Reliance Industries | ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) వ్యాపార ప్రపంచంలో ఎన్నో అరుదైన ఘనతలను సొంతం చేసుకుంటున్నారు. తాజాగా ఆయన మరో రికార్డు సొంతం చేసుకున్నారు. బ్రాండ్ ఫైనాన్స్ రూపొందించిన టాప్ 100 బ్రాండ్ గార్డియన్స్ 2023 (Top 100 Brand Guardians 2023) లిస్టులో రెండో స్థానం దక్కించుకున్నారు. ఈ లిస్ట్‌లో సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ (Sundar Pichai), పునిత్ రెంజెన్, శంతను నారాయణ్, ఎన్ చంద్రశేఖరన్, పీయూష్ గుప్తా టాప్ 10లో ఉన్నారు. కాగా ఈ టాప్ సీఈవోల లిస్ట్‌లో టెక్ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, గూగుల్ సీఈవోలను ముఖేష్ అంబానీ వెనక్కి నెట్టి రెండో స్థానం దక్కించుకోవడం ఆసక్తికర అంశంగా మారింది.
ఈ జాబితాలో గ్రాఫిక్ కార్డ్స్ కంపెనీ ఎన్విడియా (Nvidia) సీఈవో జెన్సన్ హువాంగ్ నంబర్.1 పొజిషన్‌లో నిలిచారు. ఇక మహిళల విషయానికి వస్తే, ఛానల్(Chanel) సీఈవో లీనా నాయర్ 11వ స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో ఆమె హైయస్ట్ ర్యాంక్ పొందగా మరో ఆరుగురు మహిళా సీఈవోలు చోటును దక్కించుకో గలిగారు. బ్రాండ్ గార్డియన్‌షిప్ ఇండెక్స్ అనేది ఒక వార్షిక నివేదిక. ఇది ఒక కంపెనీ రెప్యుటేషన్‌ను కాపాడుకుంటూనే, కమర్షియల్ సక్సెస్ సాధించగలిగే CEOలను గుర్తిస్తుంది. ఈ నివేదికను బ్రాండ్ ఫైనాన్స్ సంస్థ రూపొందిస్తుంది.
రూ.1,700కే విమాన టికెట్.. రిపబ్లిక్ డే ఆఫర్ అదుర్స్!
బ్రాండ్ ఫైనాన్స్ 2023 రిపోర్ట్ ప్రకారం, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అయిన ముఖేష్ అంబానీ తన కంపెనీని గ్రీన్ ఎనర్జీగా మార్చడంలో అద్భుతమైన నాయకత్వ నైపుణ్యాలను చూపిస్తున్నారు. అలాగే టెలికమ్యూనికేషన్స్, రిటైల్ శాఖలకు నాయకత్వం వహిస్తూ తన వైవిధ్య నాయకత్వ లక్షణాలను ప్రదర్శిస్తున్నారు. చాలా వ్యాపారాలకు నాయకత్వం వహిస్తూనే వాటిని సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తూ అసలైన నాయకుడిగా ప్రజల్లో అభిప్రాయాన్ని పెంచుకుంటున్నారు.
ఈ బ్యాంక్‌లో అకౌంట్ ఉన్న వారికి భారీ శుభవార్త!
రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో ముఖేష్ మంచి నిర్ణయాలు తీసుకుంటూ కంపెనీని సరైన దిశలో నడిపిస్తున్నారని ప్రజలు విశ్వసిస్తున్నట్లు బ్రాండ్ ఫైనాన్స్ 2023 నివేదికలో వెల్లడించింది. అంబానీ తన కంపెనీతో పాటు దేశంలోని పారిశ్రామికవేత్తలను పాజిటివ్ చేంజ్‌కు మారేలా ఇన్స్‌పైర్ చేస్తున్నారని పేర్కొంది. అలా అతను బ్రాండ్ గార్డియన్‌షిప్ ఇండెక్స్‌లోని ‘Inspires positive change’ మెట్రిక్‌లో హై-ర్యాంకింగ్ సంపాదించి సెకండ్ ప్లేస్ సాధించారని నివేదిక వివరించింది.
ఈ జాబితాలో ఏడుగురు భారతీయ సీఈవోలు టాప్ 10లో ఉండటం విశేషం. ఇక టాప్ 10 సీఈవోల జాబితా చూస్తే ఫస్ట్ ప్లేస్‌లో ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్, సెకండ్ ప్లేస్‌లో రిలయన్స్ సీఈవో ముఖేష్ అంబానీ, థర్డ్ ప్లేస్‌లో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, ఫోర్త్ ప్లేస్‌లో అడోబ్ సీఈవో శంతను నారాయణ్, ఫిఫ్త్ ప్లేస్‌లో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, సిక్స్త్ ప్లేస్‌లో డెలాయిట్ సీఈవో పునిత్ రెంజెన్, సెవెన్త్ ప్లేస్‌లో ఎస్టీ లాడర్ సీఈవో ఫాబ్రిజియో ఫ్రెడా, ఎయిత్ ప్లేస్‌లో టాటా సీఈవో నటరాజన్ చంద్రశేఖరన్, నైన్త్ ప్లేస్‌లో డిబిఎస్ సీఈవో పీయూష్ గుప్తా, టెన్త్ ప్లేస్‌లో టెన్సెంట్ సీఈవో హువాటెంగ్ మా నిలిచారు. కాగా ప్రపంచవ్యాప్తంగా సీఈవోలకు సరిగ్గా ర్యాంక్స్ ఇచ్చేందుకు ఒక బాలెన్స్డ్ స్కోర్‌కార్డ్ రూపొందించినట్లు నివేదిక పేర్కొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mukesh Ambani, Reliance group, Reliance Industries, Satya Nadella, Sundar pichai