హోమ్ /వార్తలు /బిజినెస్ /

Reliance Industries: నెట్‌మెడ్స్‌ని కొనేసిన రిలయన్స్... ఈ-ఫార్మసీలో అమెజాన్‌కి గట్టి పోటీ

Reliance Industries: నెట్‌మెడ్స్‌ని కొనేసిన రిలయన్స్... ఈ-ఫార్మసీలో అమెజాన్‌కి గట్టి పోటీ

ముఖేష్ అంబానీ (File)

ముఖేష్ అంబానీ (File)

Reliance Industries: ఇండియాలో ఎలాగైనా వీలైనంత ఎక్కువగా విస్తరించాలని ప్రయత్నిస్తున్న అమెజాన్‌కి రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి అన్ని రకాలుగా పోటీ ఎదురవుతోంది.

  Reliance Industries (RIL): ఈ మధ్య వేర్వేరు కంపెనీలతో డీల్స్ కుదుర్చుకుంటున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL)... తాజాగా... రూ.620 కోట్లతో... ఆన్‌లైన్ ఫార్మసీ నెట్‌మెడ్స్ (Netmeds)లో... 60 శాతం వాటాను ఆగస్ట్ 18న కొనేసింది. ఈ డీల్ వల్ల... ఈ-కామర్స్‌ దిగ్గజ కంపెనీ అయిన అమెజాన్‌కి ఇకపై రిలయన్స్ ఇండస్ట్రీస్ గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ డీల్... నెట్‌మెడ్స్‌కి దాదాపు రూ.1000 కోట్ల విలువైనదిగా తెలిసింది. ఈ ఒప్పందం వల్ల... రిల్‌కి చెందిన రిటైల్ యూనిట్... రిలయన్స్ రిటైల్... ఈ-కామర్స్‌లో మరింత ఎక్కువ వాటాను దక్కించుకున్నట్లైంది. ఇప్పటికే రిలయన్స్... జియో మార్ట్ ద్వారా... ఈ-కామర్స్‌ రూపంలో ఆన్‌లైన్‌లో సరుకులు అమ్ముతోంది. మొత్తంగా కరోనా సమయంలో... రిలయన్స్ ఇలాంటి డీల్స్‌తో దూసుకెళ్తోంది.

  ప్రదీప్ దాధా స్థాపించిన నెట్‌మెడ్స్... ప్రస్తుతం తన వెబ్‌సైట్, యాప్ ద్వారా... మందులు, వ్యక్తిగత, బేబీకేర్ ఐటెమ్స్‌ను డెలివరీ చేస్తోంది. అలాగే... డాక్టర్ బుకింగ్స్, డయాగ్నోస్టిక్స్ కల్పిస్తోంది. ఇలాంటి డీల్ కోసం ఈ కంపెనీ ఏడాది నుంచి ఎదురుచూస్తోంది. ఎందుకంటే... పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఈ కంపెనీలో సరిపడా నిధులు లేవు. ఈ కంపెనీలో ఇప్పటికే... సింగపూర్‌కి చెందిన దావున్ పెన్హ్ కాంబోడియా గ్రూప్, సిస్టెమా ఆసియా ఫండ్, టాన్న్‌కామ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ హెల్త్ కేర్ ఫోకస్డ్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ ఆర్బీమెడ్... పెట్టుబడులు పెట్టాయి.

  ఈ డీల్ సందర్భంగా... రిలయన్స్ రిటైల్ వెంచర్స్ డైరెక్టర్ ఈషా అంబానీ తన స్టేట్‌మెంట్‌లో... "నెట్‌మెడ్స్ కలవడం వల్ల రిలయన్స్ రిటైల్ సామర్ధ్యం పెరుగుతుంది. మరింత నాణ్యమైన హెల్త్ కేర్ వస్తువులు, సేవల్ని తక్కువ ధరకే అందించగలం. అలాగే... మా డిజిటల్ వ్యాపారాన్ని మరింత విస్తరించగలం. వినియోగదారులకు రోజువారీ కావాల్సిన వాటిని మరింత ఎక్కువగా అందించగలం" అన్నారు.

  ఈ-కామర్స్‌లో కొన్నేళ్లుగా చాలా స్టార్టప్స్ పోటీ పడుతున్నాయి. దీర్ఘకాలిక వ్యాధులకు కూడా అవి మందుల్ని డోర్ డెలివరీ చేస్తున్నాయి. నెట్‌మెడ్స్, ఫార్మ్‌ఈజీ, మెడ్‌లైఫ్, 1mg వంటివి... దూసుకెళ్తున్నాయి. ఐతే... ఈ పోటీ కారణంగా... మందులపై ఎక్కువ లాభాలు వేసుకోకుండా డెలివరీ చేస్తున్నాయి. అందువల్ల ఈ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ సాహసించలేదు. కరోనా వైరస్ వచ్చాక, పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చాలా మంది కొత్త కస్టమర్లు... ఈ యాప్స్ వాడుతూ... మందుల్ని డోర్ డెలివరీ చేయించుకుంటున్నారు. వీటి ఆర్డర్లు గత 3 నెలల్లో 50 శాతం పెరిగాయి. ఫలితంగా వచ్చే రెండేళ్లపాటూ... ఈ స్టార్టప్స్‌కి ఎలాంటి ఢోకా లేదని తేలింది.

  గత వారం అమెజాన్ ఇండియా... బెంగళూరులో ఈ-ఫార్మసీ సర్వీసులు ప్రారంభించింది. త్వరలో దేశం మొత్తం ప్రారంభించాలనుకుంటోంది. ఇప్పుడు రిలయన్స్ కూడా చేరడంతో... ఈ-ఫార్మసీ రంగం దీర్ఘ కాలం కొనసాగేందుకు వీలవ్వనుంది. పెద్ద ఎత్తున పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన జరగనుంది.

  Disclaimer: Reliance Industries (RIL), which also controls Jio Platforms, is the sole beneficiary of Independent Media Trust which controls Network18 Media & Investments.

  Published by:Krishna Kumar N
  First published:

  Tags: Reliance Industries

  ఉత్తమ కథలు