RIL AGM: కాసేపట్లో రిలయన్స్ ఏజీఎం సమావేశం...కీలక నిర్ణయాలపైనే అందరి దృష్టి

RIL AGM Meeting | ఈ మధ్యాహ్నం 2 గం.లకు రిలయన్స్ ఇండిస్ట్రీస్ తన లక్షలాది షేర్ హోల్డర్లతో ఏజీఎం(Annual General Meeting)సమావేశం జరపనుంది. RIL వార్షిక సర్వసభ్య సమావేశాల్లో ప్రస్తుత సమావేశం నలభై మూడవది కావడం విశేషం.

news18-telugu
Updated: July 15, 2020, 12:02 PM IST
RIL AGM: కాసేపట్లో రిలయన్స్ ఏజీఎం సమావేశం...కీలక నిర్ణయాలపైనే అందరి దృష్టి
ముఖేష్ అంబానీ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
రిలయన్స్ ఇండిస్ట్రీస్ లిమిటెడ్ 43వ ఏజీఎం(Annual General Meeting) సమావేశం ఇవాళ మధ్యాహ్నం 2 గం.లకు ప్రారంభంకానుంది.  తన లక్షలాది షేర్ హోల్డర్లతో ఈ సమావేశం జరపనుంది.ఆన్‌లైన్‌లో రిలయన్స్ మదుపర్లు ఏజీఎంను వీక్షించేందుకు సాంకేతిక ఏర్పట్లు చేశారు.   ముంబైలో లాక్డౌన్ అలాగే కరోనా పరిమితుల దృష్ట్యా మొదటిసారిగా వర్చువల్ గా నిర్వహించనున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేష్ అంబానీ ఈ సమావేశంలో ఎలాంటి ప్రకటనలు చేయనున్నారన్నది ఇన్వెస్టర్లతో పాటు పారిశ్రామిక వర్గాల్లో ఆసక్తిరేపుతోంది.  ఆగష్టు 2019 లో చివరి సారిగా జరిగిన AGMలో, RIL నాలుగు కార్యాచరణ ప్రణాళికలను ప్రకటించగా అందులో చాలా వరకూ లక్ష్యాలను చేరుకున్నాయి

వీటిలో ప్రధానంగా...

1. మార్చి 2021 నాటికి రుణరహిత సంస్థగా మార్చడానికి రోడ్‌మ్యాప్
2. జియో, రిలయన్స్ రిటైల్‌లో పెట్టుబడుల సేకరణ.
3. అరామ్‌కోతో దాని ఆయిల్-టు-కెమికల్ డివిజన్ (O2C)లో 20 శాతం కొనుగోలు
4. రియల్ ఎస్టేట్, ఆర్థిక పెట్టుబడులతో పాటు టవర్ / ఫైబర్ మౌలిక సదుపాయాల పెట్టుబడుల కోసం ట్రస్టుల ఏర్పాటు.

అయితే షెడ్యూల్ కంటే ముందే జీరో నెట్ డెట్ కంపెనీగా మారుతానని ఇచ్చిన హామీ మేరకు కంపెనీ ఇప్పటికే నిలబెట్టుకుంది. ఇక రిలయన్స్ అత్యధికంగా రూ. 1.17 లక్షల కోట్లను, దాని టెక్నాలజీ ఆర్మ్ జియో ప్లాట్‌ఫామ్స్‌లో వాటాలను విక్రయించి సేకరించింది. ఫేస్‌బుక్‌తో సహా ప్రపంచ సంస్థలు ఇందులో వాటాలను కొనుగోలు చేశాయి.అగ్రశ్రేణి మార్కెట్ విశ్లేషకులందరూ AGM గురించి అంచనా వేస్తున్నారు. అందులో ప్రధానంగా సంస్థ డిజిటల్ గేమ్ ప్లాన్‌కు సంబంధించినదే కావడం విశేషం. బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనా వేస్తూ... "దేశం నాల్గవ పారిశ్రామిక విప్లవం (4IR)లో ప్రవేశిస్తోందని, ఇందులో భాగంగా డిజిటల్ పోకడలను RILఎలా ఉపయోగించుకోవాలో ఏజీఎంలో కీలక నిర్ణయాలు తీసుకోవచ్చని అంచనా వేస్తున్నారు.

ఇదిలా ఉంటే రిలయన్స్ ఉత్తమ పనితీరు కలిగిన మెగా-క్యాప్ స్టాక్ గా ప్రపంచవ్యాప్తంగా టాప్ -5 ఉత్తమంగా పనిచేసే స్టాక్స్‌లో ఉన్న ఏకైక నాన్ అమెరికన్ సంస్థగా గుర్తింపు పొందడం విశేషం. మార్కెట్ క్యాపిటలైజేషన్‌ పరంగా చూసినట్లయితే దాదాపు రూ. 12 లక్షల కోట్ల విలువను రిలయన్స్ సొంతం చేసుకుంది.
Published by: Krishna Adithya
First published: July 15, 2020, 12:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading