భారతదేశంలోనే అతిపెద్ద, అత్యంత ప్రతిష్టాత్మక బహుముఖ డెస్టినేషన్ అయిన జియో వరల్డ్ సెంటర్(Jio World Center)ని శుక్రవారం ప్రారంభించారు రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్(Reliance Industries Director), రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్ పర్సన్ నీతా అంబానీ(Nita Ambani). దేశ ఆర్ధిక రాజధాని ముంబైలోని బాంద్రా (Bandra)కుర్లా కాంప్లెక్స్(Kurla Complex)లో 18.5 ఎకరాల విస్తీర్ణంలో దేశానికి, పౌరులకి ప్రపంచ స్థాయి గుర్తింపునిచ్చే విధంగా ఈ వరల్డ్ సెంటర్‌ను నిర్మించింది జియో రిలయన్స్ సంస్థ. ముంబై నగరంలోని మ్యూజికల్ ఫౌంటైన్ ఆఫ్ జాయ్(Fountain of joy)తో ఆవిష్కరించి భారతదేశంలోని అతిపెద్ద, అత్యుత్తమ జియోవరల్డ్ కన్వెన్షన్ సెంటర్, జియో వరల్డ్ సెంటర్లని వచ్చే ఏడాది నుంచి దశలవారీగా ప్రారంభించనుంది జియో రిలయన్స్. జియో వరల్డ్ సెంటర్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ నీతా అంబానీ ఆలోచనలకు అనుగూణంగా భారతదేశంలోని అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్‌గా రూపుదిద్దుకుంది. ముంబై నగరానికి అంకితం చేసిన ఫౌంటైన్ ఆఫ్ జాయ్ దగ్గర ఉపాధ్యాయులకు గౌరవ ప్రదర్శనతో ఇది ప్రారంభించబడింది. ఇండియన్ ఫస్ట్ డెస్టినేషన్ జియో వరల్డ్ సెంటర్‌లో సాంస్కృతిక కేంద్రం, మ్యూజికల్ ఫౌంటెన్, ఉన్నత స్థాయి రిటైల్ అనుభవం, కెఫెలు, చక్కటి డైనింగ్ రెస్టారెంట్లు, సర్వీస్డ్ అపార్ట్మెంట్లు, ఆఫీసులు, అత్యాధునిక కన్వెన్షన్ ఫెసిలిటీ ఉన్నాయి.ముంబై కేంద్రంగా జియో రిలయన్స్ ఇండస్ట్రీస్ వరల్డ్ సెంటర్ నిర్మాణం కోసం తన దార్శనికతను పంచుకున్న నీతా అంబానీ ఇది భారతదేశానికి ప్రతిబింబంగా నిలుస్తుందన్నారు. అంతే కాదు నూతన భారతదేశ ఆకాంక్షలకు నెరవేర్చేందుకు దోహదపడుతుందన్నారు. అతిపెద్ద సమావేశాల నుండి సాంస్కృతిక అనుభవాలు, పాత్ బ్రేకింగ్ రిటైల్, భోజన సౌకర్యాల వరకు జియో వరల్డ్ సెంటర్ ప్రారంభంతో ముంబైకి కొత్త కళ వస్తుందన్నారు నీతా అంబానీ. ఇది భారతదేశం వృద్ధిలో ఒక కొత్త అధ్యాయానికి నాంది అవుతుందన్నారు.
ధీరూభాయ్ అంబానీ స్క్వేర్..
ముంబై నగరంలో ఒక కొత్త మైలురాయిగా నిలిచిన ధీరూభాయ్ అంబానీ స్క్వేర్ రిలయన్స్ వ్యవస్థాపకులు ధీరూభాయ్ అంబానీతో పాటు ముంబై నగరానికి అంకితం ఇవ్వడం జరిగింది. పర్యాటకులు, స్థానికులు తప్పక చూడాల్సిన ప్రదేశంగా ధీరూభాయ్ అంబానీ స్క్వేర్ నిలుస్తుందన్నారు నీతా అంబానీ. అందరూ తిలకించే విధంగా ఉచిత ప్రవేశంతో సర్వాంగ హంగులతో ధీరూభాయ్ అంబానీ స్క్వేర్ రూపుదిద్దుకుందని తెలిపారు నీతా అంబానీ. దీరూభాయ్ స్క్వేర్ ఫౌంటైన్ ఆఫ్ జాయ్ చుట్టూ కేంద్రీకృతమైన ఉంటుంది. ఫౌంటైన్ ఆఫ్ జాయ్‌లో ఎంతో అద్భుతంగా మ్యూజికల్ వాటర్ లైట్స్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫౌంటైన్ భారతదేశాన్ని గుర్తుచేసే అనేక రంగులకి చిహ్నంగా ఉంటుంది. ఇందులో ఎనిమిది ఫైర్ షూటర్లు, 392 వాటర్ జెట్లు, 600కు పైగా ఎల్ఈడీ లైట్లు ఉంటాయి. ఇవి సంగీతానికి అనుగుణంగా నృత్యం చేసే వికసిస్తున్న తామర రేకులతో మరపురాని ప్రదర్శనను సృష్టిస్తాయి.
ముంబై నగరానికి, ప్రజలకు అంకితం..
మ్యూజికల్ ఫౌంటెన్‌ని ప్రారంభించిన అనంతరం రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్, రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్ పర్సన్ నీతా అంబానీ మాట్లాడుతూ ధీరూభాయ్ అంబానీ స్క్వేర్, ప్రపంచ స్థాయి ఫౌంటైన్ ఆఫ్ జాయ్‌ని ముంబై ప్రజలతో పాటు నగరానికి అంకితం చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా గర్వంగా ఉందన్నారు. నగరస్ఫూర్తిని పురస్కరించుకుని ఇది ప్రజలు ఆనందాలని పంచుకునేందుకు రంగుల విద్యుత్ కాంతుల మధ్య మ్యూజిక్‌ని ఆస్వాదించే ప్రదేశంగా మారుతుందన్నారు. ఈస్క్వేర్ ప్రారంభోత్సవం రోజున ఉపాధ్యాయులకు ప్రత్యేక గౌరవ ప్రదర్శన ఇవ్వడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు నీతా అంబానీ. తాను కూడా ఉపాధ్యాయురాలిని కావడంతో ఇలాంటి కష్ట సమయంలో అవిశ్రాంతంగా పనిచేసినందుకు, జ్ఞానాన్ని పంచుతున్నందుకు మా ఉపాధ్యాయులకి తాను ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ప్రకటించారు. గత రెండేళ్ల కాలంలో జ్ఞానాన్ని పంచినందుకు, తర్వాతి తరాలలో కూడా మన దేశం ఈ దిశగా ప్రయాణించడానికి కొత్త బోధనా పద్ధతులకి అనుగుణంగా వారు చేసిన కృషికి గౌరవసూచకంగా ముంబై అంతటా బీఎంసీ పాఠశాలలు, ఇతర పాఠశాలలకు చెందిన 250 మందికిపైగా ఉపాధ్యాయులని ప్రారంభ ప్రదర్శనకి ఆహ్వానించారు. ఇక ఈ ధీరూభాయ్ అంబానీ స్వ్కేర్ ప్రతిరోజూ సాయంత్రం ప్రదర్శనలతో తెరుచుకుంటుంది. ఆన్‌లైన్‌లో dhirubhaiambanisquare.comలో ఉచిత ఎంట్రీ పాస్‌లను బుక్ చేసుకోవచ్చు.
జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్..
జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ దేశంలోనే అత్యుత్తమ అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్‌తో పాటు ఎగ్జిబిషన్ సౌకర్యాలను అందిస్తుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ కన్వెన్షన్, ఎగ్జిబిషన్స్ ఎకో సిస్టమ్‌లో భారతదేశాన్ని ముందంజలో నిలపాలని లక్ష్యంగా పెట్టుకుంది. జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ భారతదేశంతో పాటు ముంబై నగరానికి శాశ్వత సహాయకారిగా ఉండనుంది. జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్… వినియోగదారుల ప్రదర్శనలు, సమావేశాలు, ప్రదర్శనలు, మెగా కచేరీలు, గొప్ప విందులు, వివాహాలతో సహా విశిష్ట వ్యాపార , సామాజిక కార్యక్రమాలకు భారతదేశంలోనే అతి పెద్ద వేదికగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మల్టీ డైమెన్షనల్ వేదిక భారతదేశంలో సాంకేతికతతో కూడిన పరివర్తనాత్మక ప్రదేశాలతో ప్రపంచ ప్రమాణాలను సెట్ చేస్తుంది.
జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ ప్రత్యేకతలు..
జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌ను 16,1460 చదరపు అడుగుల విస్తీర్ణంలో 3 ఎగ్జిబిషన్ హాళ్లు 16,500 మంది అతిథులకు సదుపాయం కల్పించే విధంగా నిర్మించబడింది. 10,7640 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న రెండు కాన్ఫరెన్స్ హాళ్లు 10,640 మంది అతిథులకు వసతి కల్పించేలా రూపొందించారు. 32,290 చదరపు అడుగుల సువిశాలమైన బాల్ రూమ్ 3200 మంది అతిథులకు చోటు కల్పించనుంది. 29,062 చదరపు అడుగుల మొత్తం వైశాల్యంతో 25 సమావేశ గదులు అన్ని లెవెల్స్ లో 13, 9930 చదరపు అడుగుల వైశాల్యం గల ప్రీ-ఫంక్షన్ కాన్కోర్స్ అత్యాధునిక 5G నెట్‌వర్క్ సాయంతో హైబ్రిడ్ , డిజిటల్ అనుభవం కలిగిన 18,000 మంది మించి భోజనాలను తయారు చేసే అతి పెద్ద కిచెన్‌తో పాటు కన్వెన్షన్ సెంటర్‌లో 5,000 కార్ల పార్కింగ్ సామర్థ్యం ఏర్పాటు చేయడమైనది. భారతదేశంలో అతిపెద్ద ఆన్ సైట్ పార్కింగ్ సదుపాయం కలిగిన ఏకైక కన్వెన్షన్ సెంటర్‌గా నిర్మించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jio, Nita Ambani, Reliance Jio