Home /News /business /

RELIANCE INDUSTRIES LIMITED TO INVEST OVER RS 5 LAKH CRORE IN GREEN ENERGY AND OTHER PROJECTS IN GUJARAT SS

Reliance Industries: గ్రీన్ ఎనర్జీలో రూ.5 లక్షలకు పైగా కోట్ల పెట్టుబడులకు రిలయన్స్ ఒప్పందం

Reliance Industries: గ్రీన్ ఎనర్జీలో రూ.5 లక్షలకు పైగా కోట్ల పెట్టుబడులకు రిలయన్స్ ఒప్పందం

Reliance Industries: గ్రీన్ ఎనర్జీలో రూ.5 లక్షలకు పైగా కోట్ల పెట్టుబడులకు రిలయన్స్ ఒప్పందం

Reliance Industries | ప్రస్తుతం ప్రపంచమంతా గ్రీన్ ఎనర్జీ (Green Energy) రంగంపై దృష్టిపెడుతోంది. భారతదేశంలో అతిపెద్ద కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) గ్రీన్ ఎనర్జీలో రూ.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టబోతోంది.

    రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) గ్రీన్ ఎనర్జీలో పెట్టుబడుల కోసం గుజరాత్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్ 2022 (Vibrant Gujarat Summit 2022) కార్యక్రమంలో పెట్టుబడుల ప్రకటనలో భాగంగా మొత్తం రూ.5.95 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్టు రిలయన్స్ ప్రకటించింది. ఈ పెట్టుబడులతో రాష్ట్రంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 లక్షలకు పైగా ఉద్యోగాలు రాబోతున్నాయి. గుజరాత్‌ను కార్బన్ రహితంగా మార్చేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ రాబోయే 10 నుంచి 15 ఏళ్లలో రూ.5.95 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టబోతోంది. ఈ పెట్టుబడులతో 100 గిగా వాట్ల రెన్యువబుల్ ఎనర్జీ పవర్ ప్లాంట్, గ్రీన్ హైడ్రోజన్ ఎకో సిస్టమ్ అభివృద్ధి చేయనుంది.

    మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ పెట్టుబడులతో చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (SMEs) సహకారం అందిస్తూ ఇకో సిస్టమ్‌ను అభివృద్ధి చేయనుంది. రిలయన్స్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రైజన్ వ్యవస్థల్ని ఉపయోగించుకుంటూ కొత్త టెక్నాలజీ, ఆవిష్కణల్ని అభివృద్ధి చేసేలా ఆంట్రప్రెన్యూర్స్‌ను ప్రోత్సహించనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విజన్‌లో భాగమైన డీకార్బనైజేషన్, గ్రీన్ ఎకోసిస్టమ్ సృష్టించడం కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ కార్యక్రమాలు చేపట్టబోతోంది.

    SBI 3-in-1 Account: ఎస్‌బీఐలో త్రీ ఇన్ వన్ అకౌంట్ తీసుకుంటే బెనిఫిట్స్ ఇవే

    అందులో భాగంగా గుజరాత్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన రిలయన్స్ ఇండస్ట్రీస్... కచ్, బనస్కాంత, ఢొలెరా ప్రంతాల్లో 100 గిగా వాట్ల రెన్యువబుల్ ఎనర్జీ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయబోతోంది. ఇందుకోసం రిలయన్స్ 4.5 లక్షల ఎకరాలను ప్రభుత్వం నుంచి కోరింది. న్యూ ఎనర్జీ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఇంటిగ్రేటెడ్ ఏర్పాటులో భాగంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మరో రూ.60,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ పెట్టుబడితో పాలీసిలికాన్, వేఫర్, సెల్ అండ్ మాడ్యూల్ తయారీ కోసం సోలార్ పీవీ మాడ్యూల్, ఎలక్ట్రోలైజర్, ఎనర్జీ స్టోరేజ్ బ్యాటరీ, ఫ్యూయెల్ సెల్స్ తయారవుతాయి.

    Medical Advance: కరోనాతో ఆస్పత్రి పాలయ్యారా? రూ.1,00,000 మెడికల్ అడ్వాన్స్ తీసుకోండిలా

    ఇక ప్రస్తుతం ఉన్న ప్రాజెక్ట్స్‌తో పాటు కొత్త వెంచర్లలో మూడు నుంచి ఐదేళ్లలో రూ.25,000 కోట్లు, 5జీ నెట్వర్క్ అప్‌గ్రేడేషన్ కోసం మూడు నుంచి ఐదేళ్లలో రూ.7,500 కోట్లు, రిలయన్స్ రీటైల్‌కు సంబంధించి రూ.3,000 కోట్ల పెట్టుబడుల్ని పెట్టనుంది రిలయన్స్.

    రిలయన్స్ ఇండస్ట్రీస్ భారతదేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ సెక్టార్ కంపెనీ. 2021 మార్చి 31 నాటికి కన్సాలిడేటెడ్ టర్నోవర్ రూ.539,238 కోట్లు. క్యాష్ ప్రాఫిట్ రూ.79,828 కోట్లు. నెట్ ప్రాఫిట్ రూ.53,739 కోట్లు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ హైడ్రోకార్బన్ అన్వేషణ, ఉత్పత్తి, పెట్రోలియం శుద్ధి, మార్కెటింగ్, పెట్రోకెమికల్స్, రీటైల్, డిజిటల్ సేవలకు సంబంధించిన బిజినెస్ చేస్తోంది.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Gujarat, Reliance, Reliance Industries, Solar

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు