Reliance: కోవిడ్ 19 పీపీఈ వేస్ట్‌తో ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ తయారీ... సహకారం అందిస్తున్న రిలయన్స్

Reliance: కోవిడ్ 19 పీపీఈ వేస్ట్‌తో ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ తయారీ... సహకారం అందిస్తున్న రిలయన్స్

Reilance- CSIR NCL | కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వస్తున్న కోవిడ్ 19 (Covid 19) పీపీఈ వేస్ట్‌ను ప్లాస్టిక్ వస్తువులుగా మార్చే ప్రాజెక్ట్‌కు రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) సహకారం అందిస్తోంది.

  • Share this:
    రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్-RIL, పూణెలోని సీఎస్ఐఆర్ నేషనల్ కెమికల్ ల్యాబరేటరీ (CSIR-NCL), మరికొన్ని కంపెనీలు కలిసి వినూత్నమైన ప్రయత్నంతో ముందడుగు వేశాయి. కోవిడ్ 19 పీపీఈ వేస్ట్‌తో పలు రకాల ఉత్పత్తుల్ని తయారు చేస్తున్నాయి. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పీపీఈ కిట్స్ వినియోగం బాగా పెరిగింది. ఒకసారి ఉపయోగించిన కిట్ మరోసారి వాడటానికి వీల్లేదు. దీంతో పీపీఈ కిట్స్ వేస్టేజ్ బాగా పెరిగిపోయింది. ఈ వేస్ట్ మేనేజ్‌మెంట్ కూడా ఓ సమస్యగా మారింది. రిలయన్స్‌తో పాటు పలు సంస్థలు ఈ సమస్యకు పరిష్కారం కనుగొన్నాయి. కోవిడ్ 19 పీపీఈ వేస్ట్‌తో ప్లాస్టిక్ ఉత్పత్తుల్ని తయారు చేస్తున్నాయి. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్ పూణెలో చేపట్టారు. దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో పీపీఈ వేస్ట్‌ను ఉపయోగకర వస్తువుల్ని తయారు చేయడానికి ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుంది.

    Train Ticket Cancellation: రైలు టికెట్ క్యాన్సిల్ చేసేముందు ఈ రూల్స్ గుర్తుంచుకోండి

    గతేడాది ప్రారంభం నుంచి కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పర్సనల్ ప్రొటెక్టీవ్ ఎక్యూప్‌మెంట్-PPE, మాస్కులు, గ్లోవ్స్ లాంటి వాటిని ఉపయోగించడం ఎక్కువైంది. 2021 మేలో ప్రతీ రోజు ఇండియాలో కోవిడ్ 19 సంబంధిత వేస్ట్ 200 టన్నుల పైనే ఉండేది. ప్రస్తుతం ఈ ప్రమాదకరైన పీపీఈ వేస్ట్‌ను సెంట్రల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ఫెసిలిటీస్‌లో దహనం చేస్తున్నారు. ఈ దహన ప్రక్రియకు ఎక్కువ శక్తి అవసరం. అంతేకాకుండా ప్రమాదకరమైన గ్రీన్‌హౌజ్ గ్యాసెస్‌ను విడుదల చేస్తుంది.

    Health Insurance Tips: హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? క్యాష్‌లెస్‌ ఈజీగా క్లెయిమ్‌ కావాలంటే ఈ 5 టిప్స్ గుర్తుంచుకోండి

    COVID-19 PPE waste, COVID-19 PPE waste management, CSIR-NCL, plastic items with COVID-19 PPE waste, plastic products with COVID-19 PPE waste, Reliance Industries Limited, కోవిడ్ 19 పీపీఈ వేస్ట్, కోవిడ్ 19 పీపీఈ వేస్ట్ మేనేజ్‌మెంట్, ప్లాస్టిక్ ఉత్పత్తులు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్

    ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని రిలయన్స్, CSIR-NCL, ఇతర సంస్థలు చేతులు కలిపాయి. కోవిడ్ 19 ప్లాస్టిక్ వేస్ట్ ద్వారా అవసరమైన ప్లాస్టిక్ ఉత్పత్తుల్ని తయారు చేసే ప్రాజెక్ట్‌ను చేపట్టాయి. కోవిడ్ 19 పీపీఈ వేస్టేజ్‌తో కొన్ని ఉత్పత్తుల్ని కూడా విజయవంతంగా తయారు చేశాయి. ఈ పైలెట్ ప్రాజెక్ట్‌ను దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో కూడా చేపట్టడం సాధ్యమవుతుంది. ఈ పైలట్ ప్రాజెక్ట్‌ను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు రిలయన్స్, CSIR-NCL ఒప్పందం కుదుర్చుకున్నాయి. పూణెకు చెందిన కంపెనీల సహకారంతో పైలెట్ ప్రాజెక్ట్‌లో 100 కేజీల ప్లాస్టిక్ ఉత్పత్తుల్ని తయారు చేశారు.

    పూణెలోని వేస్ట్ మేనేజ్‌మెంట్ కంపెనీ అయిన పాస్కో ఎన్విరాన్‌మెంటల్ సొల్యూషన్స్ పీపీఈ కిట్స్ వేస్ట్‌ను సేకరించి కాలుష్యరహితంగా మారుస్తుంది. ఆ తర్వాత ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీ ప్రక్రియ మొదలవుతుంది. ఇందుకోసం మహారాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనుమతి కూడా తీసుకుంది CSIR-NCL. ఈ ప్రయాణంలో సీఎస్ఐఆర్-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, డెహ్రడూన్‌తో కలిసి సాంకేతిక సహకారాన్ని అందిస్తోంది రిలయన్స్. ముందుగా పీపీఈ వేస్ట్‌ను కరిగించి పెల్లెట్స్‌లా తయారు చేస్తారు. ఆ తర్వాత ఆ పెల్లెట్స్‌తో ప్లాస్టిక్ ఉత్పత్తుల్ని తయారు చేస్తారు.
    Published by:Santhosh Kumar S
    First published: