Reliance Industries Limited (RIL): ఫిబ్రవరి 23న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఓ కీలక ప్రకటన చేసింది. తన ఆయిల్ టు కెమికల్స్ (O2C) వ్యాపారాన్ని స్వతంత్ర అనుబంధ సంస్థ (independent subsidiary)గా మార్చబోతున్నట్లు తెలిపింది. ఈ కొత్త స్వతంత్ర అనుబంధ సంస్థపై 100 శాతం నిర్వహణ నియంత్రణ (management control)ను రిల్ పొందుతుందని తెలిపింది. ఎక్స్ఛేంజీలకు రిలయన్ ఇండస్ట్రీస్ ఓ నోటిఫికేషన్ పంపింది. O2C వ్యాపారాన్ని స్వతంత్ర అనుబంధ సంస్థగా మార్చిన తర్వాత... అందులో... ప్రమోటర్ల గ్రూపు వాటాల్లో మార్పులేవీ ఉండవనీ... వారు 49.14 శాతం వాటా అలాగే కలిగి ఉంటారని తెలిపింది. ప్రస్తుతం O2Cని నిర్వహిస్తున్న టీమ్... కొత్తగా సృష్టించే అనుబంధ సంస్థలోకి వెళ్తారనీ... ఆదాయాలు తగ్గించడం గానీ... నగదు ప్రవాహాల్లో పరమితులు పెట్టడం గానీ అలాంటివి ఏవీ ఉండవని రిల్ తెలిపింది.
ఈ కొత్త నిర్ణయం వల్ల... రిలయన్స్ ఇండస్ట్రీస్ O2Cలో ఉన్న రిఫైనింగ్, మార్కెటింగ్, పెట్రో కెమికల్స్ ఆస్తులు... O2C స్వతంత్ర అనుబంధ సంస్థకు బదిలీ అవుతాయి. ఇలా ఎందుకు అంటే... ఈ కొత్త సంస్థ వ్యూహాత్మక భాగస్వామ్యాలు కుదుర్చుకునేందుకు వీలవుతుంది. వాటిలో సౌదీ అరామ్కో కంపెనీతో డీల్ కూడా ఒకటి. పెట్టుబడి మూలధనాన్ని ఆకర్షించేందుకు ఈ నిర్ణయం ద్వారా వీలవుతుంది. ప్రస్తుతం అరామ్కో కంపెనీతో చర్చలు కొనసాగుతున్నాయని రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. ప్రపంచంలోనే అతి పెద్ద చమురు ఎగుమతి దారైన సౌదీ అరామ్కో... రిలయన్స్ O2C వ్యాపారంలో 20 శాతం వాటా దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది.
ఈ కొత్త నిర్ణయంతో రిలయన్స్ O2C వ్యాపారానికి సంబంధించి ఉన్న 25 బిలియన్ డాలర్ల వడ్డీతే చెల్లించే లోన్‌ను కూడా కొత్త సంస్థకు మళ్లిస్తుంది. ఏడాది కాలంలో SBI MCLR రేట్ ప్రకారం... లోన్‌పై వడ్డీని చెల్లిస్తోంది. వ్యూహాత్మక పెట్టుబడి దారులు పెట్టుబడి పెట్టినప్పుడు లోన్ మొత్తాన్ని చెల్లించనున్నారు.
ఈ మార్పుకి సంబంధించి... సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛైంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI), స్టాక్ ఎక్స్ఛేంజీల నుంచి అనుమతిని ఆల్రెడీ రిల్ పొందింది. ఐతే... ఈక్విటీ షేర్ హోల్డర్స్, క్రెడిటర్స్, ఇన్‌కం టాక్స్ అథార్టీ, ముంబై, అహ్మదాబాద్‌లో బెంచ్‌లు ఉన్న నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) నుంచి గ్రీన్ సిగ్నల్ పొందాల్సి ఉంది. ఇలాంటి అనుమతులన్నీ సెప్టెంబర్ చివరి నాటికి వచ్చేస్తాయని కంపెనీ భావిస్తోంది.
ఈ కొత్త నిర్ణయం తర్వాత... రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాటా 85.1 శాతం ఉంటుంది. అలాగే జియో ప్లాట్‌ఫామ్స్‌లో 67.3 శాతం ఉంటుంది. ఈ ప్రతిపాదిత కొత్త స్వతంత్ర అనుబంధ సంస్థ... ఫ్యూయల్ రిటైల్ సబ్సిడియరీని కూడా కలిగి ఉంటుంది. ఇందులో రిల్... 51 శాతం వాటా కలిగి ఉంది. మిగతా 49 శాతం BP plcకి చెందింది.
ఇది కూడా చదవండి:Gold Prices Today: బంగారం ధరలు భారీగా పెరిగే ఛాన్స్... స్పష్టమైన సంకేతాలు
ఇకపై రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్... O2C సబ్సిడియరీ సంస్థ కలిసి... 2035 నాటికి నెట్ కార్బన్ జీరో టార్గెట్‌ను చేరాలనుకుంటున్నాయి. ఆ దిశగా నిర్ణయాలు ఉండనున్నాయి.
Disclaimer: Reliance Industries Ltd. is the sole beneficiary of Independent Media Trust which controls Network18 Media & Investments Ltd that publishes TeluguNews18.com