• Home
  • »
  • News
  • »
  • business
  • »
  • RELIANCE INDUSTRIES LIMITED TO HELD 44TH ANNUAL GENERAL MEETING ON JUNE 24 SS

RIL 44th AGM: జూన్ 24న రిలయెన్స్ ఇండస్ట్రీస్ వర్చువల్ ఏజీఎం

RIL 44th AGM: జూన్ 24న రిలయెన్స్ ఇండస్ట్రీస్ వర్చువల్ ఏజీఎం (image: Mukesh Ambani)

RIL 44th AGM | రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్-RIL జూన్ 24న ఏజీఎం నిర్వహించబోతోంది. వర్చువల్ మోడ్‌లో ఈ మీటింగ్ జరుగుతుంది.

  • Share this:
    భారతదేశంలో అతిపెద్ద మార్కెట్ క్యాపిటలేజషన్ గల రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్-RIL జూన్ 24న యాన్యువల్ జనరల్ మీటింగ్-AGM నిర్వహించబోతోంది. ఐపీఓ తర్వాత నిర్వహిస్తున్న 44వ ఏజీఎం ఇది. రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్-RIL షేర్ హోల్డర్స్‌తో పాటు మార్కెట్ వర్గాలు ఏజీఎంలో ప్రకటించే అంశాల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. వర్చువల్ పద్ధతిలో రిలయెన్స్ ఇండస్ట్రీస్ ఏజీఎం జరగనుందని కంపెనీ ప్రకటించింది. 2021 జూన్ 24 మధ్యాహ్నం 2 గంటలకు ఏజీఎం ప్రారంభం అవుతుంది. రిలయెన్స్ ఇండస్ట్రీస్ వెబ్‌సైట్ www.ril.com యాన్యువల్ రిపోర్ట్ కూడా అందుబాటులోకి వస్తుంది. ఆయిల్ నుంచి టెలికాం వరకు పలు కంపెనీల సమ్మేళనం అయిన రిలయెన్స్ ఇండస్ట్రీస్ 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నివేదికతో పాటు బోర్డ్ రిపోర్ట్, ఆడిటర్స్ రిపోర్ట్, ఇతర డాక్యుమెంట్స్‌ను కంపెనీ సభ్యులకు ఎలక్ట్రానిక్ పద్ధతిలో పంపించనుంది.

    ATM Withdrawal Rules: ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తున్నారా? ఈ 4 రూల్స్ గుర్తుంచుకోండి

    SBI New Charges: జూలై 1 నుంచి ఎస్‌బీఐ కస్టమర్లకు కొత్త ఛార్జీలు

    ఏజీఎం నోటీసులో పేర్కొన్న తీర్మానాలపై అర్హత ఉన్న సభ్యులు ఓటు వేయడానికి 2021 జూన్ 17 వరకు అవకాశం ఉంది. ఇక ఏజీఎంలో 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఒకవేళ డివిడెండ్ ప్రకటిస్తే, ఆ డివిడెండ్‌ను పొందేందుకు జూన్ 14 ను రికార్డ్ డేట్‌గా ప్రకటించింది రిలయెన్స్ ఇండస్ట్రీస్. ఒకవేళ డివిడెండ్ ప్రకటిస్తే యాన్యువల్ జనరల్ మీటింగ్ ముగిసిన వారం రోజుల్లో సభ్యులకు చెల్లిస్తారు. ఇక కంపెనీ లేటెస్ట్ యాన్యువల్ రిపోర్ట్ జూన్ 2న విడుదలైంది. రికార్డు స్థాయిలో నిధులను సేకరించిన తర్వాత రిలయెన్స్ అత్యధిక లిక్విడిటీతో బ్యాలెన్స్ షీట్ పటిష్టంగా ఉందని, వ్యాపారాలను వృద్ధి చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని కంపెనీ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముకేష్ అంబానీ తెలిపారు.
    Published by:Santhosh Kumar S
    First published: