ప్రస్తుతం భారతదేశాన్ని కరోనా వైరస్ వణికిస్తున్న సంగతి తెలిసిందే. దేశమంతా కరోనా వైరస్‌పై పోరాడుతోంది. ఈ పోరాటంలో రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కూడా భాగస్వామిగా నిలుస్తోంది. #CoronaHaaregaIndiaJeetega పేరుతో పలు చర్యలు చేపట్టింది. రిలయెన్స్ ఫౌండేషన్, రిలయెన్స్ రీటైల్, జియో, రిలయెన్స్ లైఫ్ సైన్సెస్, రిలయెన్స్ ఇండస్ట్రీస్‌తో పాటు ఇందులో పనిచేసే 6,00,000 మంది రిలయెన్స్ కుటుంబ సభ్యులు కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి యాక్షన్ ప్లాన్ రూపొందించారు.
కేవలం కోవిడ్-19 పేషెంట్ల కోసం రెండు వారాల్లో భారతదేశంలో మొదటి ఆస్పత్రిని బీఎంసీ సహకారంతో ఏర్పాటు చేసింది సర్ హెచ్ ఎన్ రిలయెన్స్ ఫౌండేషన్ హాస్పిటల్. ముంబైలోని సెవెన్ హిల్స్‌లో 100 పడకల ఆస్పత్రి ఇది. కోవిడ్-19 పాజిటివ్ పేషెంట్ల కోసం ఈ ఆస్పత్రి ఏర్పాటైంది. పూర్తిగా రిలయెన్స్ ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన ఆస్పత్రి. అన్ని బెడ్స్‌కి కావాల్సిన వెంటిలేటర్స్, పేస్‌మేకర్స్, డయాలిసిస్ మెషీన్, పేషెంట్ మానిటరింగ్ డివైజ్‌లు ఉన్నాయి.
ఇక సర్ హెచ్ ఎన్ రిలయెన్స్ ఫౌండేషన్ హాస్పిటల్‌లో క్వారెంటైన ట్రావెలర్స్‌కి ప్రత్యేకమైన సదుపాయాలున్నాయి. ఇన్ఫెక్ట్ అయిన పేషెంట్లకు చికిత్స అందించేందుకు ఐసోలేషన్ ఏర్పాట్లున్నాయి. ఇక పలు ఎన్‌జీఓలతో కలిసి ఉచితంగా భోజనాన్ని అందిస్తోంది రిలయెన్స్ ఫౌండేషన్. మహారాష్ట్రలోని లోధివలిలో ఐసోలేషన్ ఫెసిలిటీ ఏర్పాటు చేసింది రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్.
పరీక్షలు నిర్వహించేందుకు రిలయెన్స్ లైఫ్ సైన్సెస్ అదనంగా టెస్టింగ్ కిట్స్‌ని ఇంపోర్ట్ చేసుకుంటోంది. వైద్యులు, పరిశోధకులు ఓవర్ టైమ్ చేస్తూ సేవలు అందిస్తున్నారు.
హెల్త్ వర్కర్లకు పర్సనల్ ప్రొటెక్టీవ్ సూట్లు, మాస్కుల్ని అందిస్తోంది రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. రోజుకు 1,00,000 ఫేస్ మాస్కుల్ని తయారు చేయించి ఇస్తోంది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5 కోట్ల విరాళాన్ని ప్రకటించింది ఆర్ఐఎల్.
ప్రస్తుతం అనేక చోట్ల లాక్‌డౌన్ ఉండటంతో స్నేహితులు, కుటుంబాలు, వ్యాపారులు, సహోద్యోగులు కలుసుకునే పరిస్థితి లేదు. అలాంటి వారి కోసం #CoronaHaaregaIndiaJeetega పేరుతో కార్యక్రమాన్ని చేపట్టింది జియో. మైక్రోసాఫ్ట్ టీమ్స్‌తో కలిసి ఆఫీస్ 365 లో యూనిఫైడ్ కమ్యూనికేషన్ అండ్ కొలాబరేషన్ హబ్ రూపొందించింది. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కూడా ప్రొఫెషనల్ జీవితానికి దూరం కాకుండా చేసిన ప్రయత్నమిది.
సింప్టమ్ చెకర్ ద్వారా యూజర్లు ఇంట్లోనే కరోనా లక్షణాలను చెక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. అంతేకాదు... ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ పరిస్థితిపై రియల్‌టైమ్ అప్‌డేట్స్ ఇస్తోంది. ఇక జియో హాప్టిక్ కలిసి మైగవ్ కరోనా హెల్ప్‌డెస్క్ ప్రారంభించడం విశేషం. కరోనావైరస్‌పై ప్రచారంలో ఉన్న అవాస్తవాలు, తప్పుడు వార్తలపై సమాచారం తెలుసుకోవచ్చు. ఇక రియల్‌టైమ్‌లో డాక్టర్లు, ఫిజీషియన్లతో ఇంట్లోంచే మెడికల్ కన్సల్టేషన్ చేయొచ్చు. ఛాట్, వీడియో, వాయిస్, హెల్త్‌కేర్ టూల్స్ అన్నీ ఒకే చోట అందుబాటులో ఉంటాయి.
వీడియో కాలింగ్ ద్వారా విద్యార్థులకు టీచర్లు పాఠాలు చెప్పేలా క్లాస్‌రూమ్ సెషన్స్, డాక్యుమెంట్, స్క్రీన్ షేరింగ్, రియల్‌టైమ్‌లో సందేహాలు తీర్చుకోవడం లాంటి వాటిని సాధ్యం చేసింది జియో. అన్ని పాఠాలను స్టోర్ చేసుకునేందుకు ఇండివిజువల్, టీమ్స్‌కు ఉచిత స్టోరేజీతో కమ్యూనికేషన్స్ హబ్ ఏర్పాటు చేసింది.
ప్రస్తుతం లక్షలాది మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. వారందరూ మాట్లాడుకోవడానికి రిమోట్ ఆడియో, వీడియో మీటింగ్స్ ఏర్పాటు చేయడమే కాకుండా, ఫైల్స్ షేర్ చేసుకునేందుకు ప్రత్యేకమైన వ్యవస్థ రూపొందించింది. మీటింగ్ రికార్డింగ్, స్క్రీన్ షేరింగ్ లాంటి ఏర్పాట్లు చేసింది.
ఇక జియోఫైబర్, జియోఫైతో పాటు మొబిలిటీ సర్వీస్ ద్వారా ఇంటర్నెట్ సేవల్ని అందిస్తోంది జియో. బేసిక్ జియోఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ(10 ఎంబీపీఎస్) ప్లాన్‌ను ఎలాంటిసర్వీస్ ఛార్జీ లేకుండా అందిస్తోంది జియో. హోమ్ గేట్‌వే రౌటర్లను కనీస రీఫండబుల్ డిపాజిట్‌తో అందిస్తోంది. జియోఫైబర్ సబ్‌స్క్రైబర్లందరికీ అన్ని ప్లాన్స్‌పై డబుల్ డేటా అందిస్తోంది.
ఇక మొబైల్స్ విషాయానికొస్తే ఇప్పడికే 4 జీ డేటా యాడ్ ఆన్ ఓచర్లపై డబుల్ డేటా అందిస్తోంది జియో. వాటికి నాన్ జియో వాయిస్ కాల్స్ అదనంగా అందిస్తోంది. ఈ సేవలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం మై జియో యాప్ లేదా www.jio.com/jiotogether వెబ్‌సైట్ చూడొచ్చు.
కోవిడ్-19 పేషెంట్లను తరలించే ఎమర్జెన్సీ సర్వీస్ వాహనాలకు ఉచితంగా పెట్రోల్, డీజిల్ అందిస్తోంది రిలయెన్స్.
దేశవ్యాప్తంగా ఉన్న 736 రిలయెన్స్ రీటైల్ గ్రాసరీ స్టోర్‌లో ప్రజలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు, బ్రెడ్ లాంటివన్నీ అందుబాటులో ఉంచుతుంది. వీటి కొరత లేకుండా చూస్తోంది. ఈ గ్రాసరీ స్టోర్‌లు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు తెరిచే ఉంటాయి. స్టోర్లలో సిబ్బంది ప్రమేయాన్ని తగ్గిస్తూ కస్టమర్లకు సరుకుల్ని అందించేలా ఏర్పాట్లు చేశారు. వృద్ధులు ఇంటి నుంచే సరుకులు ఆర్డర్ చేస్తే డోర్ డెలివరీ సదుపాయాన్ని అందిస్తున్నారు.
లాక్‌డౌన్ ఉన్న ప్రాంతాల్లో కస్టమర్ల ఇంటికే సరుకుల్ని తీసుకెళ్లి ఇచ్చేందుకు వాహనాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ రేట్ల ప్రకారమే రిలయెన్స్ రీటైల్ ఔట్‌లెట్స్‌లో శానిటైజర్లు, ఇతర హైజిన్ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. అన్ని పెట్రోల్ బంకులు ఇంధనం కొరత లేకుండా ఉన్నాయి. మాస్కులు ధరించడంతో పాటు పరిశుభ్రతను పాటించేలా సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఇక www.Reliancedigital.in వెబ్‌సైట్‌లో వర్క్ ఫ్రమ్ హోమ్ సొల్యూషన్స్ చూడొచ్చు.
ఈ సంక్షోభ సమయంలో రిలయెన్స్ కుటుంబంలోని ఉద్యోగులందరూ సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకుంటోంది రిలయెన్స్. కాంట్రాక్ట్, టెంపరరీ ఉద్యోగులు పనిచేయకపోయినా వేతనాన్ని అందిస్తోంది. రూ.30,000 లోపు జీతాలు ఉన్నవారికి నెలకు రెండు సార్లు వేతనాన్ని ఇవ్వనుంది. ముఖ్యమైన బాధ్యతల్లో ఉన్నవారు తప్ప మిగతా ఉద్యోగులందరితో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయిస్తోంది.
ఇవి కూడా చదవండి:
Jio Work From Home Plan: రిలయెన్స్ జియో నుంచి 'వర్క్ ఫ్రమ్ హోమ్' ప్లాన్... లాభాలివే
Reliance Jio: గుడ్ న్యూస్... జియో యూజర్లకు డబుల్ డేటా
Coronavirus: రూ.2000, రూ.500, రూ.200 నోట్లతో కరోనా వైరస్... ఎస్‌బీఐ పరిశోధన
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jio, Jio fiber, JIOFI, Reliance, Reliance Digital, Reliance Industries, Reliance Jio