్తరించాలని కంపెనీ ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. "జియో 5G ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత అధునాతన 5G నెట్‌వర్క్‌గా అవతరిస్తుంది. 4G నెట్‌వర్క్‌పై జీరో డిపెండెన్సీతో స్టాండ్-అలోన్ 5G అని పిలిచే 5G లేటెస్ట్ వెర్షన్‌ని జియో తీసుకొస్తుంది" అని వెల్లడించారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Jio fiber, Mukesh Ambani, Reliance Industries

ఉత్తమ కథలు