Home /News /business /

RELIANCE INDUSTRIES DIRECTOR NITA AMBANI ON VIACOM18 BAGGING IPL DIGITAL RIGHTS SAYS PROUD TO BE DEEPENING OUR ASSOCIATION WITH WONDERFUL CRICKET LEAGUE IPL SK

Nita Ambani: ఐపీఎల్‌ను ప్రపంచంలోని ప్రతి క్రికెట్ ప్రేమికుడి వద్దకు తీసుకెళ్తాం: నీతా అంబానీ

నీతా అంబానీ

నీతా అంబానీ

Nita Ambani: దేశంతో పాటు ప్రపంచంలోని ప్రతి క్రికెట్ ప్రేమికుడికి ఐపీఎల్‌ను తీసుకెళ్లాలని కంపెనీ కోరుకుంటున్నట్లు నీతా అంబానీ చెప్పారు. ప్రపంచ స్థాయి IPL కవరేజీని సృష్టించడమే తమ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.

    ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి క్రికెట్ ప్రేమికుడి వద్దకు ఐపీఎల్‌ (Indian Premier League) ను తీసుకెళ్లడమే తమ లక్ష్యమని రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) డైరెక్టర్ నీతా అంబానీ (Nita Ambani) తెలిపారు. IPL యొక్క డిజిటల్ మీడియా హక్కులను వచ్చే ఐదేళ్లకు (2023 నుండి 2027 వరకు).. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన Viacom18 నెట్‌వర్క్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ భారీ ఒప్పందంపై నీతా అంబానీ మాట్లాడారు. దేశంతో పాటు ప్రపంచంలోని ప్రతి క్రికెట్ ప్రేమికుడికి ఐపీఎల్‌ను తీసుకెళ్లాలని కంపెనీ కోరుకుంటున్నట్లు ఆమె చెప్పారు. ప్రపంచ స్థాయి IPL కవరేజీని సృష్టించడమే తమ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. భారతదేశంలో ఐపీఎల్‌ అత్యుత్తమంగా ప్రాతినిధ్యం వహిస్తుందని... ప్రస్తుతం డిజిటల్ విప్లవం కొనసాగుతున్న మన దేశంలో ప్రతి గడపకూ ఐపీఎల్ (IPL) టోర్నమెంట్ చేరుతుందని తెలిపారు.

    నక్క తోక తొక్కిన బీసీసీఐ.. ఒక్క ఓవర్ కి ఇన్ని కోట్లా.. ఈ లెక్కలేంటి బాసూ..!

    ''క్రీడలు మమ్మల్ని అలరిస్తాయి. స్ఫూర్తిని నింపుతాయి. మనందరినీ ఒక్కటి చేస్తాయి. భారతదేశం, క్రీడలలో క్రికెట్, IPL అత్యుత్తమ ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. అందుకే ఈ గొప్ప క్రీడ, అద్భుతమైన లీగ్‌తో మా అనుబంధాన్ని మరింతగా పెంచుకోవడం మాకు గర్వకారణం. మనదేశం లేదా ప్రపంచంలో ఏ ప్రాంతంలో ఉన్నా సరే.. క్రికెట్ ప్రేమికులకు సంతోషకరమైన ఐపీఎల్ అనుభవాన్ని ఇవ్వడమే మా లక్ష్యం.'' అని నీతా అంబానీ పేర్కొన్నారు.



    ఐపిఎల్ మీడియా హక్కుల ప్యాకేజీ బి (డిజిటల్ మీడియా) కోసం వయాకామ్ 18 మంగళవారం విజయవంతంగా రూ. 20,500 కోట్లకు బిడ్ చేసింది. ఇది ఒక్కో మ్యాచ్‌కు రూ.50 కోట్లు. మొత్తం 410 మ్యాచ్‌లకు చెల్లించాల్సి ఉంటుంది. Viacom18 తదుపరి 5 సంవత్సరాలలో (2023 నుండి 2027 వరకు) ప్రతి IPL మ్యాచ్‌ను ఆన్‌లైన్‌లో ప్రసారం చేయడమే కాకుండా NBA, లా లిగాతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ స్పోర్ట్స్ లీగ్‌లను కూడా ప్రసారం చేస్తుంది. IPL డిజిటల్ మీడియా హక్కులను కొనుగోలు చేయడంతో.. Viacom18 ఇప్పుడు క్రికెట్ ప్రసార ప్రపంచంలోకి కూడా ప్రవేశించింది. ఈ ఒప్పందంతో వయాకమ్ 18 దేశంలోని ప్రముఖ క్రీడా వేదికల్లో ఒకటిగా నిలిచింది.

    Rishabh Pant : బాబు పంత్ ఇలా అయితే కష్టమే సుమీ.. ఈ లెక్కలు చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది..!

    ప్రపంచవ్యాప్తంగా Viacom18 క్రికెట్ క్రికెట్ దేశాలతో సహా ఐదు అంతర్జాతీయ ప్రాంతాలలో మూడింట TV, డిజిటల్ హక్కులను పొందింది. ఈ ప్రఖ్యాత నెట్‌వర్క్ రూ. 3,273 కోట్ల బిడ్‌తో 'ప్యాకేజీ సి'ని కూడా కొనుగోలు చేసింది. Sports18 టీవీ ఛానెల్, Voot డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌తో.. Viacom18 స్పోర్ట్స్.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉత్తమ క్రీడలకు కొత్త గమ్యస్థానంగా ఉంది. ఇక్కడ క్రీడా ప్రియులు FIFA వరల్డ్ కప్ ఖతార్ 2022, NBA, లా లిగా, Ligue 1, సీరీ Aతో పాటు ఇతర అగ్ర ATP, BWP ఈవెంట్‌లను వీక్షించవచ్చు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Cricket, Indian premier league, IPL, Nita Ambani, Reliance, Sports

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు