రిలయన్స్ ఇండస్ట్రీస్ సంచలన నిర్ణయం..

రిలయన్స్ ఇండస్ట్రీస్(Reliance Industries) సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. సంస్థకు చెందిన మీడియా, డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురానుంది.

news18-telugu
Updated: February 18, 2020, 10:02 AM IST
రిలయన్స్ ఇండస్ట్రీస్ సంచలన నిర్ణయం..
రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ (File Photo)
  • Share this:
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (Reliance Industries Ltd ) సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది.  ఆ సంస్థకు చెందిన మీడియా, డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురానుంది. నెట్‌వర్క్18(Network18)లో మీడియా సహా వినోద వ్యాపారాన్ని ఏకీకృతం చేయబోతోంది. ఫలితంగా రూ.8వేల కోట్ల వార్షిక ఆదాయం కలిగిన సంస్థగా నెట్‌వర్క్18 అవతరించనుంది. ‘వార్తా, వినోద మీడియాలను ఏకీకృతం చేయబోతున్నాం. అందులో డిజిటల్ మీడియా కూడా ఉంటుంది. దీనివల్ల సంస్థ సామర్థ్యం మరింత పెరుగుతుంది. మరింత సమన్వయం ఏర్పడుతుంది.’ అని వెల్లడించింది. టీవీ18 బ్రాడ్‌కాస్ట్, హాత్‌వే కేబుల్ అండ్ డేటాకామ్, డెన్ నెట్‌వర్క్స్, నెట్‌వర్క్18 మీడియా అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ బోర్డు ప్రతినిధులతో చర్చించిన అనంతరం రిలయన్స్ ఈ ప్రకటన విడుదల చేసింది.

న్యూస్18 పేరుతో ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద న్యూస్ నెట్‌వర్క్ కలిగిన టీవీ18 బ్రాడ్‌కాస్ట్.. కలర్స్, వూట్‌ను కూడా కలిగి ఉంది. అదీకాక.. హాత్‌వే, డెన్ నెట్‌వర్క్స్ దేశంలోనే టాప్ కేబుల్ ప్లాట్‌ఫామ్స్. వీటికి దేశంలో 30 శాతం వాటా ఉంది. ఇక, నెట్‌వర్క్18 కింద ఫైనాన్షియల్ యాప్ మనీ కంట్రోల్(Moneycontrol), న్యూస్18 రీజనల్ లాంగ్వేజ్ ఛానళ్లు, news18.com పేరుతో ఇంగ్లిష్, పలు భారతీయ భాషల్లో వెబ్‌సైట్స్ ఉన్నాయి.
First published: February 18, 2020, 7:40 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading