Reliance Hamleys Deal: రిలయెన్స్ చేతికి 'హామ్లేస్'... పోటీపడ్డ కంపెనీలివే...

RIL Acquires Iconic British Toy-maker Hamleys | 15 ఏళ్లలో హామ్లేస్ చేతులు మారడం ఇది నాలుగో సారి. అయితే రిలయెన్స్ ఇండస్ట్రీస్ హామ్లేస్‌ను సొంతం చేసుకోవడానికి ముందు అనేక కంపెనీలు ఈ గ్లోబల్ టాయ్ మేకర్‌ కోసం ప్రయత్నించాయి. ఆ కంపెనీలు ఇవే...

news18-telugu
Updated: May 10, 2019, 12:48 PM IST
Reliance Hamleys Deal: రిలయెన్స్ చేతికి 'హామ్లేస్'... పోటీపడ్డ కంపెనీలివే...
Reliance Hamleys Deal: రిలయెన్స్ చేతికి 'హామ్లేస్'... పోటీపడ్డ కంపెనీలివే... (హామ్లేస్ స్టోర్)
news18-telugu
Updated: May 10, 2019, 12:48 PM IST
ప్రపంచంలోనే అతి పురాతనమైన టాయ్ బ్రాండ్‌గా పేరున్న 'హామ్లేస్'ను రిలయెన్స్ ఇండస్ట్రీస్ సొంతం చేసుకుంది. సీ బ్యానర్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ చేతిలో ఉన్న 259 ఏళ్ల చరిత్ర గల టాయ్ రీటైలర్‌ను 100% సొంతం చేసుకుంది రిలయెన్స్. చాలాకాలంగా చర్చల్లో ఉన్న డీల్ పూర్తి కావడంతో గురువారం ముఖేష్ అంబానీకి చెందిన రిలయెన్స్ ఇండస్ట్రీ... ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. 67.96 మిలియన్ పౌండ్స్ అంటే సుమారు రూ.620 కోట్ల డీల్ ఇది. హామ్లేస్‌కు 18 దేశాల్లో 167 స్టోర్లు ఉన్నాయి. 15 ఏళ్లలో హామ్లేస్ చేతులు మారడం ఇది నాలుగో సారి. అయితే రిలయెన్స్ ఇండస్ట్రీస్ హామ్లేస్‌ను సొంతం చేసుకోవడానికి ముందు అనేక కంపెనీలు ఈ గ్లోబల్ టాయ్ మేకర్‌ కోసం ప్రయత్నించాయి. ఆ కంపెనీలు ఇవే...

Read this: 259 ఏళ్ల బ్రిటీష్ టాయ్‌మేకర్ 'హామ్లేస్‌'ను సొంతం చేసుకున్న రిలయెన్స్

Hamleys, london, mukesh ambani, Reliance Industries, Hamleys Reliance, Hamleys toys, India, mukesh ambani, reliance, Reliance Brands, Reliance Industries Ltd, Reliance Industries Ltd stocks, Reliance Share, stocks, United Kingdom, హామ్లేస్, లండన్, ముఖేష్ అంబానీ, రిలయెన్స్ ఇండస్ట్రీస్, హామ్లేస్ రిలయెన్స్, హామ్లేస్ టాయ్స్, ఇండియా, ముఖేష్ అంబానీ, రిలయెన్స్, రిలయెన్స్ బ్రాండ్స్, రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ స్టాక్స్, రిలయెన్స్ షేర్, స్టాక్స్, యూకే
హామ్లేస్ లోగో


1. మైక్ ఆష్లే... యూకేలో అతిపెద్ద స్పోర్ట్స్ గూడ్స్ రీటైలర్ స్పోర్ట్స్ డైరెక్ట్ ఫౌండర్. హామ్లేస్‌ను సొంతం చేసుకోవడానికి మైక్ ఆష్లే ప్రయత్నించారు. ఆష్లే బ్రిటీష్ బిలియనీర్ రీటైల్ ఆంట్రప్రెన్యూర్. 2018లో హౌజ్ ఆఫ్ ఫ్రేసర్‌ను 90 మిలియన్ పౌండ్లకు సొంతం చేసుకొని యూకేలో డిపార్ట్‌మెంట్ స్టోర్ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు.



2. ది ఎంటర్‌టైనర్, యూకేలో అతిపెద్ద టాయ్ రీటైలర్. గేరీ గ్రాంట్ ఈ సంస్థ ఫౌండర్. హామ్లేస్‌ను సొంతం చేసుకోవడానికి ప్రయత్నించారు. ది ఎంటర్‌టైనర్‌కు యూకేలో 144 టాయ్ షాప్స్ ఉన్నాయి. ఇటీవల స్పెయిన్‌లో 55 టాయ్ షాప్స్ చెయిన్ అయిన పోలీతో పాటు, యూకేలో 80, అంతర్జాతీయంగా 400 మదర్ కేర్ స్టోర్స్‌ని ఆపరేట్ చేస్తున్న ఎర్లీ లెర్నింగ్ సెంటర్‌ను సొంతం చేసుకుంది ది ఎంటర్‌టైనర్.

3. ఐరిష్ టాయ్ షాప్ చెయిన్ స్మిత్స్ కూడా హామ్లేస్ కోసం పోటీపడింది. ఐర్లాండ్, యూకేలో స్మిత్స్‌కు 110 స్టోర్లు ఉన్నాయి. స్మిత్ కుటుంబం వీటిని నిర్వహిస్తోంది.

Photos: సెల్ఫీ కెమెరా 32 మెగాపిక్సెల్‌... ఆకట్టుకుంటున్న రెడ్‌మీ వై3
Loading...

ఇవి కూడా చదవండి:

Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్‌లో మరోసారి బిగ్ షాపింగ్ డేస్ సేల్... ఆఫర్లు ఇవే

WhatsApp: ఈ ఫోన్లలో వాట్సప్ పనిచేయదు... ఫోన్ మార్చాల్సిందే

PAN Card: పాన్ కార్డు దరఖాస్తులో చేయకూడని 10 తప్పులివే...
First published: May 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...