Q2లో రిలయన్స్ నికర లాభం రూ.9516 కోట్లు

రిలయన్స్ జియో రూ.681 కోట్ల లాభాన్ని ఆర్జించింది.

news18-telugu
Updated: October 17, 2018, 9:07 PM IST
Q2లో రిలయన్స్ నికర లాభం రూ.9516 కోట్లు
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముఖేష్ అంబానీ(ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: October 17, 2018, 9:07 PM IST
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రెండో క్వార్టర్ ఫలితాలను ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసి క్యూ‌2లో రూ.9516 కోట్ల నికర లాభం వచ్చినట్టు సంస్థ ప్రకటించింది. చిన్న చిన్న అవాంతరాలు ఎదరైనా.. అంచనా వేసిన దానికి దగ్గరగానే వచ్చింది. రెండో క్వార్టర్‌లో సుమారు రూ.9710 కోట్ల నికర లాభ రావొచ్చని సీఎన్‌బీసీ టీవీ18 బిజినెస్ చానల్ అంచనా వేసింది. అయితే, ఆ అంచనాకు కొద్ది దూరంలో నిలిచింది.

రెండో క్వార్టర్ ఫలితాలను ప్రకటించడానికి కొద్ది నిమిషాల ముందే.. ఆ సంస్థ షేర్ల విలువ 1.2 శాతం తగ్గింది. అయితే, ఏడాది లెక్కన చూసుకుంటే.. నెట్ ప్రాఫిట్ 17.3శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రిలయన్స్ సంస్థ రూ.8109 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.

ఇయర్ టు ఇయర్ లెక్కన తీసుకుంటే.. గత సంవత్సరం కంటే ఈ ఏడాది రూ.54.5 శాతం వృద్ధి చెందింది. రిలయన్స్ ఆదాయం రూ.1,56,291 కోట్లకు చేరింది. సుమారు రూ.1,38,000 కోట్ల ఆదాయం వస్తుందని సీఎన్‌బీసీ టీవీ18 అంచనా వేస్తే.. అంతకంటే ఎక్కువే సాధించింది. పెట్రో కెమికల్, రిఫైనరీ ఉత్పత్తుల్లో గణనీయమైన లాభాలు వచ్చాయి. గత ఏడాది ఇదే సమయానికి ఆర్ఐఎల్ ఆదాయం రూ.1,01,169 కోట్లు. రిలయన్స్ జియో రూ.681 కోట్ల లాభాన్ని ఆర్జించింది.

First published: October 17, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...