రిలయన్స్ ఇండస్ట్రీస్ రిటైల్ విభాగం ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసిజి) విభాగంలోకి అడుగుపెట్టబోతున్నట్లు కంపెనీ డైరెక్టర్ ఇషా అంబానీ 45వ ఏజీఎం మీటింగ్‌లో ప్రకటించారు. ఈ సంవత్సరం ఎఫ్ఎంసిజి వస్తువుల వ్యాపారాన్ని ప్రారంభిస్తామని ప్రకటించడానికి తాను సంతోషిస్తున్నానని ఆమె తెలిపారు. ప్రతి భారతీయుడి రోజువారీ అవసరాలను తీర్చే అధిక నాణ్యత, సరసమైన ఉత్పత్తులను అభివృద్ధి చేయడం, డెలివరీ చేయడం ఈ వ్యాపారం లక్ష్యమని ఇషా అంబానీ(Isha Ambani) అన్నారు. ఈ ముందడుగుతో రిలయన్స్ రిటైల్ దేశంలోని $110 బిలియన్ల విలువ కలిగిన పరిశ్రమలో హిందుస్థాన్ యూనిలీవర్, నెస్లే, బ్రిటానియా వంటి FMCG బెహెమోత్లతో పోటీపడుతుంది. రిలయన్స్ స్మార్ట్,(Reliance Smart) రిలయన్స్ మార్ట్, దాని ఆన్లైన్ కిరాణా ప్లాట్‌ఫారమ్ జియోమార్ట్ వంటి కంపెనీ కిరాణా చైన్ స్టోర్లలో విక్రయించబడే వివిధ ప్రైవేట్ లేబుల్‌ల ద్వారా రిలయన్స్ రిటైల్(Reliance Retail) ఇప్పటికే సెగ్మెంట్లో ఉనికిని కలిగి ఉంది.
కోలాస్, స్నాక్ టాక్ నూడుల్స్ వంటి బ్రాండ్లు కంపెనీ ద్వారా FMCG విభాగంలో కొన్ని ప్రైవేట్ లేబుల్ బ్రాండ్లు ఉన్నాయి. ప్రైవేట్ లేబుల్స్ (ఫ్యాషన్ మరియు లైఫ్‌స్టైల్ సెగ్మెంట్‌తో సహా) కంపెనీ ఆదాయానికి 65 శాతం సహకారం అందిస్తున్నాయి. ఇది కాకుండా కంపెనీ భారతదేశం అంతటా గిరిజనులు మరియు ఇతర అణగారిన వర్గాలు ఉత్పత్తి చేసే నాణ్యమైన వస్తువులను త్వరలో మార్కెటింగ్ చేయడం ప్రారంభిస్తుంది. ఈ కమ్యూనిటీలకు ఉపాధి, వ్యవస్థాపకత కోసం లాభదాయకమైన అవకాశాలను అందించడమే కాకుండా, మన సాంప్రదాయ భారతీయ కళాకారులు, ముఖ్యంగా మహిళల యొక్క అద్భుతమైన ప్రతిభ, నైపుణ్యం, విజ్ఞాన స్థావరాలను సంరక్షించడంలో సహాయపడుతుందని ఈషా అంబానీ పేర్కొన్నారు.
రిలయన్స్ రిటైల్ 2022 ఆర్థిక సంవత్సరంలో రూ. 2 లక్షల కోట్ల టర్నోవర్ మైలురాయిని దాటింది. అయితే గడిచిన సంవత్సరంలో రూ. 12,000 కోట్లు ఆదాయంతో ఆసియాలోని టాప్ టెన్ రిటైలర్లలో కంపెనీ ఒకటిగా నిలిచిందని రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ తెలిపారు. కంపెనీ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు FY22లో 4.5 బిలియన్ల మంది చూశారని ఇషా అంబానీ తెలిపారు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 2.3 రెట్లు పెరిగిందని తెలిపారు. ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి ఆర్డర్ల సంఖ్య కూడా 2.5 రెట్లు పెరిగిందని.. ప్రతిరోజూ దాదాపు ఆరు లక్షల ఆర్డర్లు డెలివరీ చేయబడతాయని ఆమె చెప్పారు.
Reliance AGM 2022: పన్ను చెల్లింపు.. ఉద్యోగాల్లో సరికొత్త రికార్డ్ సృష్టించామన్న ముఖేష్ అంబానీ
Reliance AGM 2022: 5జి రాకతో ఇంటర్నెట్ కనెక్షన్లు రెట్టింపు.. జియో చైర్మన్ ఆకాష్ అంబానీ ధీమా
మిలియన్ల కొద్దీ చిన్న వ్యాపారులతో కలిసి, వారికి అభివృద్ధి చెందడానికి ఒక వేదికను అందించాలనే తమ వ్యూహం ఇప్పుడు వాస్తవంలోకి రాబోతోందని.. రెండు సంవత్సరాల క్రితం ప్రారంభించినప్పటి నుండి తమ వ్యాపార భాగస్వాముల సంఖ్యను 20 లక్షలకు పెంచామని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా తమ ఉనికిని విస్తరించేందుకు కంపెనీ 1 కోటి మంది వ్యాపారులతో భాగస్వామిగా ఉండాలని యోచిస్తోందని ఈషా అంబానీ తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Reliance retail