హోమ్ /వార్తలు /బిజినెస్ /

Reliance Industries AGM: నేడే రిలయన్స్ ఇండస్ట్రీస్ యాన్యువల్ జనరల్ మీటింగ్.. లైవ్ స్ట్రీమ్‌ ఇలా చూడొచ్చు..

Reliance Industries AGM: నేడే రిలయన్స్ ఇండస్ట్రీస్ యాన్యువల్ జనరల్ మీటింగ్.. లైవ్ స్ట్రీమ్‌ ఇలా చూడొచ్చు..

Reliance Industries AGM: నేడే రిలయన్స్ ఇండస్ట్రీస్ యాన్యువల్ జనరల్ మీటింగ్.. లైవ్ స్ట్రీమ్‌ ఇలా చూడొచ్చు..

Reliance Industries AGM: నేడే రిలయన్స్ ఇండస్ట్రీస్ యాన్యువల్ జనరల్ మీటింగ్.. లైవ్ స్ట్రీమ్‌ ఇలా చూడొచ్చు..

Reliance Industries AGM: వరుసగా మూడో ఏటా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరుగుతున్న ఈ ఈవెంట్ ఈ సారి మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ ఈవెంట్‌లో రిలయన్స్ ఎలాంటి భారీ ప్రకటనలు చేస్తుందోనని దేశవ్యాప్తంగా పెట్టుబడిదారులు, విశ్లేషకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

దేశీయ వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) నేడు (ఆగస్టు 29) నిర్వహించనున్న యాన్యువల్ జనరల్ మీటింగ్ (Annual General Meeting)పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సోమవారం జరగనున్న ఈ ఈవెంట్‌లో రిలయన్స్ ఎలాంటి భారీ ప్రకటనలు చేస్తుందోనని దేశవ్యాప్తంగా పెట్టుబడిదారులు, విశ్లేషకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2021లో గ్రీన్ ఎనర్జీలోకి రిలయన్స్ అడుగుపెట్టగా.. 2020లో మైనారిటీ పెట్టుబడిదారుగా గూగుల్‌ (Google)ని ప్రకటించింది. వరుసగా మూడో ఏటా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరుగుతున్న ఈ ఈవెంట్ ఈ సారి మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. RIL ఛైర్మన్ ముఖేష్ అంబానీ (Mukesh Ambani) సమావేశంలో ప్రసంగిస్తారు. కంపెనీ బోర్డు, అనుబంధ సంస్థలలోని ఇతర సభ్యులు కూడా ప్రసంగించనున్నారు.


రిలయన్స్ ఇండస్ట్రీస్ నిఫ్టీ 50 ఇండెక్స్‌ మూవ్‌మెంట్‌పై చాలా ప్రభావమే చూపిస్తుంది. ఎందుకంటే రిలయన్స్ స్టాక్‌కు నిఫ్టీ 50లో అత్యధిక వెయిటేజ్ ఉంటుంది. రిలయన్స్ షేర్లు యాన్యువల్ జనరల్ మీటింగ్ (AGM)కి ముందు, తర్వాత గణనీయంగా కదులుతున్నాయి. ఈవెంట్ అనంతరం రిలయన్స్ షేర్లు పెరుగుతాయని గత సమావేశాల తర్వాత పరిస్థితిని పరిశీలిస్తే తెలుస్తోంది. ఈ సమావేశంలో జియో ప్లాట్‌ఫామ్‌లు, రిలయన్స్ రిటైల్‌ల లిస్టింగ్ టైమ్‌లైన్‌ను ప్రకటించే అవకాశముంది.


కొత్త ఎనర్జీ బిజినెస్ పై కూడా ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది. సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ బ్యాటరీలు, గ్రీన్ హైడ్రోజన్, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ తయారీకి నాలుగు గిగాఫ్యాక్టరీలను 80 బిలియన్ డాలర్ల పెట్టుబడితో నిర్మించాలని కంపెనీ యోచిస్తోంది. అలాగే 5G సేవలు, 5G ఫోన్‌ను తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. వీటిపై కూడా ప్రకటనలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ప్రకటనలే ఈ సర్వసభ్య సమావేశంలో వెలువడితే స్టాక్ పాజిటివ్ మూవ్ కనబరుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.


* మీటింగ్ సమయం, తేదీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ 45వ యాన్యువల్ జనరల్ మీటింగ్ (AGM) ఆగస్టు 29న వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మధ్యాహ్నం 2:00 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ ఈవెంట్ వివిధ ప్లాట్‌ఫామ్‌లలో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. అవేవో ఇప్పుడు చూద్దాం.


* జియోమీట్

https://jiomeet.jio.com/rilagm/joinmeeting

జియోమీట్‌కి వెళ్లి పై లింక్‌ని క్లిక్ చేశాక AGMలో చేరడానికి 'OTHERS'పై క్లిక్ చేయాలి. మీ పూర్తి పేరు, సంస్థను, మీ స్క్రీన్‌పై కనిపించే క్యాప్చా కోడ్‌ని ఎంటర్ చేయాలి. ఈవెంట్ షెడ్యూల్ చేసిన సమయానికి 30 నిమిషాల ముందు నుంచే యాక్సెస్ ఉంటుంది.


* RTMP URL: డైరెక్టర్ స్ట్రీమింగ్

ప్రైమరీ స్ట్రీమ్ లింక్- rtmp://136.233.57.194:1935/event/RILAGM_MAIN2022


* యూట్యూబ్

రిలయన్స్ అప్‌డేట్స్ ఛానెల్ https://www.youtube.com/user/flameoftruth2014

ఈవెంట్ లైవ్ స్ట్రీమ్ చూసేందుకు క్లిక్ చేయాల్సిన URL: https://youtu.be/TS8FYk5RhlY


* ఫేస్‌బుక్

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పేజీ: https://www.facebook.com/RelianceIndustriesLimited

ప్లేబ్యాక్ URL: https://www.facebook.com/events/610199153827102/


* జియో పేజీ: https://www.facebook.com/Jio

ప్లేబ్యాక్ URL: https://www.facebook.com/events/484097953163347/


* ట్విట్టర్

@FlameOfTruth https://twitter.com/flameoftruth

ప్లేబ్యాక్ URL: https://twitter.com/i/broadcasts/1PlJQaOpPDVJE

@RelianceJio (https://twitter.com/reliancejio)

ప్లేబ్యాక్ URL: https://twitter.com/i/broadcasts/1DXxyDWvjgkJM


* కూ యాప్

రిలయన్స్ అప్‌డేట్స్‌కి- https://www.kooapp.com/profile/RelianceUpdates

ప్లేబ్యాక్ URL: https://www.kooapp.com/koo/RelianceUpdates/7c68d5a8-4e12-4e52-9491-62e5524174e7

First published:

Tags: Mukesh Ambani, Reliance Foundation, Reliance Industries, RIL

ఉత్తమ కథలు