• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • RELIANCE INDUSTRIES CMD MUKESH AMBANI CONGRATULATED AND SHARES HIS EXPERIENCES FOR ENTERPRENEURS AK

Mukesh Ambani: అలా ముందుకెళ్లండి.. ఎంట్రప్రెన్యూర్స్‌కు ముఖేష్ అంబానీ కీలక సలహా

Mukesh Ambani: అలా ముందుకెళ్లండి.. ఎంట్రప్రెన్యూర్స్‌కు ముఖేష్ అంబానీ కీలక సలహా

ముఖేష్ అంబానీ, రిలయన్స్ అధినేత

Mukesh Ambani: మన ఆర్థిక వ్యవస్థను మార్చేందుకు అనేక కొత్త టెక్నాలజీలతో కూడిన విప్లవాత్మక శక్తి ఉందని రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ ముఖేష్ అంబానీ వ్యాఖ్యానించారు.

  • Share this:
    దేశంలోని ఎంట్రప్రెన్యూర్స్‌కు ఎన్నో అవకాశాలు ఉన్నాయని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అన్నారు. ఎంట్రప్రెన్యూర్స్‌ ఆఫ్ ది ఇయర్స్ అవార్డ్స్ 2020 కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. వారికి పలు కీలక సూచనల చేశారు. దేశంలో ప్రైవేటు రంగం ఎంతగానో విస్తరిస్తోందని.. ఈ విషయంలో దేశ ప్రధాని నరేంద్రమోదీ కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన తెలిపారు. మన ఆర్థిక వ్యవస్థను మార్చేందుకు అనేక కొత్త టెక్నాలజీలతో కూడిన విప్లవాత్మక శక్తి ఉందని వ్యాఖ్యానించారు. దేశంలోని 130 కోట్ల ప్రజలకు క్వాలిటీతో కూడిన జీవితాన్ని అందించేందుకు చిన్న, మధ్య, పెద్ద తరహా వ్యాపారాలు ఎంతగానో దోహదం చేస్తాయని తెలిపారు. రాబోయే దశాబ్దాల్లో భారత్‌కు ప్రపంచంలో మూడు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిచే సత్తా ఉందని ముఖేష్ అంబానీ అభిప్రాయపడ్డారు.

    ఆరోగ్య రంగం, లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ, పారిశ్రామిక రంగం, మారుతున్న వ్యవసాయ రంగంతోపాటు సేవా రంగంలో విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. మన దేశానికి చెందిన ఎంట్రప్రెన్యూర్స్‌కు మంచి క్వాలిటీతో కూడిన ఉత్పత్తులు, సేవలు అందించే సత్తా ఉందని అన్నారు. ఈ అంశం గ్లోబల్ మార్కెట్‌ మన ఎంట్రప్రెన్యూర్స్‌ను ఆకర్షించేదని అన్నారు. మన ఎంట్రప్రెన్యూర్స్‌కు దేశీయ మార్కెట్లకు సరిపోయే ఉత్పత్తులు సేవలు అందించడంతో పాటు ప్రపంచ మార్కెట్‌కు విస్తరించే బహుళ అవకాశం ఉందని ముఖేష్ అంబానీ గుర్తు చేశారు.

    కొత్త ఎంట్రప్రెన్యూర్స్‌ను ఉద్దేశించి మాట్లాడిన ముఖేష్ అంబానీ వారికి పలు కీలక సలహాలు ఇచ్చారు. ఉన్న వనరుల్లో అపారమైన నైపుణ్యం కనబరిచేలా పని చేయాలని అన్నారు. అనేక వైఫల్యాల తరువాతే విజయాలు ఉంటాయని ఆయన గుర్తు చేశారు. తన తరం ఎంట్రప్రెన్యూర్స్‌ కంటే ఈ తరం ఎంట్రప్రెన్యూర్స్‌ మంచి విజయాలు సాధిస్తారని ముఖేష్ అంబానీ ఆశాభావం వ్యక్తం చేశారు.
    Published by:Kishore Akkaladevi
    First published: