రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ @ రూ.9.5 లక్షల కోట్లు

నవంబర్ 19 ట్రేడింగ్ లో ఆర్ఐఎల్ షేరు విలువ ఇంట్రాడేలో గరిష్టంగా 3.87 శాతం లాభపడి, తొలిసారి రూ.1500 లాభపడింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు విలువ గడిచిన సంవత్సర కాలంలో దాదాపు 31 శాతం లాభపడింది.

news18-telugu
Updated: November 19, 2019, 7:53 PM IST
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ @ రూ.9.5 లక్షల కోట్లు
రిలయన్స్ ఇండస్ట్రీస్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఆయిల్, టెలికాం మొదలు రిటైల్ రంగం వరకూ పలు కీలక రంగాల్లో అగ్రగామిగా నిలిచిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో అరుదైన ఘనత సాధించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.9.5 లక్షల కోట్లను తాకింది. నవంబర్ 19 ట్రేడింగ్ లో ఆర్ఐఎల్ షేరు విలువ ఇంట్రాడేలో గరిష్టంగా 3.87 శాతం లాభపడి, తొలిసారి రూ.1500 లాభపడింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు విలువ గడిచిన సంవత్సర కాలంలో దాదాపు 31 శాతం లాభపడింది. మంగళవారం ఇంట్రాడేలో రిలయన్స్ షేరు ధర గరిష్టంగా రూ.1,514.95 తాకింది. అలాగే మార్కెట్ క్యాప్ సైతం రూ.9,60,350.88 కోట్లుగా నమోదైంది. బీఎస్ఈలో మార్కెట్ ముగిసే సమయానికి ఆర్ఐఎల్ షేరు ధర రూ.1,509.80 వద్ద స్థిరపడింది. డాలర్ మారకంలో రిలయన్స్ మార్కెట్ క్యాప్ విలువ $133.20 బిలియన్ డాలర్లుగా ఉంది. మరోవైపు గ్లోబల్ బ్రోకరేజ్ మోర్గన్ స్టాన్లీ టార్గెట్ ధర రూ.2000గా నిర్ధారించింది.

First published: November 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...