హోమ్ /వార్తలు /బిజినెస్ /

సరికొత్త రికార్డు సృష్టించిన రిలయన్స్ ఇండస్ట్రీస్.. దేశంలోనే తొలి కంపెనీ

సరికొత్త రికార్డు సృష్టించిన రిలయన్స్ ఇండస్ట్రీస్.. దేశంలోనే తొలి కంపెనీ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రిలయన్స్ తర్వాత అత్యధిక మార్కెట్ క్యాపిటల్ కలిగిన సంస్థలుగా టీసీఎస్ హెచ్‌డీఎఫ్‌సీ నిలిచాయి.

భారత మార్కెట్‌లో రిలయన్స్ దూకుడు కొనసాగుతోంది. రూ.12 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాపిటల్‌ను దాటి రిలయన్స్ ఇండస్ట్రీస్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ మార్కును టచ్ చేసి భారత దేశంలోనే అతి పెద్ద కంపెనీగా అవతరించింది. ఇప్పటి వరకు ఏ ఇతర కంపెనీ ఈ మార్క్‌ను చేరుకోలేదు. సోమవారం NSEలో కంపెనీ షేర్ రూ.1855 వద్ద ముగిసింది. 3.75 శాతం లాభాన్ని అర్జించడంతో రిలయన్స్ మార్కెట్ క్యాపిటల్ రూ.11.76 లక్షల కోట్లకు చేరింది. అమెరికన్ డాలర్స్ పరంగా చూస్తే రిలయన్స్ కంపెనీ ప్రస్తుత విలువ 157.7 బిలియన్ డాలర్లుగా ఉంది.

ఇక రిలయన్స్ పీపీ షేర్ వ్యాల్యూ సోమవారం రూ.957 వద్ద ముగిసింది. 8.6శాతం లాభాలతో 42.26 కోట్ల పార్ట్లీ పెయిడ్ అప్ షేర్స్ కలిగిన రిలయన్స్ పీపీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.40,442 కోట్లుకు చేరింది. దాంతో రిలయన్స్ సమిష్టి మార్కెట్ క్యాపిటల్ రూ.12.16 లక్షల కోట్లకు(160 బిలియన్ డాలర్లు) చేరింది. అటు రిలయన్స్ కంపెనీ డిజిటల్ సబ్సిడరీ సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి ఇటీవల పెట్టుబడుల వరద పారింది. ఫేస్‌బుక్, సిల్వర్ లేక్, విస్తా ఈక్విటీ, జనరల్ అట్లాంటిక్, కేకేఆర్, ముబదాలా, ఆడియా, టీపీజీ, ఎల్ కాటెర్టన్, పీఐఎఫ్, ఇంటెల సంస్థల పెట్టబడులతో జియో రూ.1,17,588.45 కోట్లను సమీకరించింది. రిలయన్స్ తర్వాత అత్యధిక మార్కెట్ క్యాపిటల్ కలిగిన సంస్థలుగా టీసీఎస్ హెచ్‌డీఎఫ్‌సీ నిలిచాయి.

First published:

Tags: Business, Mukesh Ambani, Reliance, Reliance Jio

ఉత్తమ కథలు